చిత్తూరు

కాపు ఉద్యమంలో హైడ్రామాలు ఎందుకు ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, డిసెంబర్ 25: రాష్ట్రంలో కాపుల సమస్యలపై నిజమైన ఉద్యమాలు చేయాలని, వైకాపా నేత జగన్ ఆదేశాలతో చేస్తున్న ఉద్యమాలలో హైడ్రామాలు ఎందుకని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు కాపునేత ముద్రగడను ప్రశ్నించారు. ఆదివారం మదనపల్లెకు వచ్చిన టిడిపి నేత ముద్దుకృష్ణమనాయుడుకు మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, వైస్‌చైర్మన్ భవానిప్రసాద్, కౌన్సిలర్లు స్వాగతం పలికారు. ముందుగా రాయలసీమ క్రైస్తవ చరిత్ర కలిగిన జెసిఎం సిఎస్‌ఐ చర్చికు వెళ్లారు. చర్చిలో సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న ముద్దుకృమనాయుడును పాస్టర్ ప్రసాద్ ఆశీర్వదించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కాపు ఉద్యమం నేడు వచ్చింది కాదని, 2004లో కాపు ఉద్యమం ప్రారంభమైందని పేర్కొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాపులను బిసిలలో చేర్చుతామని ఉందని గుర్తుచేశారు. 2004 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు కాపులను బిసిలుగా చేర్చాలన్న ఆలోచన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో గుర్తుకురాని కాపుల బాగోగులు నేడు గుర్తుకురావడం, పరోక్షంగా వైకాపాతో పొత్తుపెట్టుకుని రాజకీయ మనుగడ కోసం చేస్తున్న హైడ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి అన్ని కుల మతాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఆర్థికంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, ఇందులో భాగంగా కాపులను బిసిలలో చేర్చే అంశంపై ఇదివరకే బిసి కమిషన్ వేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కాపులను బిసి-ఎఫ్‌గా గుర్తించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. కాపుల కోసం నిజమైన ఉద్యమం చేయాలంటే తెలుగుదేశం పార్టీలో రావాలని, కాపుల సమస్యలు నేరుగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. విలేఖర్ల సమావేశంలో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు రాటకొండ గురుప్రసాద్, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, వైస్‌చైర్మన్ భవానిప్రసాద్, టౌన్‌బ్యాంక్ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, రాటకొండ బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్, రాటకొండ సురేంద్ర (చినబాబు), టి చంద్రశేఖర్‌నాయుడు తదితరులు ఉన్నారు.

రాష్టప్రతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
తిరుపతి, డిసెంబర్ 25: ఈ నెల 28వ తేదీన భారత రాష్టప్రతి తిరుపతి, తిరుమల పర్యటకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్టప్రతి పర్యటనకు అవసరమైన వాహనాలను ఏర్పాటు గావించాలని డిటిసిని ఆదేశించారు. అంబులెన్స్, ప్రాథమిక చికిత్స మందులు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. అదే విధంగా తిరుమలలో బసకు అవసరమైన వసతి సౌకర్యాలను పరిశీలించాలని సబ్ కలెక్టర్‌ను సూచించారు. వివిఐపి ఆహార పదార్థాలను తనిఖీ నిర్వహించాలని ఫుడ్ ఇన్ స్పెక్టర్‌ను, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అలాగే అవసరమైన బ్యారికేడింగు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాలు నరగపాలక కమిషనర్ వినయ్‌చంద్, సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్, డి ఆర్వో విజయచందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘రాష్ట్ర చరిత్రలో నిలిచిపోనున్న
జాతీయ ఆర్థిక సంఘం సమావేశాలు’
తిరుపతి, డిసెంబర్ 25: నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలా జాతీయ ఆర్థిక సంఘం సమావేశాలు ఎస్వీ యూనివర్శిటీలో ఈనెల 27వ తేదీన ప్రారంభం కానున్నాయని వర్శిటీ విసి ఆవుల దామోదరం అన్నారు. ఆదివారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1981 తరువాత తిరిగి ఎస్వీయూలో జరుగుతున్న ఈ సదస్సును సి ఎం నారాచంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యొల్బణం, పొదుపు, పెట్టుబడులు, సంస్కరణలు, వ్యవసాయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో రెక్టార్ దేవరాజులు నాయుడు, రిజిస్ట్రార్ మచ్చ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తిన చర్చిలు

తిరుపతి, డిసెంబర్ 25: యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతిలోని చర్చిలు క్రైస్తవ సోదర, సోదరీమణుల ప్రత్యేకప్రార్ధనలతో హోరెత్తాయి. శనివారం అర్థరాత్రి నుంచే నగరంలోని వెస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, జగన్మాత చర్చ్, షకీనా చర్చ్‌తోపాటుగా పలుచర్చిల్లో యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రార్థనా గీతాలు వినిపించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో, కొవ్వొత్తుల వెలుగులతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. షకీనా చర్చిలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రైస్తవులకు చర్చి ఫాదర్ అరుల్ అరుసు యేసుక్రీస్తు జననం, పాపులకు స్వస్థత కల్పించిన తీరు, శిలువ ఎక్కిన వైనం గురించి వివరించారు.అలాగే పరిశుద్ధాత్మగా ఆయన పునర్జీవనం చెందడం, శిలువ పై నుంచి చెప్పిన అమూల్యమైన సందేశాన్ని తెలిపారు. ప్రతి క్రైస్తవుడు తప్పని సరిగా ఎదుటివారికి సహాయకారిగా ఉండాలని, ఎదుటివారి కష్టాలను పంచుకోవాలని చెప్పారు. కాగా శనివారం రాత్రి నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, నాలుక్కాళ్ళ మండపంతోపాటుగా పలు ప్రాంతాల్లోని నిరుపేదలకు దుప్పట్లు, దుస్తులు, ఆహారంను పంచిపెట్టారు. కాగా రేణిగుంట రోడ్డులోని పెంతకోస్తు చర్చి అభివృద్ధికి తిరుపతి కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ భువనకుమార్ రెడ్డి రూ.5వేలు విరాళంగా అందించారు. అలాగే స్థానిక రేణిగుంట రోడ్డులోని అభయ క్షేత్రంలోని మానసిక వికలాంగులకు అవసరమైన తినుబండారాలను అందించడానికి రూ.5వేలు అందించారు. ఈకార్యక్రమంలో ఆయన సతీమణి కృత్తికారెడ్డి, చర్చ్ఫిస్టర్ ప్రసాద్‌రావు, అభయ క్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా, చంద్రబాబు, ప్రసన్న, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జంగం సంక్షేమ సంఘం నగర కమిటీ నియామకం
తిరుపతి, డిసెంబర్ 25: చిత్తూరు జిల్లా జంగం సంక్షేమ సంఘం తిరుపతి నగర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు సంకు బాలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి అధ్యక్షులుగా సి.వేణుగోపాలయ్య, గౌరువాధ్యక్షులుగా పి.రుద్రకుమార్, ఉపాధ్యక్షులుగా శ్రీరామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా బి.్భరత్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా శ్రీకాంత్, కోశాధికారిగా సి.వి.రమణ, గౌరువ సలహాదారుగా సి.వాసుదేవయ్య, సోమశేఖర్, జె.బాబు, కార్యవర్గ సభ్యులు ఓ.సుధాకర్, పి.నాగరాజు, చెంగల్ రాయుడు, నాగేశ్వరయ్య, దేవానంద్, మోగేందర్, రెడ్డెప్ప, మునిరాజమ్మ, డి.విజయ, వెంకటచైతన్య, ఎన్.మల్లిఖార్జున్‌లు నియమితులైయ్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగాధర నెల్లూరు మండలం, నందనూరుకు చెందిన బండారు సుబ్రమణ్యంను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా జంగమలను అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని, చిత్తూరు, తిరుపతిల్లో జంగమభవన్‌లకు స్థలాలు కేటాయించాలని, నిధులు సేకరించి భవన నిర్మాణాలు చేపట్టాలని ఈసమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో సంఘం సభత్వాన్ని రెండురోజుల్లోపూర్తి చేయాలని, జంగమల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని శివాలయాల పాలకమండళ్ళలో నియమించాలని, అర్హులకు ఇళ్ళ పట్టాలను అందించి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్ట్ అధికారిణి లక్ష్మి, డైట్ ప్రిన్సిపాల్ జె.చంద్రయ్య, సంఘం జిల్లా గౌరువ అధ్యక్షులు గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణయ్య, నాయకులు అశోక్, వేణుగోపాల్, ప్రకాష్, వెంకటరమణ పాల్గొన్నారు.
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి

* తీర్పుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
* జిల్లా జడ్జి దుర్గారావు

