చిత్తూరు

మదనపల్లెలో రెండవ మినీమహానాడుకు జిల్లాపార్టీనే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మే 22: మదనపల్లె నియోజవర్గం టీడీపీ రెండో మినీమహానాడు ఏర్పాటుకు జిల్లాపార్టీనే పూర్తికారణమని ఆ పార్టీ సీనియర్ నాయకులు గంగారపు రామ్‌దాస్‌చౌదరి, బొడేపాటి శ్రీనివాస్, బొమ్మనచెరువు శ్రీరాములు, కోపూరి మల్లికార్జుననాయుడు, రామసముద్రం, నిమ్మనపల్లె మండలపార్టీ అద్యక్షులు కృష్ణంరాజు, రాజన్నలు ధ్వజమెత్తారు. పచ్చని సంసారంలో నిప్పులకొలిమిలా తయారుచేశారన్నారు. మంగళవారం మదనపల్లె నియోజకవర్గం మినీ మహానాడు స్థానిక శ్రీకృష్ణ కళ్యాణమండలంలో మండలపార్టీ అధ్యక్షుల అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మృతిచెందిన వారికి ఘనంగా నివాళులు అర్పించారు. సీనియర్ నాయకులు గంగారపురామ్‌దాస్ చౌదరి, బొడేపాటి శ్రీనివాస్, బొమ్మనచెరువు శ్రీరాములు, కొపూరి మల్లికార్జుననాయుడులు మాట్లాడుతూ జిల్లాలోని 14నియోజకవర్గాల్లో టీడీపీకి కుప్పం తర్వాత మదనపల్లెకు కంచుకోటగా నిలిచిందన్నారు. ఇందుకు కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల సమస్యలపై తమ శాయశక్తులా శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో కొనసాగుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేయత్నంలో 1982లో అప్పటి ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన అనతికాలంలోనే అధికారం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. నాటి ఎన్టీఆర్ పథకాలు నేటికీ అమలవుతున్నాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. నాలుగేళ్ళు మిత్రపక్షంగా ఉన్న బిజెపి దొంగనాటకాలకు తెరదించాల్సి వచ్చిందన్నారు. జరిగిన కర్నాటక ఎన్నికలలో బిజెపి మోసానికి తెలుగుప్రజల తీర్పుతో నడ్డివిరిచిందన్నారు. చేసిన తప్పను కడుక్కునేందుకు జగన్ పాదయాత్ర చేపడుతూనే సీఎంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, ఇటీవల పార్టీస్థాపించి ప్రజలలోకి వస్తున్న పావలా పవన్‌కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో, ప్రత్యేకహోదాపై కేంద్రంపై పోరాటం చేసే ధైర్యం లేక మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ఏడాదికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరుగుతున్నప్పటికీ జగన్, పవన్‌కళ్యాణ్‌లు నోర్లు మెదపడం లేదన్నారు. మదనపల్లె నియోజవర్గంలో రెండవ మినీమహానాడు కార్యకర్తల ఆత్మగౌరవం కాపాడేందుకే అన్నారు. ఇది తెలుగుదేశం సంప్రదాయం అన్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవం, పొరుషం నడుమ తెలుగుదేశంపార్టీ నీతి నిజయితీగా ప్రజాపరిపాలన కొనసాగిస్తోందన్నారు. నియోజవర్గ టిడిపిలో దౌర్భాగ్య పరిస్థితులు కొనసాగుతున్నాయని, కార్యకర్తలు నిరాశ, నిశ్రహులతో బతకడం కష్టమని, మదనపల్లెకు నాయకత్వం కేటాయించకపోవడమే అన్నారు. జిల్లాపార్టీ ఏకపక్ష ధోరణితో మదనపల్లె నియోజకవర్గం దుర్భరపరిస్థితిలో చేరుకుంటోందన్నారు. అనంతరం 11అంశాలపై తీర్మాణాలు చేశారు. ఈ తీర్మాణాలను జిల్లాపార్టీ, రాష్ట్ర పార్టీ మహానాడులో నివేధిస్తామన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.