చిత్తూరు

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల సాధన లక్ష్యంగా నగరాలను తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 11: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పరిశుభ్రతను పాటించి అందమైన నగరాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్‌లోని సమావేశ మందిరంలో మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతకు, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సూచించిన సూచనల మేరకు ఐదు నెలల్లో మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు సాధించి అందమైన నగరాలుగా తీర్చిదిద్దాలని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. భూగర్భ డ్రైనేజిని రూపొందించుటకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాళహస్తి పట్టణాల్లో పరిశుభ్రత లోపించిందని, రోడ్లకు ఇరువైపులా చెత్త చేరకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్ ప్రకటించాయని, స్వచ్ఛ సర్వేక్షణ్‌లోని సూచికల మేరకు రాబోవు ఆగస్టు నెల నుంచి పూర్తిస్థాయిలో అమలు జరగాలన్నారు. పట్టణ ప్రజలు నగర వాతావరణాన్ని చూసి ఆహ్లాదకర అనుభూతి కలగాలని చెప్పారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, మదనపల్లె, పలమనేరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, నగరి మున్సిపల్ కమిషనర్లు ఎం విశ్వనాధ్, కె రామచంద్రరావు, ఎస్ శ్రీహరిబాబు, జి చంద్రయ్య, వెంకటేశ్వర్లుతో పాటు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
నాగలాపురం వాణిజ్య పనుల శాఖ చెక్‌పోస్ట్‌పై ఎసిబి అధికారుల దాడి
* అక్రమంగా వసూలు చేసిన రూ.21వేలు స్వాధీనం
నాగలాపురం, మే 11: నాగలాపురం వాణిజ్యపనుల చెక్‌పోస్ట్‌పై తిరుపతి ఎసిబి అధికారులు గురువారం దాడి చేశారు. ఈ దాడిలో చెక్‌పోస్ట్ సిబ్బంది వాహనదారుల నుంచి అక్రమంగా వసూలుచేసిన రూ.21వేలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించిన ఎసిబి సి ఐ లు సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయశేఖర్ గురువారం ఉదయం 7.50 గంటలకు నాగలాపురం వాణిజ్యపనుల చెక్‌పోస్టుపై దాడిచేసి చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులైన ఉమాపతి, రాజేష్, పరంధామ్, కార్యాలయ పరిసరాలను తనిఖీచేయగా వీరి దగ్గర రూ.21వేలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది విధులు నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తుల చేత లారీలను ఆపి అక్రమంగా వసూలుచేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. గురువారం చేసిన దాడిలో ఎసిటివో చెన్నరాయుడు, సీనియర్ అసిస్టెంట్ మురగదాస్, శ్రీనివాసులు, నరసింహులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిని కూడా విచారించి నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు.