చిత్తూరు

రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: తిరుమలలో మంగళవారం పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీవారి 3వ నాలాయిర్ దివ్యప్రబంధ మహోత్సవం
శ్రీవారి భక్తితత్వాన్ని వ్యాప్తి చేసిన ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను విస్తృతంగాప్రచారం చేసేందుకు ఈనెల 25న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా నాలాయిర్ దివ్యప్రబంధ మహోత్సవాన్ని మూడోసారి టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఇప్పటి వరకు వేద మహోత్సవం, భజనమేళా వంటి కార్యక్రమాలను భారీ ఎత్తున టీటీడీ నిర్వహించింది. దివ్యప్రబంధ మహోత్సవంలో భాగంగా ద్రావిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 230 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల నుంచి పారాయణదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర్ దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం నిర్వహిస్తారు. టీటీడీ పెద్దజీయర్, చిన్న జీయర్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు నాదనీరాజనం వేదికపై దివ్యప్రబంధ గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. రాత్రి 7 నుంచి 9గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో జరుగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు. టీటీడీ నాలాయిర్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ వి.జి.చొక్కలింగం ఆధ్వర్యంలో ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విలువైన సమయాన్ని వృథా చేయొద్దు
* వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలి
* మంత్రి అమరనాథరెడ్డి సూచన
పలమనేరు, సెప్టెంబర్ 23: రానున్న ఎన్నికలకు ప్రస్తుత సమయం ఎంతో విలువైనదని ఏ మాత్రం సమయాన్ని వృథా చేయొద్దని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి నాయకులకు సూచించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈసందర్భంగా కార్యక్రమం ప్రారంభంలో నందమూరి హరికృష్ణ మృతికి నాయకులతో కలసి సంతాపాన్ని తెలిపారు. నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు నాయకులు ఇప్పటి నుంచే కార్యకర్తలను సన్నద్ధం చేయాలన్నారు. టీడీపీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబును సీఎం చేసుకునేందుకు పాటుపడాలన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని క్షేత్ర స్థాయిలోలోకి ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఈసందర్భంగా అజెండాలోని అంశాలపై చర్చించారు. చివరిగా మావోయిస్టుల కాల్పులో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సవేరి సోమల మృతికి సంతాపం తెలిపారు. నాయకులు ఆర్వీ బాలాజీతోపాటు మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నంది వాహనంపై ఊరేగిన లంబోదరుడు
ఐరాల, సెప్టెంబర్ 23: ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వినాయకుడు అధికార నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి ఉభయదారులుగా వళ్లువర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి వారికి ఉభయదారులు ఉభయ వరుస తీసుకురాగా ఆలయ అనే్వటి మండపంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని అధికార నందివాహనంపై ఆశీనులు చేశారు. విద్యుత్ దీపాలతోను, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అధికార నందివాహనంపై గణనాధుడు కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య సిద్ది బుద్ధి సమేత వినాయకస్వామి వారు భక్తులకు కనువిందు చేసారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకుని తరించారు. కార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేష్, పాలక మండలి చైర్మన్ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
కాణిపాకంలో నేడు
కాణిపాకంలో సోమవారం రావణబ్రహ్మ వాహనంపై వినాయకుడు ఊరేగనున్నారు. కార్యక్రమానికి ఉభయదారులుగా పుణ్యసముద్రం, లక్ష్మిపురం, సంతపల్లి, ద్వాకరాపురం, కురవపల్లి, సిద్ధంపల్లి, ముద్దురామాపురం గ్రామస్తులు వ్యవహరిస్తారు.