చిత్తూరు

నక్సలైట్ల యాక్షన్ టీం కోసం గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, నవంబర్ 21: శాంతి భద్రతల పర్యవేక్షణ లక్ష్యంగా పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా పోరాటపు ముసుగులో ఉన్న నక్సలైట్ల యాక్షన్ టీంకు సబంధించిన పోస్టర్లను స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో ఇదే అదునుగా భావించి కొన్ని అసాంఘిక శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పార్టీల ర్యాలీలు, ప్రచారాలు, సభలు, సమావేశాలకు ఎన్నికల అధికారులతోపాటు పోలీసుశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్మకుండా నిషేధించినట్లు తెలిపారు. ఇప్పటికే బెల్టుషాపుల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. వాహనాల తనిఖీ విస్తుృతంగా సాగుతుందని, నగదు, విలువైన వస్తువులకు సంబంధించి తగిన పత్రాలు చూపాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో నక్సలైట్ల యాక్షన్ టీం కోసం గాలింపు జరుగుతుందని, పోలీసుశాఖకు సమాచారం తెలిపిన వారికి నగదు బహుమతి ఇవ్వటంతోపాటు, అనంతరం ఆటోలకు సిఐ స్వయంగా పోస్టర్లను అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఇళ్లా రాజేష్, చండ్రుగొండ ఎస్సై ప్రసాద్, అన్నపురెడ్డిపల్లి ఎస్సై శ్రీరాముల శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.

యాదవులు ఐక్యంగా ఉండాలి
* టీటీడీ చైర్మన్ సుధాకర్‌యాదవ్
ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 21: యాదవులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, అలా జరగాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. బుధవారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనసమారాధాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా ఉండటంతో పాటు యాదవుల పేరు చివర యాదవ అని నామకరణం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా అందరూ విద్యావంతులుగా ఎదగటంతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. అలాగే మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహసభ మండల అధ్యక్ష, కార్యదర్శులు, మహిళలకు దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మచ్చ శ్రీనివాసయాదవ్, చిత్తారు సింహద్రియాదవ్, శివరామ్‌యాదవ్, దుబాకుల శ్రీనుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులకు టీడీపీ వ్యతిరేకం కాదు
* సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర
* పాకలగూడెంలో పలుకులుంబాలు టీడీపీలో చేరిక
సత్తుపల్లి, నవంబర్ 21: పాస్‌పుస్తకాలు రాకుండా చేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం, తహశీల్దార్ కార్యాలయంలో కొంతమంది దళారులుగా ఏర్పడి ప్రవేశించి మధ్యవర్తులుగా కోట్ల రూపాయలు దండుకున్నారని, పోలీస్ స్టేషన్లలో పైరవీకారులకు నిలయంగా చేస్తున్న వ్యక్తులు, బెదిరింపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని ప్రజా కూటమి అభ్యర్థి సంఢ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. సత్తుపల్లి మండలం పరిధిలోని పాకలగూడెంలో కంచు మల్లేష్ ఆధ్వర్యంలో బుధవారం పలు కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామప్రాజెక్టు వ్యతిరేకమంటూ అసత్య ప్రచారాలకు తెరతీయడం మంచిపద్దతి కాదని, తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కమీషన్లు దండుకునేందుకు వ్యతిరేకమన్నారు తెలంగాణ, ఆంద్ర అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, అభివృద్దిలో పోటీ పడాలని తెలుగుదేవం పార్టీ భావిస్తుందన్నారు. తెలంగాణలో పుట్టిన బిడ్డగా చెపుతున్నాం, ఈఫ్రాంత ప్రయోజనాలకు భంగం వాటిల్లితే తెలంగాణ బిడ్డలెవరూ ఊరుకోరన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో పాస్ పుస్తకాలు రాకుండా ఇబ్బంది పెట్టినవారందరికి రెవెన్యూ రికార్డులు సరిచేసైనా సరే పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు. ఇళ్ళులేక నిరుపేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ముస్లీం, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచేకొని వచ్చే ఏడాది కాలంలో 2లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, సంవత్సరానికి 6గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఏకకాలంలో రూ.2లక్షల రుణమాణీ, రూ.5లక్షలతో సొంతింటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు. ఈ నెల 22న సత్తుపల్లి మండలం రామానగరం నుంచి అధికారికంగా మహాకూటమి అభ్యర్థిగా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నామని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, నేతలు దొడ్డా శంకర్‌రావు, కూసంపూడి రామారావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఉడతనేని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.