చిత్తూరు

సమష్టికృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 21: టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లాయంత్రాంగం సమష్టి కృషితో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. భక్తులు ప్రశాంతంగా శ్రీవారి మూలమూర్తితోపాటు వాహన సేవలు దర్శించేలా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. బ్రహ్మోత్సవాల చివరిరోజైన శుక్రవారం చక్రస్నానం అనంతరం తిరమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు సంయమనంతో వ్యవహరించి క్యూలైన్లు, గ్యాలరీల్లో వేచి ఉన్నారని, భక్త్భివంతో టీటీడీకి సహకరించారంటూ ధన్యవాదాలు తెలిపారు. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారని అభినందించారు. తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కృషితో 7 రాష్ట్రాల నుంచి కళాబృందాలు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనువిందు చేశాయని, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 8 రాష్ట్రాల నుండి కళాబృందాలను ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. భద్రతాపరంగా ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారని తెలిపారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో వ్యవహరించారంటూ ఎస్పీ అభిషేక్ మహంతిని అభినందించారు. తిరుమలలో రూ. 26 కోట్లతో చేపట్టిన అదనపు మరుగుదొడ్ల నిర్మాణాన్ని రికార్డు వ్యవధిలో పూర్తి చేసి బ్రహ్మోత్సవాలకు అందుబాటులోకి తెచ్చిన ఎస్‌ఈ రామచంద్రా రెడ్డిని, ఇంజినీరింగ్ అధికారులను ఆయన అభినందించారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు, గరుడ సేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు చక్కటి వైద్య సేవలు అందించామని, విద్యుత్ కటౌట్లు, పుష్పాలంకరణలు, ప్రదర్శనశాలలు ఆకట్టుకున్నాయని తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించిన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, రెగ్యులర్, కాంట్రాక్ట్ సిబ్బందికి, డిప్యుటేషన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆలయ అర్చకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి చక్కగా స్వామివారి కైంకర్యాలు నిర్వహించారన్నారు. ఎస్వీబీసీ నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించినట్లు ఈఓ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రాలేని భక్తులు ఎస్వీబీసీ ద్వారా స్వామివారి వైభవాన్ని తిలకించి తరించారని వివరించారు. టీటీడీ విభాగాలతోపాటు జిల్లా యంత్రాంగం, పోలీసు, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక విభాగాలు, విద్యుత్, ఆర్టీసీ, ఆర్‌టిఓ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించారని తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలక దసరా సెలవులు రావడంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, ఇప్పటి నుంచి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపడతామన్నారు. ఈ సమావేశంలో జేఈఓ శ్రీనివాసరాజు, ఇన్చార్జ్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఈ రామచంద్రా రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.