చిత్తూరు

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెదురుకుప్పం, నవంబర్ 20: మండలాల్లో ఉన్న గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు కన్నయ్యనాయుడు పిలుపునిచ్చారు. కార్వేటినగరంలో ఉన్న గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయవారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కన్నయ్యనాయుడు మాట్లాడుతూ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం అలవరచుకోవాలన్నారు. దీనిని చదవడం వలన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ సభ్యులు సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం తదితర ప్రముఖులు పుస్తకాలు కొనలేని పరిస్థితిలో లైబ్రరీలకు వచ్చి చదివి పెద్ద పదవులు చేపట్టారన్నారు. గ్రంథాలయంలో సభ్యత్వానికి చిన్న పిల్లలకు రూ.50, పెద్దలకు రూ.100 సభ్యత్వం తీసుకోవాలన్నారు. అనంతరం వారం రోజులపాటు నిర్వహించిన వివిధ సాంస్కృతిక, వ్యాసరచన, నృత్యపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనార్థన్‌రాజు, గ్రంథాలయాధికారి శంకర్‌బాబు, పట్టణ అధ్యక్షులు మురళి, పార్టీ ఉపాధ్యక్షులు పర్వేజ్, రాజేంద్ర, గీత, నియాజ్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదల కడుపులు నింపుతున్న అన్న క్యాంటీన్లు
* తుడా చైర్మన్ నరసింహ యాదవ్ వెల్లడి
తిరుపతి, నవంబర్ 20: నగరంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు పేదల కడుపులు నింపుతున్నాయని తుడా చైర్మన్ నరసింహ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 9గంటలకు స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని అన్న క్యాంటీన్‌ను తుడా చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు అందిస్తున్న అల్పాహారం నాణ్యతను ఆయన పరిశీలించారు. తాను కూడా అల్పాహారం తీసుకుని వాటి రుచిని పరిశీలించి, అల్పాహారం తీసుకుంటున్న వారితో మాట్లాడారు. ఈసందర్భంగా పలువురు అన్న క్యాంటీన్లో అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఎంతో శుచిగా, శుభ్రంగా ఉంటున్నాయని, రూ. 5కే తమ ఆకలి తీరుతోందని చెప్పారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు ఏ ఒక్కటి కూడా పేదల అభ్యున్నతికి, వారి అభివృద్ధికి పాటుపడిన దాఖలాల్లేవన్నారు. తమ పబ్బం గడుపుకోవడానికి హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ, పేదల ఆకలి తెలిసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఏర్పడ్డా ఎక్కడా పేదల సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి తన కళ్లుగా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కారణంగానే నేడు దేశంలోని అన్ని పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి పేదల పార్టీని కేంద్రంలో స్థాపించడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఏ పార్టీని బాబు క్షమించరని అన్నారు. ఓట్లు కోసం కొందరు తక్కువ ధరకే క్యాంటీన్లు నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు.

ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
తిరుపతి, నవంబర్ 20: తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి మంగళవారం ఉదయం ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి అభిషస్తక్రం, పుష్పాలంకారం, హారతి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వరాహపురాణం నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా చెప్పబడింది. ఈకార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ సూపరింటెండెంట్ శశిధర్, ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు.