చిత్తూరు

టిటిడి పంచాంగం ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 3: టిటిడి రూపొందించిన శ్రీ హేమలంబినామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావులు శుక్రవారం తిరుమలలో రథసప్తమి ఉత్సవం సందర్బంగా సూర్యప్రభ వాహన సేవలో ఆవిష్కరించారు. ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తకోటికి అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రానున్న హేమలంబి సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా రెండు నెలల ముందుగానే ముద్రించింది. టిటిడి ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటపూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని టిటిడి ఆస్థాన పండితులు అప్పికట్ల దేశికాచార్యులు సులభంగా అందరికి అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడి నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు. రూ.50 విలువగల ఈ పంచాంగం తిరుపతి, తిరుమల, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో శుక్రవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 2వ వారం నుంచి టిటిడి సమాచార కేంద్రాలన్నింటిలో పంచాంగాన్ని అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఈకార్యక్రమంలో టిటిడి జెఇఓలు శ్రీనివాసరాజు, పోలభాస్కర్, ఇన్‌చార్జ్ సివిఎస్‌ఓ జి.శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్.పి.జయలక్ష్మి, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, భానుప్రకాష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, అరికల నర్సారెడ్డి, అనంత, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను మోడల్ స్కూల్స్‌గా మారుస్తాం: మంత్రి నారాయణ
తిరుపతి, ఫిబ్రవరి 3: తిరుపతిలోని అంగన్‌వాడీ స్కూల్స్‌ను మార్చి నెలాఖరులోగా మోడల్స్ స్కూల్స్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, పురపాలిక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. తిరుపతిలో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలను, సి ఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 64 అంగన్‌వాడీ కేంద్రాల్లో 21 స్కూల్స్‌ను మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. చెన్నారెడ్డికాలనీలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు ఆంగ్ల విద్యను అభ్యసించడానికి రూ.45లక్షలతో12 గదులు నిర్మిస్తున్నట్లు వివరించారు. సింగాల గుంటలో రూ.35లక్షలతో నాలుగు గదులు నిర్మించి ఈ-క్లాస్‌లు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే నగరంలో ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరో నాలుగు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం మంత్రి రాజీవ్ గృహాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం, ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, మున్సిపల్ కమిషనర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు.