చిత్తూరు

మున్సిపల్ మెప్మా ఆర్‌పి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మార్చి 21: తొలగించిన గ్రూపుపేరుతో స్థానిక ఎస్‌బిఐ బ్యాంకులో రూ.5లక్షలు రుణం తీసుకుని స్వాహాచేసిన మదనపల్లె మున్సిపల్ మెప్మా (సంఘమిత్ర) ఆర్‌పి పుష్పలతను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మెప్మా పిడి నాగపద్మజ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 17న శనివారం ‘మెప్మా ఆర్పీ చేతివాటం - రూ.5లక్షలు స్వాహా’ అనే కథనం ఆంధ్రభూమిలో వెలువడిన విషయం పాఠకులకు విధితమే. స్పందించిన అధికారులు వెంటనే విచారణ అనంతరం చర్యలు చేపట్టారు. వివరాలు ఇలావున్నాయి.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని రాజానగర్‌లో సన్నీ స్వయం మహిళా గ్రూపులో 9మంది సభ్యులతో నడుస్తుండేది. మదనపల్లె పట్టణం ఎస్‌బిఐ బ్యాంకులో 2013లో బ్యాంకు లింకేజి రుణం రూ.4లక్షలు తీసుకుని రూ.52వేలు మినహా మిగిలిన సొమ్ములంతా చెల్లించారు. రెండేళ్ళుగా గ్రూపునడుపకుండా మహిళా సభ్యులు మిన్నకుండి పోయారు. బాకీ ఉన్న రూ.52వేలు చెల్లించాలని బ్యాంకు అధికారులు మెప్మా అధికారులను హెచ్చరించారు. అయితే ఆగ్రూపు సభ్యులంతా విడిపోయి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కోళ్ళబైలు పంచాయతీ ఇందిరమ్మకాలనీలో నివాసముంటున్నారు. ఇదే ఆసరాగా చేసుకున్న మెప్మా ఆర్‌పి పుష్పలత, సమాఖ్యలీడరు కలసి సన్నీమహిళాగ్రూపు పేరుతో కొత్తసభ్యులను చేర్చుకుని, బాకీ రూ.52వేలు కొత్తసభ్యుల నుంచి వసూలుచేసి బ్యాంకుకు చెల్లించి, 2016 మేనెల 24న అదేగ్రూపు పేరుతో రూ.5.60లక్షలు రుణం తీసుకుంది. రెండవ విడత రుణమాపీ కింద వచ్చిన రూ.3వేలు పాత సభ్యులకే వర్తిస్తుంది. ఆ డబ్బులు తీసుకునేందుకు 9మంది సభ్యులు బ్యాంకుకు వెళ్ళారు. పాత గ్రూపుసభ్యులంతా ఇంకా రూ.5,60లక్షలు బాకీ ఉన్నారని, వీటిలో రుణమాఫీ పైకం జమచేయడం జరిగిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో మహిళలంతా ఖంగుతిన్నారు. ఈనెల 17న స్ర్తిశక్త్భివన్‌లో మున్సిపల్ మెప్మా ఇన్‌చార్జి పిఆర్‌పి జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సన్నీ మహిళా గ్రూపుసభ్యులు ఆర్‌పి పుష్ప, సమాఖ్య వసంతకుమారిలను నిలదీశారు. జరిగిన విషయంపై మెప్మా పిఆర్‌పి జగదీష్‌కు ఫిర్యాదు చేయడం, ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఆర్‌పి పుష్పలతను సస్పెండ్ చేస్తు, రూ.5.60లక్షలు రికవరీకి ఆదేశించినట్లు తెలిపారు. ఇకపై మహిళా గ్రూపులకు ఇబ్బంది కల్గించే ఆర్‌పిలు, సమాఖ్యలపై నేరుగా ఫిర్యాదు చేయాలని, మెప్మాలో ఫిర్యాదు విభాగం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు ఆర్‌పిలకు, సమాఖ్యలకు ఏలాంటి రుసుములు, ముడుపులు ఇవ్వనవసరం లేదని, అలాఎవరైనా ఒత్తిడి చేస్తే ఫిర్యాదుచేస్తే తొలగించడం జరుగుతుందన్నారు. గత నాలుగేళ్ళుగా ఆర్‌పిలు పాతుకుపోయారని, ఏప్రిల్ మొదటి వారంలో పట్టణంలోని ఆర్‌పిలు, సమాఖ్యలను మార్పుచేపట్టి అవినీతి, అక్రమాలను అడ్డుకుంటామని మెప్మా పిఆర్‌పి జగదీష్ విలేఖరులకు వెల్లడించారు.

