చిత్తూరు

గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా పవిత్ర సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 21: శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తరువాత మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీమఠం ఆంజనేయ స్వామివారికి పవిత్రాలు సమర్పించారు. అనంతరం సాయంత్రం శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. శనివారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈకార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు ఏపీ శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నేడు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సెప్టెంబర్ 21: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈనెల 23, నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. శనివారం సాయంత్రం విష్వక్సేనారాధన, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, పవిత్ర ఆధివశం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈనెల 23న పవిత్ర ప్రతిష్ఠ, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ. 750 చెల్లించిన గృహస్తులు ఒక్కరు మూడు రోజులపాటు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. వారికి రెండు లడ్డూలు, వడలు బహుమానంగా అందజేస్తారు.

మంచు లక్ష్మమ్మకు కన్నీటి వీడ్కోలు
చంద్రగిరి, సెప్టెంబర్ 21: ప్రముఖ సినీనటుడు, నిర్మాత, విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబు తల్లి మంచు లక్ష్మమ్మ (85) అంతిమయాత్ర బంధువులు, కుటుంబసభ్యుల కన్నీటి పర్యంతం మద్య సాగింది. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. విదేశీ పర్యటనలో ఉన్న ఆమె కుమారుడు మోహన్‌బాబు, మనవళ్లు మంచు విష్ణు, మనోజ్, ప్రసన్నలు లక్ష్మమ్మ మరణవార్త తెలుసుకుని ప్రత్యేక విమానంలో గురువారం అర్ధరాత్రి తిరుపతికి చేరుకుని, అక్కడ నుండి ఏ.రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్‌కు చేరుకున్నారు. మంచు లక్ష్మమ్మ మృతదేహాన్ని పలువురు సినీ, రాజకీయ నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, ప్రముఖ నిర్మాత ఎన్‌వీ ప్రసాద్, భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్, భూమన అభినయ్‌రెడ్డి, ఎంవీఎస్ మణి, ఇందుశేఖర్‌లతో పాటు పలువురు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బంధువులు, కుటుంబసభ్యుల కన్నీటి పర్యంతం మధ్య ఏ.రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్ సమీపంలోని పొలాల్లో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.