చిత్తూరు

త్వరలో బూత్ కమిటీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: త్వరలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు త్వరలో బూత్‌కమిటీలు ఏర్పాటుచేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బ్లిజ్ హోటల్లో చిత్తూరు, కర్నూలు, కడప నియోజక వర్గాల సమన్వకర్తలు, ఏఐసీసీ, పీసీసీ కార్యవర్గ సభ్యుల సమీక్షా సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 12 వరకు జిల్లాలో చేపట్టాల్సిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని కొనసాగించి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46వేల పోలింగ్ బూత్‌లకు సంబంధించి ఒక్కో కమిటీలో 10 మందితో కమిటీలు వేయడానికి నిర్ణయించామని ఆయన చెప్పారు. దిగువ శ్రేణి అభిప్రాయాలను రాహుల్ గాంధీకి పీసీసీ, ఏఐసీసీ తీసుకునే నిర్ణయాలను దిగువ శ్రేణి వరకు తీసుకు వెళ్లేందుకు ప్రాజెక్టు శక్తికి సంబంధించి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను ఎలా అమలు చేయాలో చెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు మయ్యప్పన్, తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్, ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ మాజీ సభ్యురాలు కమలమ్మ, సత్యవేడు నియోజక వర్గ ఇన్చార్జ్ పెనుబాల చంద్రశేఖర్, డాక్టర్ బత్తయ్య నాయుడు, కడప, చిత్తూరు, కర్నూలుకు చెందిన నియోజకవర్గ ఇన్చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా యాదమరి, తిరుపతి, చిత్తూరుకు చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు రఘువీరా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి రఘువీరా రెడ్డి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు.

ఆంధ్రాలో బీజేపీని నిషేధించాలి
అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బీజేపీని నిషేధించాలన్నారు. అదే పరిస్థితి వైకాపా, జనసేన పార్టీలకు పడుతుందని హెచ్చరించారు. ఉప రాష్టప్రతి, రాష్టప్రతి ఎన్నికలు జరిగితే వైకాపా బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీని సమర్థించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని తమ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు. బీజేపీకి మద్దతు పలకడం ద్వారా ఈ రెండు పార్టీలు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నారా అని వైకాపా, జనసేన నేతలను ప్రశ్నించారు. ముస్లింలు, దళితులపై బీజేపీ అతి కిరాతకంగా దాడులు జరిపిస్తోందని, యుద్ధ విమానాలు కొనుగోళ్లలో రూ. 30వేల కోట్లు కుంభకోణానికి పాల్పడిందని, అలాంటి బీజేపీని ఎందుకు సమర్థిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ధైర్యం ఉంటే బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆ ఆటలు ఇక సాగవన్నారు. ఇప్పటికైనా మారాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులకు పాల్పడినా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం ఖాయమన్నారు.