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తాం

తిరుపతి, మార్చి 21 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఏపి ప్రభుత్వ వైద్యుల సంఘం చైర్మన్ బి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏపిజిడి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 22 రోజులుగా ప్రభుత్వ డాక్టర్లు నిరసన దీక్షలు చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందులో భాగంగా తిరుపతి రుయాలో వైద్యులు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. గత రెండురోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు. ఇందులో బాగంగా మంగళవారం ఎస్వీ మెడికల్ శాఖ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ ఐవి రామచంద్రరావు, డాక్టర్ నెహ్రూ, అలాగే డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హరికృష్ణ దీక్షలో పాల్గొనగా వారికి సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టర్ల సంఘం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ డాక్టర్ల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందన్నారు. రెవెన్యూ, పోలీసు విభాగాలకు వాహనాలను అందిస్తున్న ప్రభుత్వం, పిహెచ్‌సిల్లో పనిచేసే డాక్టర్లకు ఎలాంటి వాహన సౌకర్యం కల్పించడం లేదన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని పిహెచ్‌సిల్లో వైద్యులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. అలాగే పిహెచ్‌సిల్లో పనిచేసిన ఉన్నత చదువులు, అర్హతలు ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినా జీతాలు పెరగకపోగా, ఇస్తున్న జీతాలను తగ్గించేయడం దారుణమన్నారు. అంతేకాకుండా విధుల్లో చేరినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యేవరకు ఒకే హోదాలో ఉండటం సరికాదన్నారు. ఈ పరిస్థితుల్లో టైంబౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలన్నా స్పందించడం లేదని, అనామలేషన్ సరిచేయాలన్నది డాక్టర్ల ప్రధాన డిమాండ్ అన్నారు. దీనికి తోడు పిహెచ్‌సి డాక్టర్లు గెజిటెడ్ హోదా ఉన్నా వారిపై రెవెన్యూ ఉద్యోగుల పెత్తనం పెరిగిపోతోందన్నారు. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వైద్యవిధాన పరిషత్‌లోని, రిమ్స్‌లోని వైద్యులను ప్రభుత్వ డాక్టర్లుగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవేకాక అనేక ఇతర సమస్యలున్నా తమతో ప్రభుత్వం చర్చించడానికి కూడా సిద్ధపడకపోవడం ప్రభుత్వ వైద్యులను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణిస్తే, పోస్టుమార్టం చేసినందుకు ఆ రిపోర్టును మృతుడు ఏ ప్రాంతానికి చెందినవాడైతే అక్కడకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్లిన ఫోరెన్సిక్ డాక్టర్‌కు టిఏలు చెల్లించకపోవడంతో ఒక్క తిరుపతిలోని డాక్టర్లకే దాదాపు రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిని ప్రభుత్వం చెల్లించకపోవడంతో డాక్టర్లు టిఏ బిల్లులు రాయడమే మానేశారని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తమతో చర్చలకు సిద్ధమైతే ఏ సమస్యలను పరిష్కరిస్తారో, వేటిని పరిష్కరించరో తేలుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలకు సిద్ధపడకపోతే తాము రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిజిడి అసోసియేషన్ రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ మునీశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
రీ కౌంటింగ్‌కు డిమాండ్ చేసిన
టిడిపి అభ్యర్థి

