చిత్తూరు

కల్యాణ వేంకటేశ్వర స్వామికి రూ.2 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 23 : శ్రీనివాసమంగాపురంలో కొలువై ఉన్న శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి రూ.2కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలను గురువారం టిటిడి అందించింది. ఈ ఆభరణాలను టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ ఇందులో రెండు నాగాభరణాలు, సూర్యకఠారిని కల్యాణ వేంకటేశ్వర స్వామికి తయారు చేయించి ఇచ్చినట్లు తెలిపారు. 3.75 కిలోల బరువు ఉన్న ఈ ఆభరణాల్లో బంగారు, వెండితో తయారు చేసినట్లు తెలిపారు. శుక్రవారం జరగనున్న పుష్పాభిషేకం కార్యక్రమంలో ఈ ఆభరణాలను స్వామివారికి అందజేస్తామని తెలిపారు.

బిసి సబ్‌ప్లాన్‌కు రూ.30 వేల కోట్లు ఇవ్వాలి
* బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్
శ్రీకాళహస్తి, మార్చి 23 : రాష్ట్రంలోని బిసిల సమగ్ర సంక్షేమానికి ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కైకాల కల్యాణ మండపంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకరయ్య మాట్లాడుతూ బిసిల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రభుత్వం మాటల్లో చెప్తోందని, నిధులు కేటాయింపు మాత్రం సక్రమంగా లేదని విమర్శించారు. సబ్‌ప్లాన్ అమలు కోసం రూ.30 వేల కోట్లు డిమాండ్ చేయగా రూ.10 వేల కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అయితే ఈ నిధులతో బిసిలకు ఎటువంటి మేలు జరగదని అభిప్రాయపడ్డారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ రుణాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, హాస్టళ్లతోపాటు బిసి హాస్టళ్లను కూడా మూసివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై నిర్లక్ష్యం వహిస్తోందని, నిధుల కేటాయింపు అరకొరగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 60 సార్లు ఢిల్లీకి వెళ్లారని, అయితే ప్రధానమంత్రితో బిసిలు గురించి చర్చించలేదని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారని, అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఖాళీలను భర్తీ చేయడంలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లు ప్రకటించారని, అయితే ఈ నిధులు సరిపోవని చెప్పారు. అలాగే ఫీజు రీయంబర్స్‌మెంట్ కూడా సక్రమంగా అమలు కావడంలేదని, బిసి సంఘాల నాయకులు చెప్పిన పనులేవీ ప్రభుత్వం చేయడంలేదని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు మస్తాన్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, హరీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా వౌలికను ఎన్నుకున్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పవన్‌కుమార్‌ను, తొట్టంబేడు మండల అధ్యక్షుడిగా జయరామయ్య, కార్యదర్శిగా శ్రీహరిని నియమించారు.
పుత్తూరులో 10 లారీలు సీజ్
సత్యవేడు, మార్చి 23: ఆంధ్ర నుంచి తమిళనాడుకు వెళ్తున్న 10 లారీలను గురువారం పుత్తూరు మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ దామోదర నాయుడు సీజ్ చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లోని టొండికుళి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సరైన రికార్డులు, ఎఫ్‌సిలు, అధిక లోడుతో అనుమతుల్లేని ఎనిమిది లారీలను సీజ్ చేసి సత్యవేడు ఆర్టీసి డిపోకు తరలించారు. శ్రీసీటికి చెందిన కోకో కోలా లారీలను కూడా సీజ్ చేసి శ్రీసిటీ ఔట్ పోస్టుకు తరలించారు. వీటిపై కేసులు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు.
అక్షయపాత్ర పేరిట మోసగిస్తున్న ముఠా గుట్టు రట్టు
* పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

