చిత్తూరు

అనర్హులు ఓటర్లుగా ఉంటే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 14: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకావద్దని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచించారు. మంగళవారం సాయంత్రం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ ఎన్నికల్లో అంతా చదువుకున్న వారే ఓటర్లుగా ఉన్నందున విజ్ఞతతో మెలగాలన్నారు. అనర్హులు ఓటర్లుగా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం పలువురు జిల్లాస్థాయి అధికారులతో పలు కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. జంబ్లింగ్ విధానంతో ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే సిబ్బందిని నియమిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల తీరు పరిశీలించడానికి రాష్టస్థ్రాయి పరిశీలకులు కూడా రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వీటి వివరాలను ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిపారు. అనర్హులు ఓటర్లుగా ఉంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో కొన్ని తప్పిదాలు చోటుచేసుకున్నట్లు గుర్తించామని , ప్రస్తుతం వీటిని సవరిస్తామన్నారు. అర్హులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితా తప్పిదాలపై కొందరు సిబ్బందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు వారు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు కూడా విధిగా ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉండాలని, వాహనాలు వినియోగం, ప్రచారం కోసం మైక్‌సెట్ల సభలు ఏర్పాట్లకు విధిగా అనుమతి ఉండాలన్నారు. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా, అక్రమాలకు పాల్పడుతున్నా వెంటనే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో డిఆర్‌ఓ రజియాబేగం తదితరులు పాల్గొన్నారు.

డిఆర్‌ఓ, డిఇవోలకు నోటీసులు

చిత్తూరు, ఫిబ్రవరి 14: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయుల ఓటర్ల నమోదు ప్రక్రియలో చోటుచేసుకున్న తప్పిదాలపై ఇదివరకు డిఆర్‌ఓగా ఉన్న విజయ్‌చందర్, డిఇవో శ్యాముల్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ఉపాధ్యాయుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవల ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులురెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనేకమంది అనర్హులకు ఓటు హక్కు కల్పించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు విషయంగా తగు జాగ్రత్తలు తీసుకోనందుకు వీరికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొందరు తహశీల్దార్లకు, మండల విద్యాశాఖ అధికారులకు కూడా నోటీసులు ఇస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్, జెఇఓ శ్రీనివాసరాజుకు పదోన్నతి
చిత్తూరు/తిరుపతి, ఫిబ్రవరి 14: జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజుకు పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రత్యేక సెక్రటరీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలపర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్‌గానే కొనసాగనున్నారు. 2001 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. ఇందులో విజయ్‌కుమార్, గిరిజాశంకర్, చక్రవర్తి కూడా ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలి నామినేషన్ దాఖలు

చిత్తూరు, ఫిబ్రవరి 14: చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు పట్ట్భద్రుల శాసనమండలి స్థానానికి మంగళవారం ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కాసిన వెంకటసుధాకర్‌రెడ్డి పట్ట్భద్రుల స్థానానికి మంగళవారం నానినేషన్ వేశారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం నుంచి చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అయితే మంగళవారం పట్ట్భద్రుల స్థానానికి ఒకరు నామినేషన్ దాఖలు చేయగా ఉపాధ్యాయ స్థానానికి ఇప్పటికీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన న్యాయవాది వెంకటసుధాకర్‌రెడ్డి పట్ట్భద్రుల స్థానానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ వద్ద తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకటసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాలుగా దర్శిలో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నానని, గతంలో యువజన కాంగ్రెస్‌లో పనిచేశానని, అయితే ప్రస్తుతం వైకాపాలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. తనకు పలువురు వైపాకా నేతలు సహకారం అందిస్తున్నారని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా పార్టీ పరంగా ఎన్నికల బరిలో నిలవాలన్నది త్వరలోనే తేలుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజియాబేగం తదితరులు పాల్గొన్నారు.