చిత్తూరు

ఇక తిరుపతికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 20 : తిరుపతిని స్మార్ట్‌సిటీగా మంగళవారం కేంద్రం ప్రకటించింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది బాణాసంచా పేల్చి, కేకు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. తొలిదశలో స్మార్ట్‌సిటీ సాధించడంలో విఫలమైనా, దాన్ని సవాల్‌గా తీసుకున్న కమిషనర్ వినయ్‌చంద్ స్మార్ట్‌సిటీకి అవసరమైన అన్ని హంగులూ ఉండేవిధంగా ప్రణాళిక రూపొందించడంతో అహోరాత్రులు కృషి చేశారు. ఇందులో సిబ్బంది సహకారం కూడా తిరుగులేనిదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌సిటీగా కేంద్రం ప్రకటించడంతో కమిషనర్ నవీన్‌చంద్‌ను ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రశంసలతో ముంచెత్తారు. జిల్లాకలెక్టర్ సిద్దార్థజైన్ ఆధ్వర్యంలో కూడా కేక్ కట్ చేసి వినయ్‌చంద్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నవీన్‌చంద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ప్రణాళిక రూపొందించామని, స్మార్ట్‌సిటీ ప్రకటనల వెనుక నగర పాలక సంస్థ కృషి కూడా ఎంతో ఉందన్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ, డాక్టర్ సుధారాణి ఆయన్ను దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో స్మార్ట్‌సిటీకి అవసరమైన రూపకల్పన చేయగలిగామన్నారు. ఇక తిరుపతి పుణ్యక్షేత్రానికి మహర్ధశే అన్నారు. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో తిరుపతి పుణ్యక్షేత్రం ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందనుంది. అనేక సమస్యలకు పరిష్కారం స్మార్ట్‌సిటీతో సాధ్యం కానుంది. ప్రతినిత్యం తిరుపతికి లక్షమందికి పైగా భక్తులు వస్తున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు కేంద్రం నిధులతో రానున్నాయి. ఏదిఏమైనా స్మార్ట్ సిటీ సహకారాన్ని సంపూర్ణం చేసిన కమిషనర్ వినయ్‌చంద్ అభినందనీయుడు. కాగా బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్‌సిటీతో తిరుపతి నగరానికి 1600 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు రానున్నాయన్నారు. దీంతో తిరుపతి నగరం ఒక అద్భుతమైన ఆకర్షణీయ నగరంగా రూపుదిద్దుకుంటుందన్నా. తిరుపతిని స్మార్ట్‌సిటీగా ప్రకటించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కమిషనర్‌ను అభినందించారు.
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో
జాప్యం చేస్తే ఊరుకోం
* ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి స్పష్టం
తిరుపతి, సెప్టెంబర్ 20: ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కమిషన్ చైర్మన్ కారెం శివాజి హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన తిరుపతిలో జిల్లాకలెక్టర్, అర్బన్ ఎస్పీ, చిత్తూరు ఎస్పీ, పలువురు అధికారులతో ఎస్సీ, ఎస్టీ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల్లో సత్వర పరిహారం చెల్లించాలని, కులధ్రువీకరణ తదితర సర్ట్ఫికెట్ల జారీలో జాప్యం ఉండరాదని, వారిపై దాడులను వారించి, దాడులు చేసిన వారిపై వెంటనే ఛార్జ్‌షీట్లు పెట్టాలని ఆదేశించారు. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారికోసం చంద్రన్న బీమా పథకం ఉందన్నారు. కేవలం 15 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం వస్తుందన్నారు. గ్రామాలు, మండలాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీల నాయకులు ఈ కార్యక్రమాన్ని వివరించి చంద్రన్న బీమాకు ప్రీమియం కట్టించాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఇళ్ల పట్టాలకు తీవ్ర సమస్య ఉందని, స్పెషల్ డ్రైవ్ పెట్టి స్థలాలు మంజూరుకు కృషి చేస్తానన్నారు. గిరిజనులు తరతరాలుగా అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండి పనులు చేసుకుంటారని, వారిని అటవీశాఖ అధికారులు వేధించరాదన్నారు. పచ్చికాపల్లం కేసు విషయంలో