చిత్తూరు

నేడు చిత్తూరు మేయర్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు , ఏప్రిల్ 14: చిత్తూరు మేయర్ ఎన్నిక శనివారం జరగనున్నది ఇందుకు అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు మేయర్ అభ్యర్థగా హేమలతను ఎంపిక చేసారు. దీంతో ఇటీవల 33వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన కఠారి హేమలత మేయర్ గా ఎన్నిక కావడం లాంఛన ప్రాయమే కానున్నది. చిత్తూరు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తరువాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టిడిపి 33 డివిజనల్లలో విజయం సాధించింది. దీంతో మేయర్ స్థానాన్ని బిసి మహిళకు కేటాయించడంతో 33వ డివిజన్ నుంచి గెలుపొందిన కఠారి అనురాధా చిత్తూరు కార్పొరేషన్ తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే 2015 నవంబర్ నెల 17 వ తేదిన కార్పొరేషన్ కార్యాలయంలోనే కఠారి అనురాధా, ఆమె భర్త కఠారి మోహన్ లు దారుణ హత్యకు గురైయ్యారు. అప్పటి నుంచి డిప్యూటీ మేయర్‌గా ఉన్న సుబ్రమణ్యం ఇన్ ఛార్జి మేయర్‌గా కొనసాగుతున్నారు. దీంతో ఇటీవల కఠారి అనురాధ ఎన్నికైన డివిజన్‌తోపాటు, గతంలో ఆత్మహత్యకు పాల్పడ్డ కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డికి చెందిన 38వ డివిజన్‌లకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఉప ఎన్నికల అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘ ఆదేశించింది. దీంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. దీంతో 33వ డివిజన్ నుంచి కఠారి అనురాధ కోడలైన హేమలత ఏకగ్రీంగా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో పూర్తి మెజారిటీ అధికార పార్టీకే ఉండటంతోపాటు, మేయర్ అభ్యర్థిగా హేమలతను పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో ఆమె ఎన్నిక కేవలం లాంఛన ప్రాయమే కానున్నది.
యువత నూతన ఆలోచనలతో ముందడుగు వేయాలి
* ఎంపి నిమ్మల కృష్ణప్ప

తిరుపతి, ఏప్రిల్ 14: ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల కోసం కాకుండా నూతన ఆలోచనలతో ముందడుగు వేసి ఆర్థిక పరిపుష్టికి బాటలు వేసుకోవాలని ఎంపి నిమ్మల కృష్ణప్ప అన్నారు. స్థానిక గ్రూప్ థియేటర్స్ ఎదురుగా పోష్‌టెల్ సంస్థ ప్రెష్‌అప్‌ను శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలాంటి ఆధ్యాత్మిక నగరాల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, యాత్రికులు, వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు గంటల వారిగా ఈప్రెషఅప్‌ను వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక భారం నుంచి బయటపడచ్చని అన్నారు. ఒకే గొడుగు కిందకు పలు సౌకర్యాలను కల్పిస్తూ తిరుపతి ప్రత్యేకమైన గదులు, విశ్రాంతికి అనుకూలమైన బెడ్‌లు కలిగిఉండటం ఆహ్వానించ దగ్గ పరిణామమన్నారు. ప్రెష్‌అప్ సి ఇ ఓ వినిల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని పర్యాటక కేంద్రాల్లో తిరుపతి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమన్నారు. ఇక్కడకు వచ్చే ప్రయాణీకులు ప్రెష్‌అప్ కావడానికి అవసరమైన అన్ని వసతులను గంటల వారీగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మూడు గంటలకు రూ.199 చొప్పున వసూలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ప్యాకేజీలతో స్మార్ట్‌కార్డును తీసుకువస్తామన్నారు. అలాగే త్వరలో బెంగుళూరు, చెన్నయ్ తదితర ప్రాంతాల్లో కూడా తమ ప్రెష్‌అప్ హోటళ్లను ప్రారంభిస్తామన్నారు.
