చిత్తూరు

జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, సెప్టెంబర్ 23: జిల్లాలో పడమట, తూర్పు ప్రాంతాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా టైఫాయిడ్, మలేరియా, వైరల్‌ఫీవర్ వంటి జ్వరాలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రధానంగా అపరిశుభ్రత తాగునీటి కారణంగా జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు చెబుతున్నారు. పీలేరు, తంబళ్ళపల్లె, పుంగనూరు, పలమనేరు, చంద్రగిరి, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎక్కువగా జ్వరాలు వ్యాపించాయి. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, బి.కొత్తకోట, తంబళ్ళపల్లె ప్రాంతాల ప్రభుత్వాసుపత్రులలో ఎక్కువగా జ్వరపీడితుల సంఖ్య నమోదు అవుతోంది. సగటున రోజుకు 350నుంచి 500వరకు రోగులు ప్రభుత్వాసుపత్రికి వస్తుండగా వాతావరణ మార్పులతో ప్రబలిన జ్వరాలతో రోజుకు 500 నుంచి 900మంది వరకు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీటిలో ఎక్కువగా జ్వరపీడితులే వస్తున్నట్లు ప్రభుత్వాసుపత్రుల గణాంకాలు చెబుతున్నాయి. సోమ, మంగళ, బుధ, శనివారం రోగుల సంఖ్య పెరుగుతుండగా ప్రతిరోజు రోగుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఆసుపత్రిలో 8గంటలకే ఓపి ప్రారంభం అవుతుండటంతో జ్వరపీడితులు ఉదయం 6గంటల నుంచే క్యూలు కడుతున్నారు. జ్వరంలో విషమ పరిస్థితి ఉన్నవారికి సాధారణ చికిత్సల అనంతరం రెఫర్ చేసేస్తున్నారు. ఇదిలావుండగా పడమటి ప్రాంతాల చిన్నపిల్లలకు జ్వరాలతో పాటు అమ్మతల్లి ప్రబలుతోంది. పల్లెజనం భయాందోళనకు గురవుతున్నారు. సాధారణంగా వేసవికాలంలో సోకుతుంది. అమ్మతల్లి సోకుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. పగలు అధిక ఉష్ణొగ్రత, సాయంత్రం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటోంది. ఈ అమ్మతల్లి ప్రభావం తూర్పుప్రాంతాలలో ఎక్కువగా చూపుతోంది.
జిల్లావ్యాప్తంగా ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో 19 ఆసుపత్రులు, జిల్లా వైద్యశాఖ పరిధిలో 102ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నడుస్తున్నాయి. ఏపి వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 19 ఆసుపత్రులలో గత జూలై మాసం నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 3వేలకు పైగా, సెప్టెంబర్ మాసంలో ఇప్పటివరకు 1350మంది ఆసుపత్రులో చేరి చికిత్సలు పొందుతున్నారు. మదనపల్లె, తంబళ్ళపల్లె, కురబలకోట, పిటిఎం, నిమ్మనపల్లె, రామసముద్రం ప్రాంతాలలో డెంగీ, విషజ్వరాల కేసులు నమోదైయ్యాయి. వైరల్‌ఫీవర్‌తో ఎక్కువమంది బాధపడుతుండగా, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో బాధపడేవారి సంఖ్య స్వల్పంగా ఉంది. మదనపల్లె, కలికిరి, పుత్తూరు, వి.కోట, చిత్తూరు, కుప్పం, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, తంబళ్ళపల్లె ఏరియా ఆసుపత్రులలో జ్వరపీడితుల సంఖ్య అత్యధికంగా నమోదు అవుతోంది. జ్వరపీడితులు చికిత్సలు చేయించుకున్నట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని 102 పిహెచ్‌సిలలో రోజువారి 10వేలకు పైగా రోగులు చికిత్సల కోసం వస్తుండగా, వారిలో 2వేల నుంచి 3వేల వరకు జ్వరపీడితులే అధికంగా ఉన్నారు. గత నెలన్నర రోజులుగా పిహెచ్‌సిలలో అత్యధికంగా జ్వరపీడితుల సంఖ్య నమోదయ్యాయి. ఇప్పటివరకు 20కు పైగా డెంగీ పాజిటీవ్‌కేసులుగా నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని 102 పిహెచ్‌సిలలో 40 శాతం పిహెచ్‌సిలలో ఎక్కువగా మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ప్రబలుతున్న జ్వరాలు
జిల్లాలోని పడమటి ప్రాంతాలు తంబళ్ళపల్లె, పెద్దమండ్యం, ములకలచెరువు, బి.కొత్తకోట, పిటిఎం, కురబలకోట, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె, వాల్మీకిపురం, సోమల, సదుం, కెవిపల్లె, కలకడ, గుర్రంకొండ మండలాలలో ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న బాల బాలికల సంక్షేమ వసతిగృహాలలో జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. ఏ వసతిగృహంలో చూపినా జ్వరాలతో బాధపడేవారు అధికంగా కనపడుతున్నారు. వీరికి సరైన వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యాసంస్థ నిర్వాహకులు వీటిగురించి పట్టించుకోకపోవడంతో చాలామంది విద్యార్థులు జ్వరాలతో తరగతులకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతినెలా వసతిగృహాలలో వైద్యశిబిరాలు నిర్వహించాల్సిన ఆయా పరిధిలోని పిహెచ్‌సి వైద్యులు పట్టించుకోక పోవడం, వార్డెన్‌లు సమాచారం ఇవ్వకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ
పడమటి మండలాలలో వాతావరణ మార్పులు ఏర్పడిన కారణంగా ప్రబలుతున్న విషజ్వరాల చికిత్సలకై ప్రభుత్వాసుపత్రులలో సకాలం వైద్యం అందనివారు, వైద్యం చేసిన మందులు అందనివారు సైతం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు వివిధరకాల రక్తపరీక్షల పేరుతో వేలాధి రూపాయాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్యశాలలు, పిహెచ్‌సిలలో రక్తపరీక్షలు చేయకుండా ప్రైవేట్ రక్తపరీక్ష కేంద్రాలకు రెఫర్ చేస్తూ పరోక్ష దోపిడినీ విధిలేని పరిస్థితులలో రోగులు భరించాల్సి వస్తోంది.

చిన్నికృష్ణ నాయక్‌ను సన్మానించిన గిరిజన సంక్షేమ సేవా సమితి
తిరుపతి, సెప్టెంబర్ 23: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన రామవత్ చిన్నిక్రిష్ణ నాయక్‌ను ఆదివారం గిరిజన సంక్షేమ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుక్కేహరిక్రిష్ణా నాయక్ ఆధ్వర్యంలో సన్మానించారు. ముందుగా ఎస్వీయూ ఎదుటవున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం చిన్నికృష్ణా నాయక్‌కు శాలువాకప్పి అభినందించారు. ఈసందర్భంగా హరిక్రిష్ణా నాయక్ మాట్లాడుతూ చిన్ని కృష్ణా నాయక్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సౌందర్ నాయక్, బి.వినోద్ నాయక్, ఆంజనేయులు నాయక్, సురేష్, మనోహర్, ఈశ్వర్, హరి, సునీల్, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.