చిత్తూరు

హైదరాబాద్ వెళ్తూ వెనుదిరిగిన స్పైస్ జెట్ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, అక్టోబర్ 27: హైదరాబాద్‌కు వెళ్తూ మార్గ మధ్యంలో సాంకేతిక కారణాల వల్ల స్పైస్‌జెట్ విమానం వెనుదిరిగిన సంఘటన గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పుల్లా తెలిపిన వివరాల మేరకు గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి 74 మంది ప్రయాణీకులతో హైదరాబాద్‌కు సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం మార్గమధ్యంలో అరగంట అనంతరం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గుర్తించిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కు తిప్పి రేణిగుంట విమానాశ్రయానికి ప్రయాణీకులతో సురక్షితంగా చేరుకున్నారని తెలిపారు. విమానానికి తలెత్తిన సాంకేతిక సమస్యలను నిపుణులు పరీక్షించి సమస్య తీరిన అనంతరం ప్రయాణీకులను స్పైస్ జెట్ విమానంలో హైదారాబాద్‌కు తరలిస్తామని, సాంకేతిక సమస్య జటిలం అయితే విమాన ప్రయాణం రద్దుచేస్తామని, విమానంలోని ప్రయాణీకులు విమానాశ్రయం వెలుపల విశ్రాంతి గదులో వేచి ఉండాలని సూచించారు.