చిత్తూరు, డిసెంబర్ 25: జిల్లాలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించే విధంగా న్యాయమూర్తులు చొరవ చూపాలని జిల్లా జడ్జి దుర్గారావు తెలిపారు. ఆదివారం చిత్తూరు కోర్టులో జిల్లా స్థాయి న్యాయమూర్తుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో ఇటు న్యాయమూర్తులు అటు న్యాయవాదులు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తీర్పుల విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ దిశగా ముందుకు వెళ్లే కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై అందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కేసుల పరిష్కారంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ప్రయోజనాలు ఉంటాయన్నారు. జిల్లాలో క్రిమినల్ కేసులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కేసులు ఎంత త్వరగా పరిష్కారమైతే అంత మంచిదన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వాటిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రత్యేకంగా దృష్టిపెట్టి వాటి పరిష్కారంలో చొరవ చూపాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అంతకుముందు కోర్టులో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తిరుమలకు కాలినడకన
బాలకృష్ణ అభిమానులు

తిరుపతి, డిసెంబర్ 25: అఖిలభారత బాలకృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అలిపిరి వద్ద నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అలిపిరి వద్ద 101 టెంకాయలు కొట్టి కాలినడకన బయలుదేరిన సంఘం కన్వీనర్లు సతీష్, శ్రీ్ధర్, తిలక్‌లు మాట్లాడుతూ తెలుగువారి గొప్పతానాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అని కొనియాడారు. ఆయన వైభవాన్ని చాటి చెప్పడమంటే తెలుగువారి కీర్తిని చాటిచెప్పడమే అన్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇందులో భాగంగా సోమవారం తిరుపతిలోని నెహ్రూమున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో జరుగనున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ సందర్భంగా ఉదయం 11 గంటలకు మున్సిపల్ హైస్కూల్ వద్ద నుంచి ఎన్ టి ఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సాయంత్రం రిడ్జ్‌హోటల్ వద్ద నుంచి క్రీడా మైదానం వరకు బాలకృష్ణతో కలసి నిర్వహించనున్న భారీ స్కూటర్ ర్యాలీలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహులు, నాయకులు గుర్రపరాజు, భాస్కర్ రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుపతి, డిసెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అభిషేక్ మిత్ర, సినీ దర్శకులు, టిటిడి బోర్డు సభ్యులు రాఘవేంద్రరావు, సినీ నిర్మాత సుధాకర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాధర స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.
శివయ్య అశ్వం మృతి చెందింది
* అధికారుల నిర్లక్ష్యమే నంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు

షతిరుపతి, డిసెంబర్ 25: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైవున్న ముక్కంటీశునికి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే అశ్వం శనివారం రాత్రి మృతి చెందింది. అయితే అధికారులు మూడోకన్నుకు తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించేశారు. గోశాలలో ఉన్న అశ్వాలు, గోవుల సంరక్షణ పట్ట శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు,పాలక మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మూగ జీవులు మృత్యువాత పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శివరాత్రి సమయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండు అశ్వాలను విరాళంగా అందించారు. వాటి ఆహారానికి అవసరమైన సొమ్మును కూడా అప్పట్లో ఆయనే విరాళంగా అందించారు. అయితే ఆలయ అధికారులు వాటి ఆలనాపాలన చూడటంలో ఘోరంగా వైఫల్యం చెందారన్న వివర్శలు వినిపిస్తున్నాయి. ఇక పశువైద్యులు ఈ మూగ జీవాలకు వ్యాధులు వచ్చినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అశ్వం మృతికి దారితీసిన కారణాలపై సమాధానం చెప్పకుండా దాటవేయడం వారి నిర్లక్ష్యవైఖరికి అద్దంపడుతోందని పట్టణంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు కలశాలకు బంగారు
పూతలు
శ్రీ కాళహస్తి, డిసెంబర్ 25: శ్రీ కాళహస్తీశ్వరాలయానికి చెందిన రెండు గోపుర కలశాలకు బంగారుపూత వేయించడానికి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు అంగీకారం తెలిపారు. ఆదివారం దేవస్థానం కార్యాలయంలోసమావేశమైన ట్రస్టుబోర్డు సభ్యులు కుంబాభిషేకం పనుల గురించి చర్చించుకున్నారు. ఆలయ ఆవరణలోని ఊంజల్‌సేవ మండపం కలశానికి కుంబేశ్వర స్వామి ఆలయం కలశానికి బంగారుపూత పూయించడానికి అంగీకారం తెలిపారు. మిగిలిన వన్నీ కలశాలకు బంగారు పూత వేయించడానికి దాతలు ముందుకు రావడం తెలిసిందే. మిగిలిపోయిన ఈ రెండు కలశాలకు కూడా బంగారుపూత వేయిస్తే అన్ని కలశాలకు బంగారుపూత వేయించినట్లవుతుంది. సభ్యులు ఈ మేరకు తన అంగీకారాన్ని దేవస్థానం ఇఓ భ్రమరాంబకు తెలియజేశారు. దీనిపై ఇ ఓ కూడా సభ్యులను అభినందించారు.