చిత్తూరు

అమరరాజా కొత్త యూనిట్‌కు మంత్రి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 15: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమర్‌నాథ్‌రెడ్డిఅన్నారు. సోమవారం ఉదయం స్థానిక వరిగపల్లెలోని అమరరాజా గ్రోత్ కారిడార్‌లో అమరరాజా మూడవ ఆటోమోటివ్ బ్యాటరీ ప్లాంట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ మొదటి దశలో రూ. 700 కోట్లను వెచ్చించి సరికొత్త ఆటోమోటివ్ యూనిట్‌ను ప్రారంభించడం హర్షణీయమన్నారు. దేశంలో పరిశ్రమల విభాగంలో ఆంధ్ర రాష్ట్రం సరాసరిన 22 శాతం వృద్ధిరేటు ఉండటం గొప్ప విషయంగా అభివర్ణించారు. దేశ ఆర్థిక వృద్ధి 4.6 శాతం కాగా, రాష్ట్ర ఆర్థిక వృద్ధి 8.46 శాతానికి చేరుకోవడం శుభపరిణామం అన్నారు. దేశంలో ఐదు కోస్టల్ కారిడార్లు ఉండగా, వాటిల్లో రెండు ఆంధ్రలోనే ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో 40 దేశాలకు చెందిన 4000 కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చి 30 లక్షల మంది వరకు ఉపాధి కల్పించామన్నారు. అనంతరం మంత్రిని అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, ఆయన సతీమణి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎంపీ డాక్టర్ శివప్రసాద్, ఎమ్మేల్సీ రాజసింహులు, చిత్తూరు ఎమ్మేల్యే డిఎ సత్యప్రభ, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తినాని, ఉపాధ్యక్షులు చంద్రప్రకాష్, కార్పొరేటర్ వసంత్‌కుమార్, అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ సీఈవో ఎస్ విజయానంద్, అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.