రాజీపడని అధికారులు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కృషి చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి కేసుల వివరాలను అర్బన్ ఎస్పీ జయలక్ష్మి వివరిస్తూ 56 కేసుల్లో రెండు కేసుల్లో ఛార్జిషీట్ ఫైల్ చేయడం జరిగిందని, 23 కేసుల విషయంలో విచారణ పూర్తయిందన్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ 52 కేసులు ఉన్నాయని తెలిపారు. అటవీ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారం భూములను ఇవ్వడానికి చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. తిరుమల పాపవినాశంలో పూసలు అల్లుకొని జీవిస్తున్న నక్కల జాతుల వారిని టిటిడి అటవీశాఖ అధికారులు పెడుతున్న ఇబ్బందులపై ఈ నెల 23న సంబంధిత అధికారులతో, బాధితుల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమం జెసి, అటవీశాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

2020 నాటికి పర్యాటక రంగాన్ని
మరింతగా అభివృద్ధి చేస్తాం
* ఐదులక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం
రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, సెప్టెంబర్ 20: రాష్ట్ర పర్యాటక రంగంలో చిత్తూరు జిల్లాను 2020 నాటికి దేశంలోనే ఒక గొప్ప పర్యాటక కేంగా తీర్చిదిద్ది ఐదు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు అందించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలపారు. మంగళవారం తిరుపతి ఎస్వీ జూపార్కు వద్ద ఎపి టూరిజం యూనిట్ సమీపంలో జిల్లాలోని టూరిజం అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో వివిధ మహిళా సంఘాలకు వృత్తి నైపుణ్య విద్యాశిక్షణా తరగతులు నిర్వహించేందుకు ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాలను ఒక ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర టూరిజం రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. తిరుపతి పర్యాటక రంగానికి సంబంధించి 10 కోట్ల మేర ప్రైవేటు పెట్టబడులను తీసుకురావడమన్నది తమ ఆలోచన అన్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మాట్లాడుతూ ప్రతినిత్యం 70 వేలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. త్వరలోనే పాకశాస్త్ర, ఫుడ్ అండ్ కరినరీ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్వయం మహిళా సంఘాలకు, గ్రామీణ యువతకు వివిధ వృత్తివిద్యాకోర్సులపై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈ శిక్షణ డిసెంబర్ మాసం నుంచి మూడునెలల పాటు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో అనేక పురాతన ఆలయాలను ఎకో టూరిజం కింద అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది నిరుద్యోగ యువతను టూరిస్టు గైడ్లుగా నియమించేందుకు చర్యలు చేపడతామన్నారు. చంద్రగిరి కోటలో రోప్‌వే సౌకర్యం ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రాయల చెరువు, ఆరణియార్ ప్రాజెక్టులో పర్యాటక రంగం ఆధ్వర్యంలో బోర్డు సభ్యులను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగం రెండంకెల అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పులిగొండు, పులిమళ్లం, శ్రీనివాస మంగాపురం, నారాయణ వనం, కైలాసనాథకోన, సురుటుపల్లి, గుర్రంకొండ తదితర ధార్మిక క్షేత్రాలను యాత్రికులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర పర్యాటక రంగాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం తరువాత యువతకు ఉపాధి అవకాశాలు ఇచ్చే గొప్ప రంగం పర్యాటక రంగం అన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. త్వరలో తిరుపతిలో ఆక్వాకల్చర్ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నుంచి అనుమతి కూడా పొందామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగం రీజనల్ డైరెక్టర్ చంద్రవౌళి, తిరుపతి డివిజనల్ మేనేజర్ సురేష్‌రెడ్డి, టూరిజం అధికారులు పాల్గొన్నారు.

