చిత్తూరు

కేరళకు తరలివెళ్లిన రూ. 50లక్షల వస్తువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 20: కేరళ రాష్ట్రంలో వరదల వల్ల నిరాశ్రయులైన వారికి చేయూతనివ్వడానికి జిల్లాలో సేకరించిన రూ 50లక్షల విలువ చేసే వస్తువులను సోమవారం చిత్తూరు నుంచి లారీల ద్వారా కేరళకు తరలించారు. జిల్లా సచివాలయంలో ఈ వస్తువులను కేరళ రాష్ట్రం ఎర్నాకులంకు తీసుకెల్లే మూడు లారీలను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జడ్పీ చైర్మెన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్సీ దొరబాబు, నగర మేయర్ కఠారి హేమలతలు జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతి విలయ తాండవం కారణంగా అతలాకుతలమైన కేరాళలో అనేక లక్షల మంది నిరాశ్రయలైన వారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వాసులు స్పందించి కేవలం రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ 50 లక్షల విలవు చేసే నిత్యావసర వస్తువులు, బట్టలు, మందులు , ఇతర వస్తువులను అందించి తమ ఉదారతను చాటు కొన్నారు. ఈ వస్తువులను ప్రత్యేకంగా ప్యాక్ చేసి మూడు లారీల ద్వారా కేరాళకు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేరళ వరదబాధితుల సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ 10 కోట్లు పంపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లాలో కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించామని, ఇందకు జిల్లా నలుమూల నుంచి అనేక మంది మానవతా దృక్పదంతో స్పందించి సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు. అధికారులు, జేఏసి నేతలు , ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు, వివిధ సంస్థలు ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో 1550 కుటుంబాలకు అవసరమయ్యే రూ 50లక్షల విలువ చేసే వివిధ వస్తువులను సేకరించారని, వీటిని కేరళ రాష్ట్రాంలోని ఏర్నాకులంకు మూడు లారీల ద్వారా పంపుతున్నట్లు చెప్పారు. ఈ లారీలతో పాటు అధికారులు కూడా అక్కడికి వెళ్లి ఈ కిట్‌లను బాధితులకు అందజేసి తిరిగి వస్తారన్నారు. ఇలా వరద బాధితులకు సహాయం చేయడం వల్ల అనేక కుటుంబాలకు తమ వంతు చేయూతనిచ్చామన్న సంతృప్తి దక్కుతుందన్నారు. చిన్న పిల్లలు ఎవ్వరైనా సహాయం చేయదలిస్తే నేరుగా జిల్లా కలెక్టర్ అకౌంట్‌కు ట్రాన్ఫ్ ఫర్ చేయాలని తెలిపారు. బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన వెంటనే స్పందించిన జిల్లా వాసులకు కృతజ్ఞతులు తెలుపుతున్నట్లు చెప్నారు. జడ్పీ చైర్ పర్స్‌న్ గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం జిల్లా యంత్రాంగం స్పందించి సుమారు రూ 50లక్షల విలువ చేసే వస్తువులను కేరళకు పంపడం ఏంతో సంతోషదాయకమన్నారు. ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ జిల్లా నుంచి ఎక్కువ మంది సహాయం చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందని తెలిపారు. చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ కఠారి హేమలత మాట్లాడుతూ వరదబాధితుల సహాయార్థం నావంతుగా లక్ష రూపాయలను విరాళంగా ఇస్తున్నానని, అలాగే కార్పొరేటర్లు ఒక నెల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో గంగాధర్ గౌడ్, జేసీ 2 చంద్రవౌళి, అమరావతి జేఏసీ చైర్మన్ విజయసింహారెడ్డి ఆర్‌డివో కోదండరామిరెడ్డి ఇతర అధికార అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా మేము సైతం...
ప్రకృతి విలయ తాండవం కారణంగా తీవ్రంగా నష్ట పోయిన కేరళ వాసులకు అండగా నిలవడానికి జిల్లా ప్రజానీకం మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం చేయడనికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అనేక మంది తమకు తోచినంత విరాళంగా ఇవ్వగా, మరి కొందరు విరాళాల సేకరణలో పాల్గొన్నారు. అనేక చోట్ల విద్యార్థులు , ఎన్‌సీసీ , ఎన్‌ఎస్‌ఎస్ వాలీంటర్లు, రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పలు సంస్థల ఆధ్వర్యంలో విరాళ సేకరణలో భాగస్వామ్యం అయ్యారు. పలు చోట్ల ఇంటింటా తిరిగి విరాళాలు సేకరణ చేపట్టారు.
భారీగా విరాళాలు
కేరళ వరద బాధితుల సహార్థం సోమవారం పలువురు ప్రముఖులు తమ వంతు సాయాన్ని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు అందజేసారు. చిత్తూరు నగర మేయర్ కఠారి హేమలత లక్ష రూపాయలను , చిత్తూరు భాస్కర్ హోట్‌ల్ అధినేత రెండు లక్షలు , చౌడే పల్లి విజవాణి ప్రింటర్స్ ఐదు లక్షలు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారధి రూ 50వేలు, వయోజన విద్య సూపర్‌వైజర్ నాగేశ్వర్ రెడ్డి రూ 25వేలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ రమేష్ బాబు రూ 50వేలు, జైళ్ల శాఖ సిబ్బంది రూ 12వేలు ఇచ్చి తమ ఉదాతరను చాటుకొన్నారు.