చిత్తూరు, మార్చి 21: తూర్పు రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైన టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి రీ కౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. చెల్లని ఓట్లు అధికంగా ఉండడం, మరో పక్క పిడిఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులరెడ్డి తొలిప్రాధాన్యతలో కోటాను అధిగమించకపోవడం, 12 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయినా యండపల్లి కోటాను సాధించక పోవడంతో, టిడిపి అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు విన్నవించారు. అయితే కలెక్టర్ ఎన్నికల నిబంధనల మేరకే కౌంటింగ్ కొనసాగుతున్నదని తేల్చిచెప్పి, రీకౌంటింగ్‌ను నిరాకరించారు.

పట్ట్భధ్రుల ఎమ్మెల్సీగా యండపల్లి

చిత్తూరు, మార్చి 21: తూర్పు రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీగా పిడిఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసుల రెడ్డి విజయం సాధించారు. చిత్తూరులో తూర్పు రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమై మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు పోటిలో నిలవగా, ప్రధానంగా పిడిఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులరెడ్డి, టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి మధ్యనే పోటీ నెలకొంది. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లతో స్పష్టమైన కోటా లభించక పోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనివార్యమైంది. రెండవ ప్రాధాన్యత ఓట్లతో యండపల్లి డకి అవసరమైనన్ని ఓట్లు లభించడంతో తనస్థానాన్ని పదిలంచేసుకున్నారు.

పిడిఎఫ్ అభ్యర్థుల విజయంతో సంబరాలు
తిరుపతి, మార్చి 21: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులు విజయం సాధించడంతో సిపిఐ, సిపిఎం, అనుబంధ కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ను కట్ చేసి అందరికి పంచిపెట్టారు. పరస్పరం రంగులు చల్లుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి పెంచలయ్య, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, యుటిఎఫ్ జిల్లా నాయకురాలు నిర్మల మాట్లాడుతూ పిడిఎఫ్ అభ్యర్థులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసులు, అలాగే కత్తి నరసింహారెడ్డిల విజయాన్ని అడ్డుకోవడానికి అధికార పార్టీ చేసిన కుయుక్తులు ఏవీ ఫలించలేదన్నారు. తమను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, జైళ్లల్లోకి నెట్టడం, లాఠీలతో కొట్టించి అణచివేయడం తెలిసిన బాబుకి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఇదే తరహాలో విజయం సాధించాలని భావించారని విమర్శించారు. అయితే సిఎం సొంత జిల్లాలో కార్మికులు, ఉపాధ్యాయులు, మేధావులు కలసికట్టుగా గుణపాఠం నేర్పారని అన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో సైతం ఇదే తరహా ఫలితాలతో ప్రజలు బాబు పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి, లక్ష్మయ్య, చిన్నం కాళయ్య, శివ, రాజా, తనికాచలం, ఆనంద్ లక్ష్మి, లత, సిపిఎం నాయకులు రాధమ్మ, బాబ్జి, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

