చిత్తూరు

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత నెహ్రూ కుటుంబానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 20: భారతదేశం కోసం ప్రాణత్యాగాలను చేసిన ఘనత నెహ్రూ కుటుంబానిదేనని కేంద్రమాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు. సోమవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడులకను పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న రాజీవ్ విగ్రహానికి చింతా మోహన్‌తోపాటుగా ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ, నగర అధ్యక్షుడు పొలకల మల్లికార్జున, నవీన్‌కుమార్ రెడ్డి, తిరుపతి నియోజక వర్గ ఇన్చార్జ్ రుద్రరాజు శ్రీదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. ఆయన పాలనలోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక సంస్కరణలు అమలు చేసి ప్రపంచంలోనే భారతదేశానికి గుర్తింపు తీసుకు వచ్చారన్నారు. ఇంటింటికి టెలిఫోన్, టెలివిజన్, ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చింది రాజీవ్ అని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టానికి రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి నేరుగా సర్పంచులకు అధికారులు కట్టబెట్టి, వారికి చెక్‌పవర్ ఇచ్చారన్నారు. దీని ద్వారానే గ్రామాల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఉన్నత విద్యను బడుగు, బలహీన వర్గాలకు అందేలా కృషి చేసి, విద్యా ప్రమాణాల్లో మార్పులు తెచ్చిన మహానుభావుడు రాజీవ్ అని, ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగానే నేడు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యావంతులుగా సమాజంలో రాణిస్తున్నారన్నారు. దేశంలో అవినీతి నిరోధానికి చట్టాలు చేసి, ఎస్సీ, ఎస్టీలపై దాడులను నియంత్రించడానికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలన్నీ తీసుకువచ్చింది రాజీవ్ గాంధీయేనని తెలిపారు. నేడు బీజేపీ ప్రభుత్వం దీనిని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోందని, 2019లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ మాట్లాడుతూ నేటి ఆధునిక భారతదేశానికి పునాదులు వేసిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీకే చెల్లుతుందన్నారు. ఆయన బాటలో నేటి ప్రభుత్వాలు పయనిస్తూ ఆ ఘనత తమదేనని చెప్పుకుంటున్నాయన్నారు. భారతదేశం మరింతగా ముందుకు వెళ్లాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. నగర కార్యదర్శి పొలకల మల్లికార్జున మాట్లాడుతూ నేటి యువతరానికి రాజీవ్ ఆదర్శమన్నారు. ఈ దేశానికి మనం ఏం చేశామన్న దిశగా ఆలోచించాలని, దేశ ప్రగతికి పాటుపడాలని కోరారు. నవీన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ఉన్నంత వరకు రాజీవ్ గాంధీ పేరు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.ఎం.సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి, కుమార్, పూతలపట్టు ప్రభాకర్, గోపాల్ యాదవ్, యార్లపల్లి గోపి, మోహన్ రెడ్డి, శాంతి యాదవ్, సావిత్రి యాదవ్, తేజోవతి, సింధూజ, మునిశోభ, లీలా శ్రీనివాస్, మునిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.