చిత్తూరు

టీడీపీ హయాంలోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెదురుకుప్పం, జూలై 19: గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్ స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతాక్రమంలో అమలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నా వ్యవసాయ రుణమాఫీని సక్రమంగా అమలుచేసినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వలన ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలుపరచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకదృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. రైతులు, మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి పేదవానికి పక్కా ఇంటి నిర్మాణం చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రేషన్‌కార్డు, పెన్షన్ అందించేందుకు ప్రతి 30 కుటుంబాలకు ఒక్క సాధికార మిత్రను ఏర్పాటుచేసినట్లు ఆమె చెప్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళిక ద్వారా యువతీ యువకులకు అధిక సంఖ్యలో స్వయం ఉపాధి రుణాలు మంజూరుచేసినట్లు పేర్కొన్నారు. స్వయం ఉపాధి రుణాలను అధికంగా మంజూరుచేయడం వలన యువత స్వయం ఉపాధి సాధించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు ఆమె తెలిపారు. జన్మభూమి కమిటీల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అందిస్తున్నట్లు, వీటిని గ్రామస్థాయిలో సరిగా ఉపయోగించుకొని వ్యక్తిగత జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవాలని ఆమె సూచించారు. గ్రామాలలో వౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రతి ఇంటికీ తాగునీటి వసతి మెరుగుపరచడానికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఉపాధి నిధుల ద్వారా గ్రామాల్లో సిమెంటురోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను వినియోగించుకుంటూ భవిష్యత్‌లో తమ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ హరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు నాగరాజురెడ్డి, జిల్లా కార్యదర్శి మోహనమురళి, ఎంపీటీసీలు నందిని, బాబునాయుడు, సర్పంచులు వెంకటేష్, ఆ పార్టీ నేతలు చాణిక్యప్రతాప్, మునిచంద్రారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.