చిత్తూరు

శవాలతో వ్యాపారం చేస్తారా .. ఇదేనా వైద్య ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మార్చి 19: మరణించిన మహిళా రోగికి మందులు తెమ్మనిచెప్పడం, ఆపై మరణించింది.. రూ.1.25 లక్షలు కట్టి శవాన్ని తీసుకెళ్లాలంటూ రేణిగుంట రోడ్డులోని నారాయణ ఆసుపత్రి నిర్వాహకులు మృతుని కుటుంబీకులకు హుకుం జారీ చేయడం మరోమారు వివాదంగా మారిన సంఘటన ఆదివారం జరిగింది. ఈక్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె కుటుంబ సభ్యులు శవాలతో వ్యాపారం చేస్తారా ఇదేనా వైద్య ధర్మం అంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు విలేఖరులతో మాట్లాడుతూ రోగి పరిస్థితి విషమంగా ఉందని, అయినా బతికించడానికి ప్రయత్నిస్తామని తాము వారి కుటుంబ సభ్యులకు చెప్పి తమవంతు ప్రయత్నం చేశామని వివరణ ఇచ్చారు. మరణించిన తరువాత బిల్లు చెల్లించమంటే ఆందోళన చేయడం ధర్మమా అని వారు ప్రశ్నించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబిలపల్లి మండలం దుద్దేల గ్రామానికి చెందిన వీర నాగమ్మ (38) గత 15 రోజుల క్రితం చికిన్ పాక్స్‌కు గురైంది. దీంతో ఆమె భర్త రమేష్ రేణిగుంటరోడ్డులోని నారాయణ ఆసుపత్రిలో వైద్యం కోసం చేర్పించారు. ఈ క్రమంలోరూ.1.80 లక్షలు ఆసుపత్రి ఫీజుకింద, మరోరూ.90 వేలు మందులకు ఖర్చుచేశారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మరోసారి మందులు తెమ్మంటూ ఆసుపత్రి సిబ్బంది రమేష్‌కు మందుల జాబితా ఇచ్చారు. పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నిస్తే నయమవుతుందని చెప్పినట్లు రమేష్ విలేఖరులకు తెలిపారు. తాము గట్టిగా నిలదీయడంతో మరణించిందని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చనిపోయిన తరువాత మందులు తెమ్మనడం ఒక మోసమైతే మరో 1.25 లక్షలు చెల్లించాలని, లేని పక్షంలో శవాన్ని మార్చురీలో పెడతామంటూ బెదిరించామన్నారు. ఇదిలావుండగా తన భార్య ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయడమే కాకుండా మరణించిన విషయాన్ని కూడా ఆలస్యంగా చెప్పి డబ్బులు డిమాండ్ చేయడంతో రమేష్ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. ఈ సమచారం తెలుసుకున్న సిపి ఐ నగర కార్యదర్శి చిన్నంపెంచులయ్య, కార్యకర్తలతోవెళ్లి రోగులకు మద్దతుగా ధర్నాచేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆసుపత్రి నిర్వాహకులు పడ్డారు. పలుమార్లు సంప్రదింపులు చేపట్టినా మృతురాలి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు. ఇందులో భాగంగా తాము చెల్లించిన రూ.1.80 లక్షల ఫీజులు, మందులకు చెల్లించిన రూ.90 వేలు తిరిగి చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేశారు. సుమారు 2 గంటల పాటు సిపిఐ నేతలు ధర్నాకు దిగడంతోదిగివచ్చిన యాజమాన్యం ముందుగా చెల్లించిన డబ్బులు ఇవ్వబోమని, ఇక చెల్లించాల్సిన రూ.1.25 లక్షలను వదులు కుంటామని, అంతేకాకుండా శవాన్ని తమ వాహనంలో కడపలోని ఆమె స్వగృహానికి చేరుస్తామని హామీ ఇవ్వడంతో మృతురాలి కుటుంబసభ్యులు, సిపి ఐ నేతలు ఆందోళన విరమించారు. దీంతో శాంతియుతంగా సమస్య పరిష్కారమైనా తన భార్యను కోల్పోయానని రమేష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా చిన్న పెంచులయ్య మాట్లాడుతూ నారాయణాద్రి హాస్పిటల్ రోగులపట్ల మృత్యునిలయంగా మారుతుందని, కార్పొరేట్ వైద్యం పేరుతో మోసాలు జరుగుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగి పరిస్థితి విషమంగా ఉన్నా కోలుకుంటున్నట్లు నమ్మబలుకుతూ ఫీజులు, మందుల రూపంలో పేద రోగులను దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. నారాయణాద్రి ఆసుపత్రి సినిమా తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శవాలపై వ్యాపారం చేసే దుర్మార్గపు విధానాలకు నారాయణ ఆసుపత్రి యాజమాన్యం పాల్పడుతూ వైద్యవృత్తికే కళంకం తీసుకొస్తున్నారన్నారు. ఈ ధర్నాలో వైకాపా యువ విభాగం నాయకుడు మహేశ్వర్‌రెడ్డి, సిపి ఐ కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, ఎన్‌డి రవి, శశికుమార్, నాయకులు కనికాచలం, బండి చలపతి, శైలజ, రామచంద్రయ్య, మృతురాలి బందువులు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా సమాచారం తెలుసుకున్న మీడియా అక్కడ జరుగుతున్న తంతును తెలుసుకోవడానికి వెళ్లినపుడు అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది పాత్రికేయులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడేం జరగలేదంటూ బుకాయించే ప్రయత్నం చేయడం కొసమెరుపు.