‘ప్రత్యేక హోదా రాజకీయం చేయద్దు’
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా రాజకీయాలు చేయవద్దని ఎంపి నిమ్మల కృష్ణప్ప అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వలేమని తేల్చి చెప్పినా హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంలో అర్ధం లేదన్నారు. ఈ సమయంలో కేంద్రం నుంచి అవసరమైన నిధులు తెప్పించుకోవడంపైనే దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అయితే హోదా నినాధంతో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. ప్రస్తుతం కేంద్రం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపడుతోందని వివరించారు. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఎంపిలంటూ వచ్చిన వివాదం అప్పుడే సర్దుమణిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దక్షిణాంధ్ర ఎంపిలంటూ వ్యాఖ్యానించిన ఎంపి క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బాబు, జగన్‌లకేనా ఇళ్లు
* నిరుపేద మహిళలకు వదా:్ద
కేంద్రమాజీ మంత్రి చింతామోహన్

తిరుపతి, ఏప్రిల్ 14: తమ సొంత ఇళ్లను నిర్మించుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ పోటీలు పడి వందల, వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇంధ్ర భవనాలు నిర్మించుకున్నారని, ఉండటానికి నీడలేని 7008 మంది నిరుపేద మహిళల కోసం కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు మాత్రం బాబు మంగళం పాడారని కేంద్రమాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ నిప్పులు చెరిగారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక ఆర్టీసి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే ఈ సందర్బంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద మహిళల పట్ల అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ వినూత్న రీతిలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు రూ.2500 కోట్లతో హైదరాబాదులో ఇల్లు కట్టుకుంటే, జగన్ రూ. 1000 కోట్లతో ఇంటిని నిర్మించుకున్నాడన్నారు. అయితే పూరిగుడిసెకూడా లేని నిరుపేదలను బాబు విస్మరించాడన్నారు. అంబేద్కర్ నిజాయితీ పరుడని, నిర్మొహమాటస్తుడని, మేధావని అన్నారు. ఆయన సర్వజన సంక్షేమాన్ని కాంక్షించి భారతదేశానికి గొప్పరాజ్యాంగాన్ని అందించారన్నారు. ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందన్నారని, మోదీ మరో అడుగు ముందుకువేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారన్నారు. ఇప్పటికి మూడేళ్ళు పూర్తవుతున్నా వారి హామీలకు అతిగతీలేదన్నారు. లక్షలాది బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 15శాతం, ఓబిసిలకు 27శాతం, గిరిజనులకు ఏడున్నర శాతం బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. మూడు సంవత్సరాలు క్రితం యుపి ఏ ప్రభుత్వం నిరుపేద మహిళల కోసం రూ.298 కోట్లతో 7008 ఇండ్లను మంజూరు చేసిందని, వెంటనే వాటిని నిర్మించి ఇవ్వాలన్నారు. స్విమ్స్‌లో నిరుపేదలకు ఉచితవైద్యం అందివ్వాలని, ఇందుకు టిటిడి రూ.20కోట్లను స్విమ్స్‌కు ఇవ్వాలన్నారు. ఈకార్యక్రమంలో పిసిసి కార్యదర్శి నైనారు శ్రీనివాసులు, పూతలపట్టు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సింహ, ముత్యపు పందిరి వాహనాలపై
ఊరేగిన శ్రీవేదనారాయణ స్వామి
నాగలాపురం, ఏప్రిల్ 14: శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం స్వామి వారు ఉదయం సింహ వాహనంపైన, రాత్రి ముత్యపు పందిరి వాహనంపైన భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, సర్వదర్శనం అనంతరం 8గంటలకు స్వామి, అమ్మవార్లను సింహవాహనంపై వేంచేపు చేసి 9.30గంటల వరకు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈసందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. 10 నుంచి 11 గంటల వరకు శ్రీ,్భ దేవేరులతో స్వామివారికి వేద మంత్రాల నడుమ స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 6.45 గంటల వరకు ఊంజల్ సేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు స్వామి అమ్మవార్లు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజభట్టాచార్య, షరాబు ఉదయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.