‘క్రీడల్లోను ఎస్వీయూకి అంతర్జాతీయ గుర్తింపు’
తిరుపతి, మార్చి 21: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి క్రీడల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు ఎస్వీయూ విసి ఆవుల దామోదరం తెలిపారు. మంగళవారం తన అధ్యక్షతన ఛాంబర్‌లో రెండవ వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీయూలోని పలు విభాగాలు అభివృద్ధి పథంలో నడుస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎస్వీయూ వ్యాయామ విద్యావిభాగానికి మంచి గుర్తింపు తీసుకువచ్చేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడా సముదాయ ప్రాంగణం అభివృద్ధి వంటి కార్యక్రమాలను రూ.41 లక్షలు కేటాయించామన్నారు. టెన్నిస్ కోర్టు సింథటిక్ సర్పేస్ వేయడానికి రూ.16.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వరల్డ్ యూనివర్శిటీస్ మీట్‌లో పాల్గొన్నందుకు ఎస్వీయూ తరపున రూ.50 వేలు నగదు బహుమతిని మంజూరు చేసినట్లు తెలిపారు. పురుషుల టెన్నీస్ టీమ్ సౌత్‌జోన్, ఆల్ ఇండియాలో పాల్గొన్నందుకు క్రీడాకారులు సాయిచరణ్‌రెడ్డి, టిఎస్ జూడ్ రేమాండ్, పి హర్షిత, డి సూర్యారెడ్డి, పిజి నరింజన్‌లకు నగదు బహుమతిని మంజూరు చేశామన్నారు. అమెరికన్ ఫుట్‌బాల్, హాకీ-5 పురుషులకు 2017-18 సంవత్సరం నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ఎస్వీయూ బోధనేతర సిబ్బందికి అనుబంధ కళాశాలల బోధనేతర సిబ్బందికి అంతర్‌కళాశాలల క్రీడలు, పురుషులు-స్ర్తిలకు బాల్ బ్యాడ్మింటన్, చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వర్శిటీ రిజిస్ట్రార్ దేవరాజులు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున, ఇసి సభ్యులు రాటకొండ ప్రసాద్, చిత్తూరు పిపికె ప్రిన్సిపాల్ ఆనందరెడ్డి, వ్యాయామశాఖ డాక్టర్ డి కృష్ణమూర్తి, ఎం శివశకర్‌రెడ్డి, గిరిధర్‌రాజు, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా డిక్లరేషన్ పత్రం అందుకున్న విఠపు

చిత్తూరు, మార్చి 21: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయల ఎమ్మెల్సీగా విజయం సాధించిన విఠపు బాలసుబ్రహ్మణ్యంకు మంగళవారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ నుంచి డిక్లరేషన్ పత్రాన్ని అందుకొన్నారు. ఈ నియోజక వర్గానికి తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో ప్రధానంగా పిడిఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, టిడిపి అభ్యర్థి వాసుదేవనాయుడుల మధ్యనే పోటీ నెలకొంది. ఇందులో మొత్తం 17,015 ఓట్లు గాను కోటాగా 8508 ఓట్లుగా నిర్ధారించారు. ఇందులో విఠపు బాలసుబ్రహ్మణ్యంకు తొలిప్రాధాన్యతలో 7812 ఓట్లు, వాసుదేవ నాయుడుకు 4522 ఓట్లు రావడంతో వీరు ఇరువురికి స్పష్టమైన కోటా ఓట్లు లభించకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్ల అనివార్యమయ్యాయి. దీంతో ఏడుగురు ఎలిమినేట్ అయిన తరువాత విఠపు బాలసుబ్రహ్మణ్యంకు 9439ఓట్లు, వాసుదేవనాయుడుకు 5886 ఓట్లు లభించాయి. దీంతో విఠపు బాలసుబ్రహ్మణ్యం 3553 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు నిర్థారించారు. ఎన్నికల బలరిలో నిలిచిన ఆనందనాయుడుకు తొలిప్రాధాన్యతలో 526 ఓట్లు, అంబూరి సుబ్రహ్మణ్యంకు 125, వెంకటసుధాకర్ రెడ్డికి 33, చదలవాడ సుచరితకు 251, రామయ్యకు 281, మాదాల వెంకట కృష్ణయ్యకు 3438, ఎం రామిరెడ్డికి 27 ఓట్లు చొప్పున లభించాయి. కౌంటింగ్ పక్రియ పూర్తయిన తరువాత ఎమ్మెల్సీగా గెలుపొందిన విఠపు బాలసుబ్రహ్మణ్యంకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మంగళవారం అధికారులు డిక్లరేఫన్ పత్రాన్ని అందజేసారు. ఈపత్రాన్ని ఆందుకొన్న ఆయన నిరాడంబరంగా కౌంటింగ్ కేంద్రం నుంచి వెలుపలికి వచ్చారు. అనంతరం ఆయన్ను పలువురు వైకాపా నేతలు, పలు ఉపాధ్యాయ సంఘాలు నేతలు వామపక్షాల నేతలు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యుటిఎఫ్ నేత సోమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న అహోబిల పీఠాధిపతి
తిరుపతి, మార్చి 21 : అహోబిలం మఠం 46వ జియ్యర్ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిగన్ మంగళవారం ఉదయం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి మూలవిరాట్ వద్ద ఉన్న స్వర్ణ శఠారిని ఊరేగింపుగా పీఠాధిపతికి ఎదురేగి ఆంజనేయస్వామి గుడి వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు శఠారితో ఆశీర్వచనం చేసి గౌరవించారు. దీనినే టిటిడి మఠాధిపతికి ఇచ్చే పెద్ద మర్యాద అని కూడా పిలుస్తారు. కాగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి మఠాధిపతిని మంగళవాయిద్యాల మధ్య ఆలయ మహద్వారం గుండా శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. అక్కడ మఠాధిపతి స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయక మండపం వద్ద స్వామివారి తీర్థప్రసాదాలను టిటిడి ఇఓ డాక్టర్ సాంబశివరావు, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఓఎస్‌డి శేషాద్రి, పేష్కార్ రమేష్, బొక్కసం ఇన్‌ఛార్జ్ గురురాజారావు పాల్గొన్నారు.

