చిత్తూరు

నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 19 :తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిద్ధార్థజైన్ తెలిపారు. ఆదివారం ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ ఈ లెక్కింపులో సుమారు 400 మంది సిబ్బంది పాలుపంచుకుంటారని తెలిపారు. దీనిపై ఇది వరకే ప్రత్యేక శిక్షణా కూడా ఇచ్చినట్లు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన చిత్తూరులోని పివికెఎన్ డిగ్రీ కాలేజిలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల్లోని బ్యాలెట్ బాక్సులను ఏజంట్ల సమక్షంలోనే సీళ్లు తీస్తామన్నారు. ఈ లెక్కింపుపర్వం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులైన శ్రీధర్‌రావు, శ్రీనరేష్‌ల ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు నిర్వహించనున్నట్లు వివరించారు. పట్ట్భద్రులకు 18 టేబుళ్లు, ఉపాధ్యాయల నియోజకవర్గానికి 10 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టి అనంతరం బ్యాలెట్ బాక్సుల లెక్కింపు కొనసాగుతుందన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా వీడియా ద్వారా చిత్రీకరిస్తామని తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్లను అనుమతించడం జరగదన్నారు.

వచ్చే ఏడాది నాటికి 20 కోట్ల మంది కార్మికులకు ఇఎస్‌ఐ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం
* కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ

తిరుపతి, మార్చి 19: కార్మిక సంక్షేమానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, ఇందులో బాగంగానే వచ్చే ఏడాది నాటికి దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులకు ఇ ఎస్ ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర కార్మిక ఉపాధికల్పనశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆదివారం స్థానిక నూతన ఇ ఎస్ ఐ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. అలాగే హాస్పిటల్లో పలువార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంలో 5ప్రాంతాల్లో రూ.100 కోట్లతో వంద పడకల సూపర్ స్పెషాలిటి ఇఎస్‌ఐ ఆస్పత్రులను చేపడుతున్నామన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే రూ. 500 కోట్ల 500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నామన్నారు. కార్మికులు మూడు చోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయనగరం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో 80 లక్షల మంది హోం గార్డులకు ఇఎస్‌ఐ ద్వారా వైద్యం అందించడానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. 2017 జూలై నాటికి స్థానిక ఇఎస్‌ఐ ఆస్పత్రిలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కార్మికులకు కూడా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఇందుకోసం 24 డిస్పెన్సరీలు ద్వారా కార్మికులకు తిరుపతి కార్మిక రాజ్య బీమా ఆస్పత్రి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇఎస్‌ఐ ఆస్పత్రి కార్మికులకు ఒక వరం అన్నారు. దేశంలోని అసంఘటిత రంగంలోని 40 కోట్ల మంది కార్మికులను దశలవారీగా భవిష్యనిధి ద్వారా సంఘటిత రంగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలోని అంగన్‌వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లకు వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఇ ఎస్ ఐ హాస్పిటల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ కె. అమాముల్లా, ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలశంకర్ రెడ్డి, కమిటీ సభ్యులు సింధూజా, కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.