చిత్తూరు

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, డిసెంబర్ 6: పలుప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పూతలపట్టు పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి 5.25 లక్షల విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ లక్ష్మీనాయుడు కథనం మేరకు తమిళనాడుకు చెందిన సత్యానంద్ (44), జవహార్ (24) మరో బాల నేరస్తుడు కలిసి తిరుపతి, తిరుచానూరు, తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించి వాటిని తమిళనాడు రాష్ట్రం కాడ్పాడిలో విక్రయించి సొమ్ము చేసుకోనే వారని తెలిపారు. సోమవారం రాత్రి పూతలపట్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వీరు అనుమానాస్పదంగా సంచరిస్తుండంతో అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసిందన్నారు. దీంతో ఇటీవల తిరుపతి, తిరుచానూరు తదితర ప్రాంతాల్లో చోరికి గురైన 16 ద్విచక్ర వాహనాలను వీరివద్ద నుంచి స్వాధీనం చేసుకొని, మంగళవారం వారిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర మహించిన సిఐ రామలింగయ్య, ఎస్సై మురళీమోహన్లకు ఐడి పార్టీకి రివార్డులను అందిజేయనున్నట్లు డిఎస్పీ తెలిపారు.