చిత్తూరు

ఏపీకి పెట్టుబడులు రానీయకుండా అడ్డుకోవడానికే కేంద్రం ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 16: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న అంతర్జాతీయ పరిశ్రమలు, పెట్టుబడులను రానీయకుండా అడ్డుకునేందుకు, పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే కేంద్రం ఏపీలో ఐటీ దాడులు చేయిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలోనే అత్యంత నీతివంతమైన పాలన అందిస్తూ, అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీకి మూడోస్థానం వచ్చిన విషయాన్ని బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు గుర్తించాలన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల రాష్ట్రాలపై ఎందుకు ఐటీ దాడులు జరగడంలేదని ఆమె ప్రశ్నించారు. బాబు పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించి ప్రపంచ దేశాలు నేడు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు. వారిని ఏపీకి రానీయకుండా గుజరాత్‌కు తరలించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, వారి ఆరోపణలకు ఒక్క ఆధారం ఉన్నా చూపాలని సవాల్ విసిరారు. అమిత్‌షా తనయుడి అకౌంట్లలోకి వందల కోట్లు ఎలా వచ్చాయో, రాఫెల్ కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీపై చేస్తున్న కక్షసాధింపు దాడులను ఆపి అభివృద్ధికి సహకరించాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్, పవన్‌లు బీజేపీకి పావులుగా మారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. తిత్లీ తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను కనీసం కనె్నతి చూడకుండా, ప్రజల గురించి పట్టించుకోని వైకాపా, జనసేన పార్టీలకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఆపార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ, డాక్టర్ సంజయ్, రాష్ట్ర గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ సూరా సుధాకర్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్, టీడీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వై.ప్రవీణ్, సీనియర్ నాయకురాలు, ఆషారాయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆశాలత, నాయకులు కృష్ణ యాదవ్, మనె్నం శ్రీనివాసులు, దేవ తదితరులు పాల్గొన్నారు.

ఎస్వీయూకి క్యూఎస్ సర్వేలో 38వ ర్యాంకు
తిరుపతి, అక్టోబర్ 16: యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన క్యూ ఎస్ సంస్థ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర విశ్వవిద్యాలయాల విద్యాప్రమాణాలు, పాలనాపరమైన విధానాలు తదితర అంశాలపై నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఎస్వీయూనివర్శిటీ నెంబర్ వన్ స్థానాన్ని, దేశంలో 38వ ర్యాంకును దక్కించుకుందని, ఇది ఎంతో సంతోషకరమని ఎస్వీయూ వీసీ ఆచార్య దామోదరం మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. క్యూ ఎస్ సంస్థ విశ్వవిద్యాలయాల పనితీరును బేరీజు వేసి ర్యాంకులు కేటాయించింది. ఇందులో విద్యా విషయకపరంగా విశ్వవిద్యాలయ కీర్తి, ఎంప్లాయర్ రెప్యుటేషన్, అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, అంతర్జాతీయ విద్యార్థులు, పీహెచ్‌డీ కలిగిన అధ్యాపకులు, పరిశోధన పత్రాల ప్రచురణల ఆధారంగా ఈ ఎంపిక జరిగిందని తెలియజేశారు.

చంద్రబాబు అవినీతి పాలన సాగిస్తున్నారు
* మాట జారిన తిరుపతి ఎమ్మెల్యే
తిరుపతి, అక్టోబర్ 16: చంద్రబాబు అవినీతి పాలన సాగిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ తన ప్రసంగంలో ప్రస్తావించడంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా విస్తుపోయిన సంఘటన మంగళవారం తిరుపతి టీడీపీ కార్యాలయంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలో టీడీపీ నేతలపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులు చేయిస్తోందని, వీటిని ఖండించేందుకు మంగళవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే అవినీతి రహిత రాష్ట్రాల్లో మూడవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పడానికి బదులు, రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని, బాబు అవినీతి పాలన అందిస్తున్నారని వ్యాఖ్యానింది. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు విస్తుపోయారు. దేశంలో అవినీతి పాలన అందించే రాష్ట్రంలో ఏపీ మూడోస్థానంలో ఉందన్న సర్వే రిపోర్టును చదువుతూ పొరబాటుగా పై విధంగా వ్యాఖ్యానించారు. అటు తరువాత కూడా ఆమె ఆ తప్పును సరిదిద్దుకోకుండా బీజేపీపై విమర్శలు చేస్తూ వచ్చారు.