చిత్తూరు

ఇషా విద్యా విధానం ప్రభుత్వ విధాన నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 19: ఇషా విద్యావిధానం ప్రభుత్వ విధాన నిర్ణయమని , జిల్లాలో కొనసాగుతున్న విద్యా విధానంలో కొన్ని మార్పులతో అమలు చేమడం అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఇషా విద్యా విధానంపై పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇషా విద్యా విధానం ప్రభుత్వ విధాన నిర్ణయమని దీన్ని ఉపాధ్యాయులు గమనించాలన్నారు. ఇషా ద్వారా విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్ధేశమన్నారు. జిల్లాలో ఈవిద్యా విధానంలో ఇబ్బంది కరపరిస్థితులు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈవిద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం బావ్యం కాదన్నారు. ఈసందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు మాట్లాడుతూ విద్యా ప్రమాణాల పెరుగుదలకు ,సవరణాత్మక బోధనకు మీము వ్యతిరేకం కాదని , ఇషా వల్ల విద్యా వ్యవస్థకు నష్టమేని , ఇది క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభిప్రాయమన్నారు. ఈ సందర్భంగా ఇ షా విద్యా విధానం అమలులో తలెత్తిన ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెల్లారు. దీని పై మారోమారు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొంటామని కలెక్టర్ సంఘనాయకులకు సూచించారు. తదుపరి జిల్లాలో విధినిర్వహణలో మరణించిన టీచర్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పధకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉన్న ఖాళీలను పంచాయితీ రాజ్ శాఖలో వెంటనే నియామకాలను జరపాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు అధికారులకు విన్నవించారు. కలెక్టర్ ఈవిషయంగా జడ్పీ సీఈవోతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ గిరీషా, జేసి 2 చంద్రవౌళి, జిల్లా ఇషా కో ఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యాయ సంఘ నేతలు సోమశేఖర్ నాయుడు, గంటా మోహన్, సర్వోత్తం రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.