గుడ్‌ఫ్రైడే సందర్భంగా విశేష ప్రార్థనలు
తిరుపతి, ఏప్రిల్ 14: గుడ్‌ప్రైడేను పురస్కరించుకుని తిరుపతిలోని పలు చర్చిల్లో క్రైస్తవ సోదర,సోదరీమణులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక జగన్మాత చర్చిలో విన్సింట్ డి పౌల్ సొసైటీ ఆధ్వర్యంలో 104మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈకార్యక్రమంలో చర్చి రెవరెండ్ ఎస్.డేవిడ్, డాక్టర్ వి.కొండారెడ్డి, ఎస్ ఏ రాజు, జోసఫ్ మార్టిన్, ఎ.కుమార్ తదితరులు పాల్గొన్నారు. షకీనా మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పద్మావతి పురంలోని బిలీవర్స్ చర్చ్, కె బిలే ఔట్‌లోని షకీనా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలుత యేసయ్య శిలువ యాత్రను నిర్వహించారు. ఈకార్యక్రమంలోపాస్టర్ దిలీప్‌కుమార్, థామస్, జోషువా, యోషే,జోయల్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈసందర్భంగా శిలువ జ్ఞాన సంబంధ పాటలు క్రైస్తలవుల హృదయాలను కదలించాయి.
అంబేద్కర్ ఆశయమే నేటి యువతకు మార్గదర్శకం కావాలి
* విసి ఆచార్య దామోదరం
తిరుపతి, ఏప్రిల్ 14: సర్వజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని తపించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆశయాలే నేటి యువతకు మార్గదర్శకం కావాలని ఎస్వీయూ విసి ఆవుల దామోదరం అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముందుగా ఎస్వీయూ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధుల్లో రోడ్లల్లో ఉన్న చెత్తను ఎలా తొలగిస్తామో సంఘంలోని కుళ్లుని తొలగించాలన్నదే అంబేద్కర్ ఆశయమన్నారు. ఇందులో భాగంగా మానవ హక్కుల పరిరక్షణకు అంబేద్కర్ విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడం నేటి యువతరం బాధ్యతన్నారు. ఈకార్యక్రమంలో రెక్టార్ ఆచార్య భాస్కర్, రిజిస్ట్రార్ దేవరాజులు, ఇసి సభ్యులు గురుప్రసాద్, తెలుగు ఆచార్యులు మునిరత్నమ్మ, న్యూఢిల్లీ జె ఎన్ యు ఆచార్యులు చిన్నారావు, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
సమాజంలోని రుగ్మతలను తొలగించడమే
అంబేద్కర్‌కు నిజమైన నివాళి
తిరుపతి, ఏప్రిల్ 14: ధర్మం అధర్మం అనే వివక్షతను పాటించి సమాజంలోని రుగ్మతలను తొలగించినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళిని అర్పించినట్లుని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు అన్నారు. టిటిడి పరిపాలనా భవనంలో శుక్రవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 126 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతికూల స్థాయిలో అట్టడుగు స్థాయి నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన డాక్టర్ అంబేద్కర్‌ను దేశంలోని ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందుతూ సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో వివక్ష తొలగాలంటే ప్రతి ఒక్కరు విద్యా, జ్ఞానం, శాస్ర్తియ దృక్పధం అలవచుకోవాలన్నారు. నాడు ఆ వివక్షతను అధిగమించి సమాజానికి కర్తవ్య బోధ చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. జె ఇ ఓ పోలభాస్కర్ , పి ఆర్వో టి.రవి, ఎస్వీయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్‌రంజని, విశ్రాంతి సి ఇ రఘుపతి రావు, టిటిడి డిప్యూటి ఇ ఓదేవంద్రబాబు, చలపతి బాబు, వెంకటయ్య, విజయసారథి, అధికారులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా టిటిడి సహాయ ప్రజా సంబంధాల అధికారి నీలిమా వ్యాఖ్యాతగా వ్యవహరించగా డాక్టర్ రంజని, రఘుపతి రావ్ దంపతులును ఇ ఓ , జె ఇ ఓలు సన్మానించారు.