చిత్తూరు

నేడు రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా జరగనుంది. తెల్లవారు జామున 3 నుంచి 3.50 గంటల వరకు కర్కాటక లగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.30 గంటల నుంచి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

శ్రీవారి రథోత్సం ఏర్పాట్లపై జేఈఓ సమీక్ష
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7.30 గంటలకు రథోత్సవం జరుగుతున్న నేపథ్యంలో విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, రద్దీకి తగ్గట్లుగా పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టాలని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. రథోత్సవం ఏర్పాట్లుపై రాంభగీచా విశ్రాంతి అతిథిగృహం ఎదురుగా ఉన్న బ్రహ్మోత్సవాల సెల్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఇంజినీరింగ్, భద్రత, పోలీసు విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రథం బ్రేకులను ముందస్తుగా పరిశీలించి సక్రమంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రథం తిరిగే క్రమంలో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పల్లంగా ఉన్న ప్రాంతంలో రథం వేగంగా వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. రథం లాగేందుకు వినియోగించే తాడు పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. రథోత్సవంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్‌ల ద్వారా అనౌన్స్ చేయాలని సూచించారు. మాడ వీధుల్లో రథం కోసం వేసిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. నాలుగు మాడ వీధులతోపాటు వైభవోత్సవ మండపం వద్ద అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.

నేటి నుండి శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 19: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం నుండి ఈనెల 24వతేదీ వరకు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీరామరామస్వామి వెల్లడించారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అందులో భాగంగా ఆలయాన్ని శుద్ది చేయడం, దేవతలు, పరివార దేవతల విగ్రహాలకు పూజలు నిర్వహించి యాగశాలలో ప్రత్యేక పూజలు గురువారం నుండి నిర్వహిస్తామని తెలిపారు. ఆలయంలో తెలిసీ, తెలియకుండా జరిగిన పొరపాట్లను అధిగమించేందుకు ప్రతియేటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

శాస్త్రోక్తంగా శ్రీగోవిందరాజస్వామి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 నుండి 6.30గంటల వరకు సేనాధిపతి తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు యాగశాలలో మృత్సంగ్రహణం, పుణ్యాహవచనం, విశేషపూజ, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ, తెలిసీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వలన ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. సెప్టెంబర్ 20వతేదీ గురువారం పవిత్ర ప్రతిష్ఠ, 21న పవిత్ర సమర్పణ, 22న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ ఉదయ్ భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసదీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.