చిత్తూరు

జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 4: జిల్లాలో స్వచ్ఛమైన నూటికి నూరుశాతం తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు కావాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలో కలెక్టర్ ఓటర్ల జాబితాపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, తహశీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తరువాత మ్యానువల్ ఫైల్‌తో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఫైల్‌ను కూడా సరిచూసుకోవాలన్నారు. రిజిస్టర్ అయిన మరణాల వివరాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా సరిచూసుకొని ఓటర్ల జాబితా నుంచి ఆ పేర్లు తొలగించాలన్నారు. ఇప్పటికే కొన్ని అనుమానాలకు సంబంధించి ఓటర్ల జాబితాను సంబంధిత తహశీల్దార్లకు పంపడం జరిగిందని, వాటిని పక్కాగా పరిశీలించాలన్నారు. జిల్లాలో ఎక్కడా డబుల్ ఎంట్రీలు ఉండరాదన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేటప్పుడు అందుకు సంబంధించిన పూర్తి అధారాలు తీసుకోవాలని తెలిపారు. అందిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలించాలన్నారు. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేయాలని, ఇందులో ఎటువంటి పొరపాట్లు జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో నూటికి నూరు శాతం స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు కావాలని, ఇందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బోగస్ ఓట్లు ఉండటానికి వీలు లేదని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు లేకపోయినా, బోగస్ ఓట్లు ఉన్నా సంబంధిత అధికారులు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గిరీష, తిరుపతి, మదనపల్లి సబ్ కలెక్టర్లు మహేష్‌కుమార్, కీర్తి, డీఆర్‌వో గంగాధర్‌గౌడ్, తుడా కార్యదర్శి మాధవీలత, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నేడు కేంద్ర కరవు బృందం జిల్లాకు రాక
* 6న కరవు పరిస్థితిని పరిశీలించనున్న బృందం
చిత్తూరు, డిసెంబర్ 4: కేంద్ర కరవు బృందం బుధవారం రాత్రి జిల్లాకు రానున్నది. గురువారం జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితిని ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నది. ఇందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. కేంద్ర బృంద సభ్యులైన అమితౌవ్ చక్రవర్తి, ముకేష్‌కుమార్, అమల్‌రాజ్ అనంతపురం జిల్లాలో పర్యటన ముగించుకొని బుధవారం హార్సిలీ హిల్స్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం మదనపల్లి నుంచి తిరుపతి వరకు పలు ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించన్నుది. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో తాగు, సాగునీరు పరిస్థితి, పంటల సాగు, ఈ ఎడాది నెలకొన్న కరవు పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. పలు చోట్ల రైతులతోను సమావేశం కానున్నారు. అనంతరం తిరుపతిలో జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై వివిధ శాఖలు ఏర్పాటు చేయనున్న ఫొటో ప్రదర్శనను తిలకించనున్నారు. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోగా, అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తారస్థాయికి చేరుకుంది. జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వేసవిలో ఈ సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లాలో పర్యటించే కేంద్ర కరవు బృందంపై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.