చిత్తూరు

టీడీపీ సభ్యత్వ నమోదులో అందరూ క్రియాశీలకంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: తిరుపతి నియోజక వర్గ పరిధిలో టీడీపీ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా పనిచేయాలని ఎమ్మెల్సీ, సభ్యత్వ నమోదు పరిశీలకులు రాజసింహులు నాయకులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే తిరుపతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ఆలస్యంగా జరుగుతున్న తీరుపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గుర్తించారు. దీనిపై ఎమ్మెల్సీ రాజసింహులును ప్రత్యేకంగా నియమిస్తూ సభ్యత్వ నమోదును వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన నాయకులతో సభ్యత్వ నమోదులో జరుగుతున్న ఆలస్యంపై చర్చించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ గైర్హాజరయినా, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ సుధారాణి, నీలం బాలాజీ, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్.విజయలక్ష్మీ, శాఫ్ డైరెక్టర్ శ్రీ్ధర్ వర్మ, తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ ఆర్సీ మునికృష్ణ, రాష్ట్ర గ్రంథాలయ బోర్డు డైరెక్టర్ సూరా సుధాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డైరెక్టర్ సింధూజ, రాష్ట్ర చేనేత సహకార సంఘం డైరెక్టర్ వసంత, టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి యాదవ్, కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు నేతలు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ఆలస్యం వెనుక తాము కారణం కాదంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆలస్యం వెనుకవున్న ఆంతర్యాన్ని నిదానంగా బయటపెట్టారు. 2017లో తిరుపతిలో జిల్లాలోనే అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాము ఎంతమందిని పార్టీలో చేర్పించింది చెప్పారు. నగరంలోని 50 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు కనీసం 500 నుంచి 900 వరకు సభ్యత్వ నమోదు కార్డులు అందలేదని ఆయనకు వివరించారు. కొన్ని వార్డుల్లో కేవలం వందల సంఖ్యలోనే అందాయని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సభ్యత్వ నమోదు కార్డులు తిరుపతి కార్యాలయానికి అందినా అవి ఆయా డివిజన్ల నాయకులకు ఎందుకు అందలేదో ముందు ఆరా తీయాలన్నారు. ఇప్పటికీ కొందరు తమను ఇదే విషయం ప్రశ్నిస్తున్నారని వాపోయారు. ఇప్పుడు మళ్లీ సభ్యత్వ నమోదు చేస్తే తిరిగి వారికి సభ్యత్వ కార్డులు రాకుంటే తమను అపార్థం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే డివిజన్ల పరిధిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నామని చెప్పారు. ఈ విషయాన్ని తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకు వెళతానని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తానని తెలిపారు. ఏడు డివిజన్లకు ఒక ట్యాబ్ ఆపరేటర్‌ను చొప్పున ఏడుగురు ట్యాబ్ ఆపరేటర్లు ఉన్నారని, దీని ద్వారా ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని ఎమ్మెల్సీ రాజసింహులు నాయకులకు సూచించారు. పార్టీ ఇచ్చిన పదవులు అనుభవిస్తూ, జిల్లా, రాష్ట్ర నాయకులుగా ఉన్నవారు ఇలా అలసత్వం వహిస్తే అధిష్ఠానం తీవ్రంగానే పరిగణిస్తుందన్న విషయాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో నాయకుల్లో ఇలాంటి నిరుత్సాహం తగదని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకుని గతంలోకన్నా ఎక్కువగా సభ్యత్వం చేయాలని రాజసింహులు నాయకులకు సూచించారు.

ఉపాధ్యాయుల కొరతతో విద్యాప్రమాణాలు పతనం
* ఎస్టీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వర రావు ఆవేదన
వెదురుకుప్పం, డిసెంబర్ 4: ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతతో విద్యాప్రమాణాలు పతనం అవుతున్నాయని, హడక్ రూల్స్‌తో పదోన్నతుల ద్వారా 6000 ఖాళీలను భర్తీచేయాలని రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్వేటినగరం ఉర్దూ పాఠశాలలో మంగళవారం జరిగిన ఎస్టీయూ ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలులో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం తీవ్రజాప్యం చేసిందన్నారు. హడక్ రూల్స్‌తో పదోన్నతులు చేపట్టాలన్నారు. పండిట్, పీఈటీ అప్‌గ్రేషన్ విషయంలో నియామకాలను ప్రభుత్వం అనుసరించే విధానాలే పదోన్నతికి కూడా వర్తింపుచేయాలని, అప్‌గ్రేడ్ పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం మేరకు దాదాపు 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, కేవలం 7765 పోస్టులు మాత్రం భర్తీ చేయడం విద్యారంగం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే నిదర్శనమన్నారు. రాష్ట్ర ఎస్టీయూ ఉపాధ్యక్షుడు వజ్రవేలు రెడ్డి మాట్లాడుతూ 11 వేతన సవరణ ఈ యేడాది జూలై నుంచి అమలుచేయాల్సి ఉన్న నేపథ్యంలో పీఆర్‌సీ నివేదిక సమర్పించేలోపు 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. పీఆర్‌సీ కమిటీ వెంటనే మధ్యంతర భృతి నివేదికను సమర్పించాలని కోరారు. పాఠశాలల పర్యవేక్షణ పటిష్టం చేయడానికి జిల్లాకు ఇద్దరు డీఈఓలు, నియోజకవర్గానికి ఒక డీవైఈఓ, మండలానికి ఇద్దరు ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని బయోమెట్రిక్ విధానాన్ని సమీక్షించి తగు ప్రత్యామ్నాయాలను అమలుచేయాలన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ అమీద్‌బాషా, జిల్లా నాయకులు హేమచంద్రారెడ్డి, శివశంకర్, శివాజీ, నియాంతుల్లా, కెకె సుబ్రహ్మణ్యం, పురుషోత్తం, వాసు, యువరాజు, పయని, షణ్ముగం, మండల శాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.