వైకాపా కంచుకోట బద్దలైంది
* మంత్రి గంటా శ్రీనివాసరావు
తిరుపతి, మార్చి 21 : వైకాపా అధ్యక్షుడు దగ్గరుండి ప్రచారం చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన బాబాయ్‌ని గెలిపించుకోలేకపోవడంతో వైకాపా కంచుకోట బద్దలైనట్లేనని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని అన్నారు.

కుక్కల దాడిలో కృష్ణజింక మృతి
ములకలచెరువు, మార్చి 21: కుక్కల దాడిలో కృష్ణజింక మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. ములకలచెరువు పంచాయతీ, కదిరి రోడ్డులో పొలాల్లోకి మంగళవారం ఉదయం మేతకోసం వచ్చింది. అయితే కుక్కలు జింకను తరిమాయి. దీంతో మగజింక తీవ్ర గాయాలపాలైంది. గమనించి ఆటోడ్రైవర్లు జింకను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెంది ఉండగా కృష్ణజింకను అటవీశాఖ అధికారులు బషీర్‌అహ్మద్, గోపాల్ స్వాధీనం చేసుకొని, కనుగొండ అడవిలో ఖననం చేశారు.

770 మంది అధ్యాపకులతో
ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం
తిరుపతి, మార్చి 21 : ఇంటర్ ఫలితాలు త్వరగా విడుదల చేయడానికి వీలుగా 770 మంది అధ్యాపకులతో ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ముగియడంతో ప్రశ్నాపత్రాల మూల్యాంకన కార్యక్రమాన్ని సోమవారం నుంచే చేపట్టారు. ఇందుకోసం స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 770 మంది అధ్యాపకులు హాజరవుతున్నారన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, ఒకేషనల్లో ఎంఎల్‌టి, ఎంసిహెచ్‌డబ్ల్యు ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తిచేశారు.
తిరుమలలో నాగుపాము
హల్‌చల్
తిరుపతి, మార్చి 21 : స్థానిక బాలాజీనగర్ రింగు రోడ్డులోని గ్యాస్ గోడౌన్ సమీపంలో రహదారిపై నాగుపాటు సంచరించడాన్ని గమనించిన భక్తులు, స్థానికులు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న భాస్కర్‌నాయుడు పామును పట్టుకుని అడవిలో వదిలారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుపతి, మార్చి 21 : తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరుని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపి సిఎం రమేష్, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, తెలంగాణ శాసనమండలి చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుతోపాటు ఆహోబిలం మఠాధిపతి రంగానథయతీంద్ర మహాదేశికన్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.