చిత్తూరు

పునరుత్పత్తి విజ్ఞానాన్ని రైతులకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6: సాంకేతిక పునరుత్పత్తి విభాగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఆధునిక పరిజ్ఞానంతో కూడుకున్న విజ్ఞానాన్ని రైతులకు అందించాలని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విసి మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో పశుపునరుత్పత్తి విభాగంలో పశుపునరుత్పత్తి-సాంకేతిక పద్ధతులతో పునరుత్పత్తి పెంపొందించడం అనే అంశంపై మూడురోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ మనోహ్మన్‌సింగ్ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో కూడుకున్న విజ్ఞానాన్ని పాడి రైతులకు అందించేందుకు దృష్టి సారించాలన్నారు. మహారాష్ట్ర వెటర్నరీ యూనివర్శిటీ విసి డాక్టర్ ఎకె మిశ్ర మాట్లాడుతూ పిండమార్పిడి విధానం, సక్సీడ్‌సెమెన్ విజ్ఞానంతో పునరుత్పత్తికి వినియోగించే ఆంబోతులను, జాతీయ అవులను ఉత్పత్తి చేసుకోవచ్చని అన్నారు. ఈ సందర్బంగా పలువురు శాస్తవ్రేత్తలకు జీవనసాఫల్య పురస్కారం, యంగ్ సైంటిస్ట్ అవార్డు, బెస్ట్ రీసెర్చ్ అవార్డు, బెస్ట్ ఎక్స్‌టెంపోర్ అవార్డులను ప్రదానం చేశారు. అలాగే పాడి రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన సిడిలు, పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 300 మంది ప్రతినిధులు, పశుసంవర్ధకశాఖ సంచాలకులు డాక్టర్ సోమశేఖర్, కర్ణాటక వెటర్నరీ యూనివర్శిటీ విసి డాక్టర్ శ్రీనివాసులుగౌడ్, కేరళ పశుసంవర్థక సిఇఓ డాక్టర్ జోస్‌జేమ్స్, టాస్క్ఫోర్స్ డిఐజి సాంబశివరావు, డీన్‌లు డాక్టర్ టి చంద్రశేఖర్, పశువైద్య కళాశాల పునరుత్పత్తి విభాగాధిపతి డాక్టర్ వౌళిక్రిష్ణ, డాక్టర్ త్రివేణి, డాక్టర్ రాంబాబు నాయక్ తదితరులున్నారు.