చిత్తూరు

స్మగ్లర్లను వెంటాడుతూ రైలు కింద పడబోయిన టాస్క్ఫోర్స్ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: శ్రీనివాసమంగాపురం సమీపంలోని లక్ష్మీపురం చెరువు వద్ద గురువారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో స్మగ్లర్లను వెంటాడిన టాస్క్ఫోర్స్ సిబ్బంది రైల్వే పట్టాలు దాటి పారిపోయిన వారికోసం ఒక్క నిమిషం తొందరపడి ఉన్నా ఇద్దరు గూడ్స్ రైలు కింద పడి మృత్యువాత పడేవారు. ఆఖరి నిమిషంలో రైలును గమనించి ఆగిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే ఆర్‌ఐ భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది గురువారం తెల్లవారు జామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో లక్ష్మీపురం చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో అలికిడి కావడంతో ఆవైపుగా టార్చ్‌వేసి పరిశీలించారు. దీంతో ఎర్రచందనం దుంగలు తీసుకు వెళుతున్న స్మగ్లర్లు వాటిని అక్కడే వదిలి పారిపోయారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది వారిని పట్టుకునేందుకు వెంబడించారు. స్మగ్లర్లు రైల్వేపట్టాలు దాటి పారిపోగా, వారిని పట్టుకోవడానికి ముందుకు వెళ్లిన ఇద్దరు అప్పుడు వచ్చిన గూడ్స్ రైలు కింద పడేపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా 9 ఎర్రచందనం దుంగలు, బరువు తూచే యంత్రం, రెండు జతల దుస్తులు, వంటసామగ్రి, కూరగాయలు లభించాయి. దుస్తుల్లో ఒక స్కూటర్ తాళం లభించింది. వేలూరు జిల్లా వాణియంబాడి వద్ద స్కూటర్‌ను పార్క్ చేసిన టోకెన్ అందులో లభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ కాంతారావు మాట్లాడుతూ ఈప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం ఇది 30వ సారన్నారు. ఈ ప్రాంతంపై నిఘా పెట్టాలని అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందిస్తామన్నారు. అక్కడకు చేరుకున్న జాగిలాలు సంఘటనా స్థలం నుంచి శ్రీనివాసమంగాపురం ప్రధాన రహదారి వరకు వెళ్లి ఆగిపోయాయి. ఎఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐలు మురళి, చంద్రశేఖర్, ఎస్‌ఐ సోమశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.