చిత్తూరు

రూ. 1.09 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు అమర్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: డిస్కం పరిధిలో 1.09 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు అమర్చామని ఆ సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ సీతారామరాజు వెల్లడించారు. స్థానిక డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో ఇంధన సామర్థ్యంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2.03 లక్షల ఇంధన సామర్థ్య ఫ్యాన్లను, 46వేల ఇంధన సామర్థ్య ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంధన సామర్థ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మెప్మా, ఎస్‌ఈసీఎంలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ జ్యోతి, డిస్కం ఎస్‌ఈ వెంకటచలపతి, చీఫ్ ఇంజినీర్ నందకుమార్, సీజీఎం లలిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఆర్‌డిఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, డిస్కం సీఎండీ నాయక్ సందేశాలను చదివి వినిపించారు.

శ్రీరంగం నుంచి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు
తిరుపతి, జూలై 17: ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి రామచంద్రన్, ఆ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ జయ, జాయింట్‌కమిషనర్ జయరామన్, అదనపుకమిషనర్ కలైమగల్, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వేణుశ్రీనివాసన్‌లు కలిసి సమర్పించారు. మంగళవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కల గల పెద్ద జీయంగార్ మఠంలో శ్రీవారిసారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల ఇన్‌చార్జ్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆణివార ఆస్థానం పర్వదిన శ్రీరంగనాథుడి చెంత నుంచి తిరుమల శ్రీవారికి కానుకగా పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతి ఏడాది కైశిక ద్వాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి చెంత నుంచి శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామివారికి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్, టీటీడీ ఛైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, ఇన్‌చార్జ్ సీవీఎస్‌ఓ శివకుమార్ రెడ్డి, వీజీఓ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.