చిత్తూరు

నేటి నుంచి జిల్లాలో ‘జన్మభూమి-మా ఊరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 1: జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో నాల్గవ విడత జన్మభూమి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సీనియర్ ఐఎఎస్ అధికారి కరికాల వల్లవన్‌ను నియమించింది. రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించడంతో అధికార యంత్రాంగం ఆఘమేఘాలపై ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలను జిల్లాస్థాయి అధికారులు జారీ చేశారు. ఈ మేరకు మండల స్థాయిలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా పలువురు రాష్టమ్రంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. గత మూడువిడతలుగా జరిగిన జన్మభూమి కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని మండలస్థాయిలో గ్రామాలవారీగా గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వివరించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు పలు సంక్షేమ ఫలాలను అందించే విధంగా కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 వేల కొత్త పింఛన్లు, 49వేల కొత్త రేషన్ కార్డులను అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే పంట నష్టపరిహారంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అసెట్లును లబ్ధిదారులకు అందించనున్నారు. జన్మభూమి కార్యక్రమం గ్రామాల్లో స్థానిక సర్పంచ్ అధ్యక్షతన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రజలు ఇచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయనున్నారు. అలాగే గ్రామ సభల అనంతరం సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేయనున్నారు. అయితే జిల్లాలో మంగళవారం నుంచి సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. దేశ ప్రధాని నుంచి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తిరుపతిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యే నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు జన్మభూమి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు సన్నగిల్లాయి. మండల స్థాయిలో జరిగే గ్రామసభలకు విధిగా స్థానిక అధికారులు అందరూ హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గతంలో జన్మభూమి సందర్భంగా కొన్నిచోట్ల చోటుచేసుకున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాల్లో గ్రామసభల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.