క్రైమ్/లీగల్

అనుమానాస్పదంగా ఓ కుటుంబం అగ్నికి ఆహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, నవంబర్ 11: అనుమానాస్పదంగా ఓ కుటుంబం అగ్నికి ఆహుతి అయిన సంఘటన ఏర్పేడు మండలం, మడిబాక పంచాయతీ పరిధిలోని రాజులకండ్రిగ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి (38) జిల్లాలోని పుంగనూరు ప్రాంతానికి చెందిన వాడు. ఇతను తాపీ మేస్ర్తిగా పనులు చేసుకుంటుండగా కడపజిల్లా, ఓబులాయపల్లి మండలం, చిన్నంపల్లి గ్రామానికి చెందిన బలరామరాజు కుమార్తె బుజ్జమ్మను ప్రేమించి పది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు ఏర్పేడు మండలం పాపానాయుడుపేట గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ జీవనం సాగించే వారు. వారికి కుమార్తె భవ్య (7) కుమారుడు నితిన్ (4) ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా చూడముచ్చటగా జీవించేవారని చుట్టు పక్కల వారు చెబుతున్నారు. ఇటీవల శ్రీనివాసులు రెడ్డి తాపీ మేస్ర్తి పనులకు వెళ్లకుండా ఆటో తీసుకొని నడిపేవాడని, అతను రాత్రి సమయాల్లోనే ఆటో నడిపి మడిబాక పంచాయతీ, రాజులకండ్రిగ గ్రామంలో స్థలం కొని రూ. 20లక్షలు వెచ్చించి నూతనంగా అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకున్నాడని తెలిపారు. గత ఆగస్టులో నూతన గృహ ప్రవేశం చేశారని, అయితే భార్యా భర్తలు ఇరువురు ఎవరితోనో సరిగా మాట్లాడే వారు కాదని, వారి పని వారు చేసుకొని వెళ్లే వారని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శ్రీనివాసులురెడ్డి ఇంటికి పైభాగంలో వేరే వ్యక్తులు నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశం చేస్తూ మేలుకొని ఉన్నారు. మృతుని ఇంటి నుంచి పెద్దగా మంటలు పొగలు వెలుపలికి వస్తుండటంతో కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు గుమికూడి అగ్నిమాపక సిబ్బందికి, ఏర్పేడు పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఇంటి తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లన్నీ ఎక్కడా పేలిన దాఖలాలు లేవు. నిద్రిస్తున్న వారు నిద్రించినట్లే ఉన్నారు. ఒక సమయం ఇంటిలో ఏదైనా గొడవల కారణంగా ఆవేశంలో మంటలు పెట్టుకున్నా మృతి చెందే సమయంలో కేకలు పెట్టే వారు. అలాంటి వేమీ లేవు. తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా గిట్టని వారు చేసిన పనా? లేక మరి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.