సిలిండర్ పేలి ఆటో దగ్ధం
వికోట, సెప్టెంబర్ 20: మండల కేంద్రంలోని భరత్‌నగర వద్ద మంగళవారం రాత్రి ఆటోలో అమర్చిన సిలెండర్ పేలి ఆటో పూర్తిగా కాలిగా, తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సులేమాన్ అనే వ్యక్తి ప్యాసింజర్ ఆటోతో జీవనం సాగించే వాడు, తన ఆటోకు సిలెండర్ బిగించుకోని అటోను నడుపుతూ ఉండే వాడు, ఈ క్రమంలో భరత్‌నగర్ వద్ద నిలిపి ఉన్న ఆటోలోని సిలెండర్ పేలి పోవడంతో ఆటోపూర్తిగా కాలిపోయంది. ఈ సమయంలో అటోలో ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. అలాగే సమీపంలో ఇండియన్ గ్యాస్ గోదాము ఉంది. మంటలు వ్యాపించక పోవడంతో పెను ప్రమాదం తప్పింది.
‘సమస్యలను దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం’
తవణంపల్లె, సెప్టెంబర్ 20: పూతలపట్టు నియోజకవర్గంలోని మండలాల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని టిడిపి ఇన్‌చార్జి లలితకుమారి అన్నారు. మంగళవారం సాయంత్రం సిడిఎం కల్యాణ మండపంలో నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆయా మండలపార్టీ అధ్యక్షులు వారివారి మండలాల అభివృద్ధికి నిర్ణయించిన అభివృద్ధి పనుల వివరాలను తమదృష్టికి తీసుకువస్తే పార్టీ అధిష్టానానికి పంపి పరిష్కరిస్తామని అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
విష జ్వరంతో చిన్నారి మృతి
పెద్దపంజాణి, సెప్టెంబర్ 20: విషజ్వరంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పెద్దపంజాణి పంచాయతీ, బెరబల్లికు చెందిన మునిబాబు, విషాలక్ష్మి కుమార్తె గీత(2)లు విషజ్వరంతో సోమవారం రాత్రి తిరుపతిని ఓ ప్రైవేట్ అసుపత్రిలో మృతి చెందింది. వివరాలిలా వున్నాయి. మునిబాబు, విశాలక్ష్మిల కుమార్తె గీత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. గీత తల్లిదండ్రులు పలమనేరు, పుంగనూరు, పెద్దపంజాణిలోని ప్రైవేట్ అసుపత్రులలో వైద్యం నిర్వహించారు. సోమవారం ఉదయం గీతకు జ్వరం ఎక్కువ రావడంతో పుంగనూరులోని ఓ ప్రైవేట్ చిన్నప్లిలల అసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ పరీక్షలు నిర్వహించి మదనపల్లెకు రెఫర్ చేశారు. అప్పటికి చిన్నారి గీత పరిస్థితి విషమించడంతో మదనపల్లె టూ తిరుపతికి రెఫర్ చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ అసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడగా విషజ్వరం అని వైద్యులు నిర్ధారించారు. చికిత్స నిర్వహించిన గంటలోనే చిన్నారి మృతి చెందింది. దీంతో విషాధచాయలు నెలకొన్నాయి.