పెద్ద మనసుల మధ్య
ఒక్కటైన మూడు జంటలు

* మహిళలెవరూ అనాథలు కారు:
నన్నపనేని రాజకుమారి
* ఆదర్శవంతమైన వివాహం:
ఎంపి శివప్రసాద్

తిరుపతి, మార్చి 19: ఎవరూ లేరనుకున్న వారికి ప్రభుత్వ బాలికల గృహం అమ్మ ఒడైంది. యుక్తవయస్సు వచ్చిన వారికి మంచి సంబంధాలను చూసి ఒకంటి వారిని చేసింది. ఎంతో ఘనంగా జరిగిన ఈవివాహానికి పెద్ద మనసున్న మనుషులంతా హాజరయ్యారు. ఆ దంపతులను మనసారా ఆశీర్వదించారు. వివరాల్లోకి వెడితే స్థానిక సరోజినిదేవి రోడ్డులోని ప్రభుత్వ బాలికల గృహంలోని ఎన్.రేణుక, రమణి, కె.పద్మావతికి ఆ గృహం పర్యవేక్షణాధికారి బి.నందగోపాల్ తండ్రి అయ్యాడు. ఎన్.రేణుకకు ప్రొద్దుటూరికి చెందిన బి.కాం చదివిని వి.నరసింహారికి, రమణిని ఒంగోలుకు చెందిన బి.కాం చదివిని జె.వి.వి.సురేంద్రబాబకు, కె.పద్మావతిని బండి ఆత్మకూరుకి చెందిన ఎం ఎ చదివిని కె.కిరణ్‌కుమార్‌కు ఇచ్చి ఆదివారం ఉదయం స్థానిక మంగళం రోడ్డులోని ప్రభుత్వ బాలుర గృహ సముదాయంలో ఉదయం 9.15 నుంచి 10.15 గంటల మధ్య, మేష లగ్నంలో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి కొడుకుల తరపున వారి కుటుంబ సభ్యులు హాజరైలే పెళ్లి కుమార్తెల తరపున మహిళ కమిషన్ ఛైరపర్సన్ నన్నపనేని రాజకుమారి, చిత్తూరు ఎంపి శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణ, టిడిపి రాష్ట్ర మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎన్‌టి ఆర్ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, అధికారులు, అనధికారులు, సంఘసేవకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై ఆ దంపతులను ఆశీర్వదించారు. ఎంతో వేడుకగా, సందడిగా జరిగిన వివాహ మహోత్సవానికి హాజరైన మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఈవివాహం మానవత్వానికి నిదర్శనమని అన్నారు. తమకు ఎవరూ లేరని మహిళలు బాధపడాల్సిన పనిలేదని అన్నారు. ఎవరూ అనాథలు కారని, వారికి అందరి అండ ఉంటుందని అన్నారు. చిత్తూరు ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ ఇది ఎంతో ఆదర్శంతమైన కార్యక్రమమని అన్నారు. అందుకే తనకు ముఖ్యమైన పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి ఇక్కడకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించానని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణ మాట్లాడుతూ బాలికల గృహంలోని పిల్లలకు వివాహం జరిపించిన నిర్వాహకులను అభినందించారు.