చిత్తూరు

బీజేపీ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 12: బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నగర మేయర్ కఠారి హేమలత ఆరోపించారు. శుక్రవారం చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలోవారు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసినా లక్షల కోట్లు ఇచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల కోట్లు స్వాహా చేసారని కన్నా ఆరోపించడంలో అర్థం లేదన్నారు. గతంలో చంద్రబాబానాయడుపై అనేక ఆరోపణలు చేసినా ఎదీ నిరూపణ కాలేదన్న విజయాన్ని బీజేపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంగా వైకాపా ,జపసేన పార్టీలు కట్టుబడి లేవని అందుకే ఈ రెండు పార్టీలు కేంద్రం ప్రభుత్వంపై ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. నేడు టీడీపీ నేతలను బయపెట్టడానికి ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. అందులో భాగమే ఎంపి సీ ఎం రమేష్ ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన చక్కగా ఉందని ఎఫ్ ఎఫ్ సీ చైర్మన్ ఎం కే సింగ్ కితాబు నివ్వడంతో దీన్ని ఓవ్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. నేడు రాష్ట్రంలో సమర్థ వంతమైన పాలన కొనసాగుతుందని, ప్రజల్ని తప్పు దోవ పట్టించాలని చూసే నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పుతారన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ సుగ్రీ, దేశం నేతలు కఠారి ప్రవీణ్, కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

అగ్రవర్ణాల వారే దళితులను మట్టుబెట్టారు
* దోషులను అరెస్ట్ చేయకుంటే పోలీసులపైనా చర్యలు తప్పవు
* బాధిత కుటుంబ సభ్యులను అన్ని విధాల ఆదుకుంటాం
* జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు స్పష్టం
చిత్తూరు, అక్టోబర్ 12 : జిల్లా పరిధిలోని యాదమరి మండలం వేపనపల్లెకు చెందిన దళితులు జయచంద్ర, బాబులను గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారే హత్య చేశారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె రాములు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఎస్పీ సుబ్బారావు, సాంఘిక సంక్షేమశాఖ జేడీ విజయ్‌కుమార్, చిత్తూరు ఆర్‌డీ వో మల్లికార్జునతో కలిసి వేపనపల్లెను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హత్య జరిగినట్లు అనుమానిస్తున్న ప్రదేశాలను పరిశీలించడంతోపాటు, మృతుల కుటుంబ సభ్యుల నుంచి పలు వివరాలను సేకరించారు. రాములు సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 8వ తేదిన అర్థరాత్రి వేపనపల్లెకు చెందిన జయచంద్ర, బాబులను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోహన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే పని చేశారని తెలిపారు. సంభందిత అగ్రకులస్థులు మృతులకు చెందిన అర ఎకరా పొలాన్ని దౌర్జన్యంగా లాక్కోవడంతో పాటు, గ్రామ శివారులోని చెరువుకు చెందిన 15 ఎకరాల పొలాన్ని సైతం ఆక్రమించుకున్నారని మృతుల భార్యలు, తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. గతంలోతమ వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించిన వారే, భూకబ్జాలకు సంభందించి తమకు ఎదురు తిరగడాన్ని సహించలేకనే ఆరు బయట నిద్రిస్తున్న దళితులను హత్య చేసి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో మృత దేహాలను పడవేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, లేని పక్షంలో వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం లోగా దోషులను అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. హత్యకు గురైన వారి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఇందులో భాగంగా ఒక్కో మృతుని కుటుంబానికి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రు 8.50 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తామన్నారు. మృతుల భార్యలకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతో పాటు, వారికి పక్కా ఇళ్లను సైతం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు డీ ఎస్పీ సుబ్బారావు మాట్లాడుతూ హత్యకు సంబందించి ప్రాథమిక విచారణ చేపట్టామని, పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలోవిద్యుత్ షాక్‌తోనే దళితులు మృతి చెందినట్లు రావడంతో ఆ కోణంలో విచారణ చేపడుతున్నామన్నారు. త్వరలోనే దోషులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో అట్రాసిటీ కేసులు పెరిగిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గత కొనే్నళ్లుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరిగిపోతున్నాయని రాములు తెలిపారు. ఇందుకు ఉదాహరణగా గత నెలలో జరిగిన వినాయకచవితి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి అగ్రవర్ణాల వారి వలన కలిగిన అవమానంతోపాటు, ఇటీవల అమలాపురంలో రాష్ట్ర హోం మంత్రి మరదులు పెంపుడు కుక్క కారణంగా నెల్లి వరణ్ అనే 11 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ దళిత యువకుడు మరణించిన సంఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. వీటితో పాటు ఎస్సీ హాస్టళ్ల బాలికలు అత్యాచారాలకు గురికావడం, వసతి గృహాల్లో వసతుల లేమి తదితర చిన్నపాటి సమస్యలను పరిష్కరించే స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ దళిత ప్రజాప్రతినిధులకు, అమాయక దళితులకు న్యాయం చేయకుండా నేడు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుండటం దారుణమన్నారు. ఈ విషయాన్ని తాను జాతీయ కమిషన్ దృష్టికి తీసుకుపోతానని స్పష్టం చేశారు. దళిత సంఘాలు సైతం తమ పంథాను మార్చుకుని ప్రజాప్రతినిధులకు వత్తాసు పలుకుతుండటం కారణంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరుగారి పోతున్నాయని వివరించారు. దళితులు సైతం రాజ్యాంగం, చట్టాలను అవగాహన చేసుకుని ఐక్యంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు రూరల్ వెస్ట్ సీఐ ఆదినారాయణ, ఆర్‌డిఓ మల్లికార్జున, ఎపీ ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి, ఏపి అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు రాజ్‌కుమార్ బీజేపీ నాయకులు రామభద్ర, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.