చిత్తూరు

బీజేపీలో దళితులకు స్థానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 23: భారతీయ జనతాపార్టీలో దళితులకు సరైన న్యాయం జరగడం లేదని, దళితుల పట్ల అణచివేత ధోరణి ఎక్కువగా ఉందని, అందువల్లే తాను బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నాయకులు కారుమంచి జయరామ్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం వద్ద ఉన్న నారద పుష్కరిణి సమీపంలోని అభయగణపతి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాను పార్టీ మారే ముందు అన్నికోణాల్లో ఆలోచించానని, వైసీపీలో చేరాలని ఉన్నప్పటికీ జగన్ వస్తే రాష్ట్రంలో రౌడీల రాజ్యం వస్తుందని, అందుకే ఆ పార్టీలో చేరలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసే నాయకుడుగా ముద్రపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధిని కాంక్షించి బీజేపీతో జతకట్టారన్నారు. ఎన్నికల ముందు తిరుమల శ్రీవారి పాదాల చెంత ప్రత్యేకహోదా ఇస్తానని, విభజన హామీలు అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. బీజేపీ అధికారంలోనికి వచ్చి నాలుగేళ్లు గడిచినా విభజన హామీలను అమలు చేయడంలో, ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఆ పార్టీ మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీని తలదనే్న రీతిలో రాష్ట్ర రాజధాని అమరాతిని అభివృద్ధి చేస్తామన్న మోదీ చెంబునీళ్లు, చారెడు మట్టితో సరిపెట్టుకున్నారన్నారు. ఇది ఆంధ్రులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉండగా ఏ మాత్రం ఆర్థికంగా సాయం అందించలేదని, అందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు 7వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని, 2019లోపు పోలవరం పూర్తి చేస్తారన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆమెకు రాష్ట్భ్రావృద్ధి పట్ల అవగాహన లేదని, కేవలం అధికార వాంఛతో పాటు చెంచలమైన మనస్తత్వం ఉందన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ కుమార్తెగా ఆమె తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతబట్టాల్సి ఉండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఎన్‌టీఆర్ ఆశయాలకు గండికొండుతున్నారని ఆరోపించారు. తాను గత ఎన్నికల్లో బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యానన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయనన్నారు. ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటించానని, ఆయా నియోజకవర్గాల్లో తనకు అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లాలోని రెండు రిజర్వుడు పార్లమెంట్ స్థానాల్లో రెండు తెగలుగా ఉన్న తమకు ఒక తెగకు చిత్తూరు, మరో తెగకు తిరుపతిలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు శ్రీకాళహస్తిలోని టీడీపీ నాయకులు చంద్రశేఖర్, బాబు, రాజ తదితరులు పాల్గొన్నారు.

పవన్‌కు ఘనస్వాగతం
రేణిగుంట, సెప్టెంబర్ 23: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం హైదరాబాదు నుండి స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. అయితే పవన్‌కళ్యాణ్ రాకతో విమానాశ్రయంలో పనిచేస్తున్న సిబ్బంది పవన్‌తో ఫొటోలో దిగేందుకు పోటీ పడ్డారు. పవన్‌కళ్యాణ్ రాకను తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని పవన్ జిందాబాద్, జనసేన జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందుగా విమానాశ్రయంలో జనసేన రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్, మురళీరాయల్, రాజారెడ్డి, తిరుపతికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్‌కళ్యాణ్‌కు శ్రీవారి ప్రసాదాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పవన్ రోడ్డుమార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు.