చిత్తూరు

జిల్లా అధికారులు బాధ్యతతో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 21 : జిల్లాలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా నూతన కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిత్తూరులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. అన్ని శాఖల్లో విధిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వినియోగించాలన్నారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాకు ప్రత్యేకత ఉందని, రాష్ట్ర నిర్మాణంలో ఈ జిల్లా పాత్ర ఎక్కువగా ఉండాలని, అందుకు అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అధికారులు పనివిధానాన్ని వేగవంతం చేసి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి చూపాలని చెప్పారు. జిల్లాలో ఈ ఆఫీస్ విధానం తప్పనిసరిగా అమలు కావాలన్నారు. ప్రజల కోసం పనిచేసే తపన అందరిలో ఉండాలన్నారు. జిల్లా ప్రజలకు మంచి చేయాలన్నదే అందరి లక్ష్యం కావాలన్నారు. భావితరాలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా అధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సొంత నిర్ణయాలు పక్కన పెట్టి, రాష్ట్రంలో ఈ జిల్లాను అగ్రగామిగా నిలపడానికి అందురు కష్టపడాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంచడానికి, పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ పనులు వేగవంతం చేయడంతో పాటు వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలు చురుకైన పాత్ర వహించాలన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కావాల్సి ఉందన్నారు. జిల్లాలో గత పదేళ్లుగా విద్యాపరంగా ఆశించే స్థాయిలో ఫలితాలు రావడం లేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇషా ఫౌండేషన్ విధానం జిల్లాలో ప్రారంభం కావాలని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీలో విధిగా నగదు రహిత లావాదేవీలు కొనసాగాలన్నారు. బయోమెట్రిక్ విధానం విధిగా అమలు కావాలన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిత్యావసర వస్తువులు, పింఛన్లు పంపిణీ సక్రమంగా కొనసాగాలన్నారు. ఈ సమావేశంలో జెసి గిరిషా, పలువురు సబ్ కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రమాద స్థలానికి హుటాహుటిన వెళ్లిన కలెక్టర్
ఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే కలెక్టర్ ప్రద్యుమ్న హుటాహుటిన చిత్తూరు నుంచి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిత్తూరులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంతలోనే ఏర్పేడు వద్ద భారీ రోడ్డు ప్రమాదం సంభవించినట్లు సమాచారం అందింది. ముఖ్యమంత్రి కూడా ఈ ప్రమాదంపై కలెక్టర్‌తో సంప్రందించి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్ సమావేశాన్ని అర్థాంతరంగా ముగించుకొని జెసి గిరిషా, ఇతర జిల్లాస్థాయి అధికారులను వెంటబెట్టుకొని సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.