చిత్తూరు

తరతరాల సంస్కృతికి చిరునామా మనగుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 14: హైందవ సనాతన ధర్మానికి ప్రతీకలుగా అలరారుతున్న దేవాలయాల వైశిష్ట్యాన్ని నేటి తరానికి అందించడమే ధ్యేయంగా టిటిడి మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో సోమవారం 8వ విడత మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రపంచానికి ధర్మచింతనలో వెలుగుచూసిన ఘనత భారతదేశానిదే అన్నారు. భక్తకోటి వద్దకే భగవంతుడు అనే నినాదంతో టిటిడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి అమెరికాలోని న్యూజెర్సీ, డెల్లాస్‌లో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. టిటిడి, దేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12,500 ఆలయాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గోపూజ నిర్వహించి భక్తులకు గోవిందరక్ష కంకణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, టిటిడి అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.