చిత్తూరు

లైసెన్సులేని హోటళ్ల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 18: తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా విస్తృతంగా హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించారు. మూడో రోజైన మంగళవారం లైసెన్సులేని హోటల్స్‌ను ఆరోగ్యశాఖాధికారులు మూసివేశారు. ఉదయం 7 గంటల నుంచి భవానీ నగర్ కూడలి నుంచి నంది కూడలి వరకు తనిఖీలు నిర్వహించి పరిశుభ్రంగ లేని హోటల్ యజమానులకు జరిమానాలు విధించారు. అపరిశుభ్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్ యజమానులను మందలించి 3రోజుల్లోగా ఈ లోపాలను సవరించి తిను పదార్థాల రేట్ల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లు, కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి, హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి వచ్చే వ్యర్థాలను తడి, పొడి చెత్తలుగా వేరుచేయాలని, తడిచెత్తను నగర పాలక సంస్థ ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని తెలిపారు. అలాగే నగర పరిధిలో, ఖాళీ స్థలాల యజమానులకు స్థలంలో పిచ్చిమొక్కలు పెరకకుండా చెత్తాచెదారం పడకుండా కాంపౌండ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అలాకాని పక్షంలో ప్రజా ఆరోగ్య దృష్ట్యా యజమానులపై నగర పాలక చట్టం ప్రకారం అండర్ సెక్షన్ 496 కింద చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. ఉషాకుమారి, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.