చిత్తూరు

గుడిమల్లం ఆలయ సేవలో ఇటలీ దేశస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, జూలై 19: మండలంలోని గుడిమల్లంలో వెలసిన అతి పురాతన దేవాలయమైన పరశురామేశ్వరస్వామి సేవలో ఇటలీ దేశానికి చెందిన భక్తులు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను గురించి వారు అడిగి తెలుసుకున్నారు. ఆలయ పూజారి వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నేటి నుంచి దేశవ్యాప్తంగా లారీల సమ్మె
తిరుపతి, జూలై 19: తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20 నుంచి దేశవ్యాప్తంగా లారీ రవాణా వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు బాలాజీ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. మునిరాజ్, కార్యదర్శి దొడ్డారెడ్డి సిద్దారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 2 సంవత్సరాలుగా ఎన్నో రకాల ఆందోళనలు నిర్వహించినా పాలకులు హామీలకు పరిమితమయ్యారన్నారు. ఈక్రమంలో తమ డిమాండ్ల సాధన కోసం ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (న్యూఢిల్లీ), ద ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ (విజయవాడ) ఆధ్వర్యంలో ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా లారీలను నిరవధికంగా నిలిపివేస్తూ నిరసన వ్యక్తం చేయనున్నట్లు వారు తెలిపారు.

23న తిరుమలలో పల్లవోత్సవం
తిరుపతి, జూలై 19: మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈనెల 23న సోమవారం పల్లవోత్సవాన్ని తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థాన ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి ఇస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.