చిత్తూరు

విద్యుత్‌శాఖపై అసంతృప్తి వ్యక్తం చేసిన జడ్పీటీసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 17: విద్యుత్‌శాఖ పనితీరుపై పలువురు జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ అధ్యక్షతన పలు స్థాయి సంఘ సమావేశాలు వాడీ వేడీగా సాగాయి. అయితే కోరం లేక 3, 5 సమావేశాలు వాయిదాపడ్డాయి. ఈసందర్భంగా పలువురు జడ్పీటీసీలు మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్‌శాఖ పనితీరు అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కనెక్షన్లు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీని వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోపక్క పలు గ్రామాల్లో 11కెవి విద్యుత్ లైన్లు గృహాలపై వెళ్తుండడంతో పలువురు మృత్యువాత పడుతున్నారని, ఈ లైన్లు మార్చాలని పలుమార్లు శాఖాధికారులకు దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. ఈసందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ జోక్యం చేసుకొని పలుచోట్ల 11కెవి విద్యుత్ లైను వల్ల ప్రమాదం చోటుచేసుకుంటున్నాయని వెంటనే వీటిని మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో గాలుల వల్ల విద్యుత్‌కు అతరాయం కలుగుతుందని దీనిని సరిచేయాలని పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దీనివల్ల గ్రామాల్లో తరచూ ట్రాన్స్‌ఫార్మర్లుతో పాటు గృహోపకరణ పరికరాలు కూడా కాలిపోతున్నాయన్నారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు కోసం అదనంగా మూడవ లైను ఏర్పాటు చేయాల్సి ఉన్నా విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల ఎల్‌ఈడీ లైట్లను అమర్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ ఎల్‌ఈడీ లైట్లు గ్రామాల్లో అమర్చడానికి చర్యలు చేపట్టినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవి వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొందన్నారు. పలు చోట్ల ట్రాన్స్‌ఫారంల నిర్మాణాలు పూర్తి అయినా వాటిని ప్రారంభించడం లేదన్నారు. కలకడ జడ్పీటీసీ తిరుపతినాయుడు మాట్లాడుతూ మండల పరిధిలో పలు గ్రామాల్లో సంవత్సరం క్రితం నిర్మించిన సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని వీటిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాధవనాయుడు మాట్లాడుతూ ఎంఎం పురం రోడ్డు బాగా లేదని ఈ విషయంగా అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కలకడ జడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ పడమటి మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య నెలకొందని వెంటనే యుద్ధప్రాతిపదికన నీటి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సిద్ధం చేశారు. గంగవరం జడ్పీటీసీ మాట్లాడుతూ ఓవర్ హెడ్ ట్యాంకుల పనులు సక్రమంగా జరగడం లేదని దీని వలన ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్నారన్నారు. రేణిగుంట జడ్పీటీసీ లీలావతి మాట్లాడుతూ మండల పరిధిలో ఇరిగేషన్ అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ వల్ల పలు సమస్యలు వస్తున్నాయని వీటిని పరిష్కరించాలని పలుమార్లు సమావేశాల్లో ప్రస్తావిస్తున్నా అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంలేదన్నారు. దీనివల్ల అభివృద్ధి పనులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని పలువురు సభ్యులు వివిధ శాఖల అధికారులను నిలదీసారు. జడ్పీ చైర్మ్‌న్ గీర్వాణిచంద్రప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలోని పలు జాతీయ రహదారులు వద్ద విపరీతంగా చెట్లు మొలచిపోవడంతో రహదారి కనపడని పరిస్థితి నెలకొందని, వీటిని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో పలువురు జిల్లా అధికారులు, జడ్పీటీసి సభ్యులు పాల్గొన్నారు.
ఫ్రోటోకాల్‌పై మండిపడ్డ వైకాపా ఎమ్మెల్యే:-
జిల్లాలో అధికారులు ఫ్రోటోకాల్ పాటించడం లేదని గంగాధరనెల్లూరు వైకాపా ఎమ్మెల్యే నారాయణస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొన్ని చోట్ల వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం లేదని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత అభిప్రాయం కాదని అందరి ప్రజాప్రతినిధుల అభిప్రాయమన్నారు. ముఖ్యంగా వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక కమిటీలను ఆహ్వానించడం ఎంతవరకు సమంజసమన్నారు. ముఖ్యంగా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కొందరి అధికారుల తీరు ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులకు అధికారులు తగిన గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి జిల్లాలో ఫ్రోటోకాల్ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను విన్నవించారు. గంగాధరనెల్లూరు మండలంలో ఉపాధిహామీకి సంబంధించి గడ్డపారలు, పార్లను కొందరు నేతలు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. దీనిపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన పట్టుపట్టారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని పలు చోట్ల భూములను విక్రయించారని దీనిపై సమగ్రమైన లెక్కలను అందించాలని అధికారులను నిలదీసారు. వైకాపా ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన ఇళ్లను అనేక ప్రాంతాల్లో కూలిపోయే స్థితిలో ఉన్నాయని వాటి గురించి పట్టించుకునే నాధుడు కరువయ్యారన్నారు. వెంటనే ఇలాంటి ఇళ్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.