క్రైమ్/లీగల్

మృత్యువులోనూ.. వీడని రక్త బంధం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపంజాణి: ఓ అమ్మకడుపున పుట్టిన అన్నదమ్ముల పేగుబంధం వీడక కలిసి మృత్యువాత పడ్డారు.ట్రాక్టర్ కూలీకోసం వెళ్ళి, ఇసుకదిబ్బలు విరిగిపడి మీద పడడంతో మృతి చెందారు. మృత్యువులోనూ వీరి రక్తబంధం వీడలేదు. ఈ విషాద సంఘటన పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ముదరంపల్లె పంచాయతీకి చెందిన బాలిరెడ్డి, రామక్కలకు ఆరుగురు సంతానం. వీరిలో ఐదవ సంతానం క్రిష్టారెడ్డి(30), ఆరవ సంతానం ఓబుల్‌రెడ్డి(27) అన్నదమ్ములు ఆరుగురు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గత కొన్నిరోజులుగా నిడిగుంటకు చెందిన విశ్వనాధరెడ్డి ట్రాక్టర్‌లో క్రిష్ణారెడ్డి, ఓబుల్‌రెడ్డిలతో పాటు అదేగ్రామానికి చెందిన లక్ష్మీనారాయణశెట్టి(27) కూలీలుగా వెళ్తున్నారు. ముదరంపల్లె, నిడిగుంట గ్రామాల నడుమ వెలసిన కౌండిన్యనది కాల్వలో ఇసుకను తవ్వి ట్రాక్టర్‌కు లోడు చేసే పనిలో భాగంగా గురువారం సాయంత్రం కౌండిన్యనదిలో ఇద్దరు ఇసుక తవ్వుతుండగా పైభాగంలో ఉన్న మట్టిపెళ్ళలు విరిగిపడ్డాయి. అందులో ఉన్న అన్నదమ్ములిద్దరు ఇరుక్కుపోయారు. సగభాగంలో ఇరుక్కుపోయిన లక్ష్మీనారాయణశెట్టి కేకలు వేయడంతో పరిసర ప్రాంతాలలో కూలీలు హుటాహుటిన లక్ష్మీనారాయణశెట్టిని బయటకు తీసి పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్రిష్ణారెడ్డి, ఓబుల్‌రెడ్డి ఇరుక్కుపోయిన మట్టిపెళ్ళలను వేరుచేసే సమయంలోనే అప్పటికే మృతిచెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడటంతో ముదరంపల్లెలో విషాదం నెలకొంది. అయితే లక్ష్మీనారాయణశెట్టి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. పెద్దపంజాణి ఎస్‌ఐ చంద్రమోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీపనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్న అన్నదమ్ములు మట్టిదిబ్బలు విరిగిపడి మృతిచెందడంతో ముదరంపల్లెలో విషాదచాయలు అలుముకున్నాయి.