చిత్తూరు, మార్చి 23: అక్షయ పాత్ర పేరుతో మోసగిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. తమిళనాడు, కర్నాటకా రాష్ట్రాలతో పాటు ఆంధ్రాలోను పలు ప్రాంతాల్లో అక్షయపాత్ర పేరుతో ఈ ముఠా అనేక మందిని మోసగించనట్లు సమాచారం. అక్షయ పాత్రతో లక్ష రూపాయలను అంతకు రెట్టింపు చేస్తామని, రాగి నాణెలను బంగారు నాణెలుగా మారుస్తామని గత కొంత కాలంగా ఈ ముఠా అనేక మందిని నమ్మించి లక్షలాది రూపాయలను దోచుకొన్నట్లు తెలిసింది. ఇటీవల ఈ ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు యాదమరి మండలంలోని చెన్నరెడ్డిపల్లిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ కొంత కాలంగా ఎవరికీ అనుమానం రాకుండా తమ కార్యక్రమాలను నిర్వహిస్తూవస్తున్నారు. ప్రతిరోజు వీరు రాత్రి వేళల్లో మాత్రమే రావడం, పగటిపూట ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అలాగే ఇంట్లో రాత్రి వేళల్లో పూజలు చేస్తున్నట్లు స్థానికులు గమనించారు. దీంతో వీరిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగలోకి దిగిన పోలీసులు చెన్నరెడ్డిపల్లికి వెళ్లి ఆ ఇంటిని పరిశీలించారు. అందులో కొన్ని విగ్రహాలు, రాగినాణెలు, రసాయన పదార్థాలు, అక్షయ పాత్ర తరహాలో ఉన్న చిన్నపాటి పాత్రలను స్వాధీనం చేసుకొన్నారు. అయితే స్థానికులు మాత్రం రాత్రి వేళల్లో కొందరు చిన్నారులను కూడా తీసు కొస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి చిత్తూరు, కర్నాటక రాష్ట్రం ముళబాగల్‌కు చెందిన నల్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
వివరాలు ఇవ్వండి...నష్ట పరిహారం ఇస్తాం
* జాయంట్ కలెక్టర్ గిరీషా
పాకాల, మార్చి 23: కడప-చిత్తూరు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మండలంలోని దామల్‌చెరువు హైస్కూల్ గేటు వద్ద స్థలాలను పోగొట్టుకున్న వారు రెండు రోజుల్లోగా తహశీల్దార్ కార్యాలయంలో వివరాలు ఇవ్వాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా అన్నారు. గురువారం దామల్ చెరువులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థలాలను కోల్పోయిన బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు మార్కెట్ ధర ప్రకారం స్థలాలు, పక్కా భవనాలను కోల్పోయిన వారికి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి పత్రాలతో తహశీల్దార్‌కు దరఖాస్తులు అందించాలని చెప్పారు. అలాగే ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న భవనాలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం ఇస్తామన్నారు. కాగా తమకు పరిహారం వద్దని, తమకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపాలంటూ పలువురు బాధితులు జెసిని కోరారు. తాము నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. అనంతరం బాధితుల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సురేష్‌కుమార్, తహశీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, ఇఓ ఆర్‌డి షణ్ముగం, ఆర్‌అండ్‌బి అధికారులు, విఏఓలు పాల్గొన్నారు.

ఇకపై ఈపాస్ యంత్రాల ద్వారా ఎరువుల అమ్మకాలు
* వ్యవసాయ శాఖ ఏఇఓ స్పష్టం
సత్యవేడు, మార్చి 23 : రైతులకు ఇకపై ఈ పాస్ యంత్రాల ద్వారా ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ఏఇఓ మల్లికార్జునయ్య తెలిపారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో గురువారం నాలుగు మండలాల ఎరువులు, క్రిమిసంహారక మందుల డీలర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాస్ యంత్రాల ద్వారా డిబిటి పద్ధతిలో రైతులకు అందించే ఎరువులు రాయితీలు పొందే విధానం తదితర అంశాలపై ఆయన డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ పాస్ యంత్రాలను ఉపయోగించి రైతులకు ప్రతి కొనుగోలుకు రశీదులు ఇవ్వాలన్నారు. తద్వారా మండల, జిల్లా, రాష్టస్థ్రాయిలో ప్రతి రోజు, నెలవారీ ఎంత మోతాదులో ఎరువుల విక్రయాలు జరిగాయో స్టాక్ వివరాలు తెలుస్తుందన్నారు. రాష్టస్థ్రాయిలో మానిటరింగ్ చేయడం కూడా సులభంగా ఉంటుందన్నారు. రైతులు తమ ఆధార్ నెంబర్‌ను నమోదు చేసి ఎరువులను కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు ఏఓ ఉమ, వరదయ్యపాల్యెం ఏఓ గౌరి, నాగలాపురం ఏఓ కళావతి, ఏఇఓలు హేమలత, వరలక్ష్మి, చందామరై, ఎంపిఇఓలు ప్రశాంత్, రుద్రయ్య, లావణ్య, సోనియా, స్వర్ణ, నాలుగు మండలాల డీలర్లు పాల్గొన్నారు.