చిత్తూరు

నోట్ల రద్దుతో రానున్న రెండేళ్లలో ప్రజలకు మరిన్ని కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 7: ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజల సమస్యలు తీరిపోలేదని, రానున్న మరో రెండేళ్లలో మరిన్ని కష్టాలను చవిచూడక తప్పదని కాంగ్రెస్ డీమానిటైజేషన్ చైర్మన్ రామచంద్రయ్య అన్నారు. మంగళవారం స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్లో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పెద్దనోట్లు రద్దు తరువాత తెలెత్తిన పరిస్థితిపై నేతల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జరిగిన సభ ప్రారంభానికి ముందు నోట్లురద్దు తరువాత ఏటిఎం లముందు క్యూలో నిలబడి మృతి చెందిన వారికి రెండునిమిషాలు వౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుకు కేంద్రం చెప్పిన కారణాలన్నీ అవాస్తవాలని డిసెంబర్ 31 తరువాత తేలిపోయిందన్నారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా ఆర్‌బిఐ చర్యలతో మనదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా నిలబడగలిగిందన్నారు. అలాంటి ఆర్‌బిఐ వ్యవహారాల్లోను ప్రధాని జోక్యం చేసుకున్నారన్నారు. దేశంలో మితిమీరిన ధరల పెరుగుదల, నల్లధనం, ఆర్థిక వ్యవస్థ స్తంభించిన కొన్ని సందర్భాల్లోనే నోట్ల రద్దును ఆర్‌బిఐ సూచిస్తుందని అన్నారు. అయితే ప్రధాని మోదీ ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి రాజకీయ లక్ష్యంగానే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న కుబేరుల్లో తన అనుచరులు, అయినవారు ఉండటంతోనే ఆ పేర్లను మోదీ ప్రకటించలేదని ఆయన విమర్శించారు. నోట్లరద్దుకు ముందే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కలకత్తాలోని బిజెపి కార్యాలయం తమ వద్ద ఉన్న వందలకోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారన్నారు. అయితే ఇది కాస్త బిజెపికి శాపంగా మారుతోందని గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆపార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని మండిపడ్డారు. దేశాన్ని దిగజార్చే నిర్ణయాలను తీసుకుని ప్రజలను కూడా తిననీకుండా చేశాడన్నారు. రానున్న మూడేళ్లలో మోదీ మరిన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని దీనిని అడ్డుకోవాల్సిన అవసర ఉందని చెప్పారు. చివరకు తమిళనాడు సిఎంగా శశికళను ఎన్నిక కాకుండా అడ్డుకుంటున్న ఘనత బిజెపికే దక్కిందన్నారు. ఏపిలో సిఎం నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు లంచావతారాలుగా మారారని వీరిలావుంటే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని తమ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించిన టిడిపి నేతలు, ఏపిలో ఇతర పార్టీలకు చెందిన వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు సబబుఅని ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించనున్న మహిళ పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎంపిలకు స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏం చెబుతారని ప్రశ్నించారు. వారి తలలకు ఉన్న విలువలు గురించి చెబుతారా అంటూ ఎద్దేవా చేశారు. ఈ సమాశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరిబాబు మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దు తరువాత నల్లధనం భారీగా వైట్ మనీగా మారిపోయిందన్నారు. బిజెపి, టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల ధనాన్ని వైట్‌గా మార్చుకుని నింబధనలను తుంగలో తొక్కారన్నారు. ఏపికి ప్రత్యేక హోదా రావాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఈకార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డి.వేణుగోపాల్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణయ్య, కడపజిల్లా అధ్యక్షులు నజీర్ అహ్మద్, హనుమంతు, ప్రమీలమ్మ, వెంకటనరసింహులు, నైనార్ శ్రీనివాసులు, పొలకల మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.