చిత్తూరు

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మూడేళ్లుగా దేశంలో ఏపీదే ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: పరిశ్రమల స్థాపన కోసం చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్‌లో దేశంలోనే గత మూడు సంవత్సరాలుగా ఏపీ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం స్థానిక 30వ వార్డు నెహ్రూనగర్‌లో జరిగిన వార్డుదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టి రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్‌తో ఉంటే సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాలకు లోటు లేకుండా నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా రైతుల కోసం రూ. 24వేల కోట్టు రుణ ఉపశమన పథకం, ఇంటి పెద్ద చనిపోతే తాను అన్నగా నిలబడి చంద్రన్న బీమా, డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ కింద రూ. 10వేలు, రేషన్ బియ్యం కుటుంబానికి 20 కేజీలు ఇస్తుంటే దానిని మనిషికి 5 కేజీలు వంతున పెంచి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారన్నారు. వృద్ధులకు రూ.200 పింఛన్‌ను ఐదురెట్లు పెంచి రూ. 1000 అందిస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం సహకరించడంలేదని మంత్రి విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటే ఈ విషయం దేశం యావత్తు తెలిసేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజానీకంపై ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 2015లో 2వ స్థానంలో వస్తే 2016నుంచి 2018 వరకు వరుసగా దేశంలో మొదటి స్థానంలో నిలుస్తున్నదన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయని, ఇంకా వస్తున్నాయని, యువత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నామని మంత్రి వివరించారు. నిరుపేదలకు చంద్రన్న పెళ్లికానుక, ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరాలని ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం, పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, చంద్రన్న సంక్రాంతి, రంజాన్, క్రిస్టియన్ కానుకలు అమలు చేసి దేశంలో ఆదర్శంగా నిలిచామని మంత్రి అమరనాథ రెడ్డి చెప్పారు. ప్రజలకు దగ్గరై క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం చేయాలనే దిశగా 1500 రోజుల పరిపాలనలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడం, ఇంకా ఏవైనా అవసరాలు ఉంటు గుర్తించడమే లక్ష్యంగా ఈనెల 16వ తేదీ నుంచి వార్డు, గ్రామ దర్శిని కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లాఅరుణకుమారి, తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.