చిత్తూరు

మాడవీధుల్లోని గ్యాలరీల్లో కట్టుదిట్టమైన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 27: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి తిరుమల జె ఇ ఓ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గేట్లను టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు మంగళవారం సాయంత్రం టిటిడి విజిలెన్స్, ఇంజనీరింగ్, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జె ఇ ఓ విలేఖరులతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున మాడవీధుల్లోని గ్యాలరీల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు రాంభగీచ విశ్రాంతి గృహం, పడమర మాడ వీధిలోని డబ్ల్యూ 7 గేటు వద్ద భక్తుల సౌకర్యార్థం స్వల్పమార్పులు చేపట్టామన్నారు. వాహన సేవలకు విచ్చేసే భక్తులు చిల్లరనాణేలు తీసుకురాకూడదని విజ్ఞప్తి చేశారు. వాహనసేవలు ముగియగానే త్వరగా వెలుపలకు వచ్చేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్ గేట్లను ఏర్పాటుచేశామని, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు వీలుగా అత్యవసర గేట్లను పొందుపరిచామని వివరించారు. గరుడసేవ నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు. జె ఇ ఓ వెంట ఎ ఎస్పీ త్రిమూర్తులు, డి ఎస్పీ మునిరామయ్య, టిటిడి ఎస్‌ఇ-2 రామచంద్రారెడ్డి, విఎస్‌ఓ రవీంద్రారెడ్డి, ఇ ఇ ప్రసాద్, సి ఐ వెంకటరవి ఇతర అధికారులు ఉన్నారు.