పాకాల పోలీసుల అదుపులో
నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా
పాకాల, సెప్టెంబర్ 20: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించి వారి నుంచి రక్తపరీక్షలు చేపడుతున్న ఒక ముఠాను మంగళవారం పాకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి సమీపంలోని నిమ్మనపల్లికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దామలచెరువుకు తీసుకొచ్చిన కొందరు వ్యక్తులు అతని నుంచి రక్తపరీక్షల నమూనాను సేకరించి నెలరోజుల పాటు మందులు వాడాలని సూచించారు. దీంతో భయపడ్డ యువకుడు బంధువులకు సమాచారం అందించడంతో దామలచెరువుకు చెందిన ఇద్దరిని పాకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టి వారి నుంచి కిడ్నీలు, ఇతరత్రా అవయవాలను తస్కరించే పనిలో ఈ ముఠా ఉన్నట్లుగా పాకాల పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది. మొత్తంమీద ఈ ముఠా సభ్యులు పలువురు నిరుద్యోగ యువకులను మాయమాటలతో మోసం చేసి వారి అవయవాలను విక్రయించినట్లుగా తెలుస్తోంది. పాకాల పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
చెన్నై విమానాశ్రయానికి స్పైస్ జెట్ విమానం తరలింపు
రేణిగుంట, సెప్టెంబర్ 20: శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయంలో ప్రమాదవశాత్తూ రన్‌వే నుంచి కిందకు దిగిన ఘటనలో స్పైస్‌జెట్ విమానాన్ని మంగళవారం పరీక్షల నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి ఏవియేషన్ అధికారుల ఆదేశాల మేరకు తరలించారు. మంగళవారం విచారణ బృందం విమానాశ్రయంలోని రన్‌వే పైన స్పైస్‌జెట్ విమానం ప్రమాదంపై ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రమాదం జరిగిన చోట ప్రణాళికాబద్ధంగా మ్యాప్‌లు గీసి పూర్తి నివేదికను ఢిల్లీలోని డిఇసిసిఐకు విచారణ బృందం అప్పజెప్పనుంది.

తుపాకి కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం
* పోలీసుల అదుపులో కిరాయి హంతకులు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, సెప్టెంబర్ 20: పెనుమూరు మండలం పూనే పల్లిలో ఇటీవల తుపాకి కాల్పులకు పాల్పడిన ఘటపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది కిరాయి ముఠా సభ్యులేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల పూనేపల్లివద్ద మురగారెడ్డికుమారుడు దినేష్‌కుమార్‌పై తుపాకి కాల్పులు పాల్పడిన సంగతి తెలిసిందే, ఈఘటనలో గాయబడిన దినేష్‌రెడ్డిఅనంతరం ఆసుపత్రిలో కోలుకొన్నాడు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్నిసీరియస్‌గా తీసుకొన్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తును చేపట్టారు. ఇందులో కిరాయి ముఠా పాలుపంచుకొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇదే మండలానికి చెందిన వ్యక్తిని హతమార్చడానికి వచ్చిన ఈ హంతకులు ముఠా, అక్కడ సాధ్యం కాకపోవడంతో వెనుతిరిగినట్లు సమాచారం. ఇంతలోనే ఈ ముఠా తుపాకులతో బయపెట్టి దొపిడికి పాల్పడాలని నిర్ణయించి మార్గమద్యంలోని పూనేపల్లివద్ద మురగారెడ్డి ఇంటిపై దాడికి యత్నించినట్లు తెలిసింది. ముందగా ఈ హంతకులు ముఠా మురగారెడ్డి కుటుంబాన్ని తుపాకీతో బెదిరించి దొపిడీకి పాల్పడాలని భావించినా, అతని కుమారుడైన దినేష్‌కుమార్ ఎదురు తిరగడంతో అక్కడ పెనుగులాట చోటుచేసుకొంది, దీంతో వారు కాల్పులకు పాల్పడంతో దినేష్‌గాయపట్టాడు. మురగారెడ్డి కుటుంబ సభ్యులు అరుపులు కేకలు వేయడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం పోలీసులు ఈకేసును దర్యాప్తుచేపట్టి దుండగులు ఊహా చిత్రాలను సైతం విడుదల చేసారు. ఈ ఘటనకు పాల్పడిన కిరాయి హంతకులు ముఠాను పోలీసులు గుర్తించి అందులో కొందరిని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. ఈఘటనలో కొందరు స్థానికులు ప్రమేయం కూడా ఉండటంతో పోలీసుల ఈదిశగా విచారణ చేపట్టారు. ప్రస్తుతం అదుపులో వున్న వారిచేత వివరాలు రాబట్టె ప్రయత్నంలో పోలీసులున్నట్లు తెలిసింది.
బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట
* టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి
తిరుమల, సెప్టెంబర్ 20: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు దర్శనం, బస విషయంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుమలలో అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు, ఇతర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం కల్పించాలని పత్రికలు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులను కోరారు. టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు మట్లాడుతూ బ్రహ్మోత్సవాల రోజుల్లో పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలన్నింటిని రద్దు చేశామని తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్‌లెట్ ఆవిష్కరణ
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు కలిసి ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్‌లెట్‌ను ముద్రించాలని టిటిడి చైర్మన్, ఇఓతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రశంసించారు.

కామధేనువు వాహనంపై ఊరేగిన శివపుత్రుడు
ఐరాల, సెప్టెంబర్ 20: కాణిపాకం వినాయకుని ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శివపుత్రుడు గణనాథుడు కామథేనువు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి ఉభయదారులు కాణిపాకం నాయి బ్రాహ్మణులు వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి దూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తుల సర్వ దర్శనానికి అనుమతించారు. రాత్రి సిద్దిబుద్ధి సమేత వినాయకస్వామి వారికి ఉభయదారులు ఉభయ వరుస తీసుకు రాగా ఆలయ అలంకార మండపంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసారు. వేదపండితుల మంత్రోశ్చరణల మధ్య స్వామివారిని కామథేను వాహనంపై ఆశీనులు చేసారు. వాహనంపై విఘ్ననాథుడు కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల మధ్య వినాయకస్వామి భక్తులకు కనువిందు చేసారు. ఈకార్యక్రమంలో ఇఒ పూర్ణచంద్రరావు, ఎఒ కేశవరావు, ఉభయదారులు భక్తులు పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు:-
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పూలంగిసేవ చేయనున్నారు.

‘ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి’
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, సెప్టెంబర్ 20: యూరిలోని భారత సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పలువురు వ్యక్తలు డిమాండ్ చేసారు. మంగళవారం సాయంత్రం చిత్తూరులోని గాంధీ విగ్రహంవద్ద ఈదాడిలో మృతి చెందిన వీర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలు ఏకాకిని చేయాలని పిలుపు నిచ్చారు. ఉగ్రవాద సంస్థలపై ప్రతిదేశం గట్టిచర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు దాడిలో అసువులు బాసిన కుటుంబాలకు అందురు అండగా నిలవాలన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి నేతలు బాలాజీ నాయుడు. ఇందిరమ్మ, మోహన్ రాజ్, బిజెపి నేతలు శ్రీనివాస్, జయకుమార్, పలవురు నగర వాసులు ప్రముఖులు పాల్గొన్నారు.

ఐదుగురు పాత నేరస్తులు అరెస్ట్
తిరుపతి, సెప్టెంబర్ 20: తిరుపతి, పెనుమూరు, వెదురుకుప్పం, పుంగనూరు, కోడూరు ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఈశ్వర్‌దాము, వినోద్‌కుమార్‌నాయక్, పులి నరేష్, టి యువరాజ్, గణేష్‌లను క్రైం పోలీసులు చెర్లోపల్లి రోడ్డులో మంగళవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5.5 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, ఒక్క ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో అడిషినల్ ఎస్పీ సిద్దారెడ్డి, డిఎస్పీ కొండారెడ్డి, సిఐ భాస్కర్, సత్యనారాయణ, పద్మలత, ఎస్‌ఐ ప్రభాకర్, చంద్రశేఖర్ పిళ్లై, రామ్మూర్తి, కెనడి, సుదర్శన్, మోహన్ గౌడ్, సిబ్బంది సుధాకర్, మునిరాజ తదితరులు పాల్గొన్నారు.