చిత్తూరు

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 3 : అరుపులు, కేకలు, పరస్పర వాగ్వివాదాలు, వాకౌట్లు, నిరశనల నడుమ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభసాగా జరిగింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో యథావిధిగా ఇన్‌చార్జ్ మేయర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఆలస్యంగా సమావేశం జరిగింది. తొలుత చిత్తూరు కార్పొరేషన్ తొలి మేయర్ దివంగత కఠారి అనురాధ చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేయర్ అనుమతితో మున్సిపల్ ఉద్యోగి సమావేశ అజెండాలోని అంశాలను సభ్యులకు వినిపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఉద్యోగి ప్రసంగానికి కార్పొరేషన్ పరిధిలోని 11 డివిజన్‌కు చెందిన వైకాపా కార్పొరేటర్ మార్తాల్ శివకుమార్ అడ్డుతగిలారు. తన డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులే జరగడం లేదని ఆరోపిస్తూ ఫ్లకార్డును చేతపట్టుకుని నిరశన తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాతే అజెండాలోని అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ పట్టుబట్టారు. తొలుత అజెండాలోని అంశాలను తూతూ మంత్రంగా చర్చించి, అనంతరం ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు వీలు కల్పించకుండా సమావేశాన్ని ముగించే సంస్కృతి, సంప్రదాయాలు చిత్తూరు కౌన్సిల్‌కు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాతనే సమావేశం జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సంప్రదాయం ప్రకారం కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని అంశాలను, వాటిపై చర్చ జరిగిన తరువాతనే సాధారణ సమస్యలపై చర్చ ఉంటుందని నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజెండాలోని అంశాలపై చర్చ జరగక ముందు సాధారణ సమస్యలపై చర్చను సమ్మతించవద్దని మేయర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో కో ఆప్షన్ సభ్యురాలు అరుణ అడ్డుతగులుతూ వైకాపా కార్పొరేటర్ మార్తాళ్‌కు మద్దతుగా మాట్లాడారు. ప్రతి సారి సాధారణ సమస్యలపై చర్చ జరగకుండానే కౌన్సిల్ సమావేశాన్ని ముగిస్తున్నారని, ఇలాచేయడం వలన సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలోని సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావించే అవకాశాలు ఉండవన్నారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు, కో ఆఫ్షన్ సభ్యురాలికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కార్పొరేటర్ల వాదనలకు కో ఆప్షన్ సభ్యురాలు సైతం విరుచుకుపడుతూ దీటుగా ఎదుర్కొన్నారు. పరిస్థితి చేయి దాటిపోతుండగా మేయర్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పి శాంతింపజేశారు. అనంతరం అజెండాలోని అంశాల ప్రకారం చర్చించి, వాటిలో కొన్ని తీర్మాణాలకు ఆమోదం తెలుపగా, మరి కొన్ని తీర్మానాలను తిరస్కరించారు.
* పలువురు వైకాపా, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు వాకౌట్ : కౌన్సిల్ సమావేశం మునుపటి వలే ఏకపక్షంగా సాగుతుందని భావించిన పలువురు వైకాపా, ఇండిపెండెంట్ (మాజీ ఎమ్మెల్యే సికె బాబు వర్గం) కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకమునుపే వాకౌట్ చేశారు. దివంగత మేయర్ చిత్రపటానికి పూజలుచేసి నివాళులర్పించిన అనంతరం, సమావేశానికి హాజరైనట్లు మినిట్స్ పుస్తకంలో సంతకాలు చేసిన అనంతరం సంబంధిత కార్పొరేటర్లు కౌన్సిల్ హాలు నుంచి నిష్క్రమించడం గమనార్హం . ఇదిలా ఉండగా 2015 సంవత్సరం నవంబర్ 17వతేదిన కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లోనే హత్యకు గురైన దివంగత మేయర్ కఠారి అనురాధ కేసులో ముద్దాయిగా ఉన్న మురుగ భార్య, సంతపేట టిడిపి కార్పొరేటర్ పద్మావతి తగు రక్షణ ఏర్పాట్టు మధ్య కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ భాస్కర్‌రావు, డిఇ విజయసింహారెడ్డి, పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.