చిత్తూరు

అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 20: జిల్లాలో అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించే దిశగా చర్యలు చేపట్టామని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరం నాగయ్య కళాక్షేత్రంలో వివిధ పథకాల కింద నిర్మించిన పక్కా ఇళ్లను కంప్యూటరైజ్‌డ్ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పట్టణంలో అర్బన్ హౌసింగ్ కింద 4150 ఇళ్లకు గాను సంక్రాంతికి 1500 ఇళ్లు నిర్మిస్తారన్నారు. మిగిలిన ఇళ్లను ఉగాదిలోగా నిర్మాణాలు పూర్తిచేయనున్నట్లు చెప్పారు. చిత్తూరు నగరంలో ఆధునిక టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతోందన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ ఇళ్లను తూర్పు గోదావరి జిల్లాలో మొదలు పెట్టారని, ఆ ఇళ్లు ఎంతో నాణ్యతగా ఉన్నాయని, అదే తరహాలో ఈ నగరంలో కూడా నిర్మించాలని నిర్ణయించామన్నారు. కొత్త టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడంతోపాటు ఇతర వౌలిక సదుపాయాలు కూడా కలుగుతాయన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ పక్కా ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుందని, తరచూ తాము వెళ్లి ఈ ఇళ్లను పరిశీలించనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులకు తమ వాటాకు సంబంధించి రుణాన్ని రెండు రోజుల వ్యవధిలో చెల్లించాలన్నారు. పేదల సొంతింటి కల నెరవేరాలన్న సంకల్పంతో కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు. కంప్యూటరైజ్‌డ్ లాటరీ పద్ధతిలో ప్లాట్లు కైవసం చేసుకున్న వారిని కలెక్టర్ అభినందించారు. ఎమ్మెల్సీ రాజసింహులు మాట్లాడుతూ చిత్తూరు పట్టణంలో అర్బన్ హౌసింగ్ కింద పూనేపల్లిలో 3500 ఇళ్లు, సాంబయ్యకండిగలో 650 ఇళ్ల నిర్మాణాలు త్వరలో పూర్తవుతాయన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంతోపాటు ఆ ప్రాంతాల్లో అంగన్‌వాడీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, టెంపుల్ హౌస్‌తోపాటు ఇతర వౌళిక వసతులు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తారకరామారావు ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, నీడ ఉండాలనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అదే తరహాలో నేటి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. నగర మేయర్ హేమలత మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇళ్లు మంజూరైన వారు తమ రుణాన్ని సకాలంలో చెల్లించి సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నారు. కంప్యూటరైజ్‌డ్ లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ ఓబులేష్, అధికారులు, నగర పాలక సంస్థ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.