చిత్తూరు

వసతి గదుల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, 2, 3వ సత్రాల్లో గదులు పొందే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వసతి కల్పన విభాగం, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల ఈఓ కార్యాలయంలో సోమవారం తిరుపతి వసతికల్పన విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ 2, 3వ సత్రాలు రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండటంతో ఎక్కువ మంది భక్తులు బస చేసేందుకు అనువుగా సౌకర్యాలు పెంచాలని సూచించారు. ప్రతి గదిలో స్వామి, అమ్మవార్ల చిత్రపటం ఉంచాలన్నారు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ప్రతిగదినీ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చోట్ల ట్యూబ్‌లైట్లు, బల్బులు మార్చాలని, ఇతర లోటుపాట్లను సవరించాలని ఆదేశించారు. సత్రాల వద్ద శిథిలావస్థలో ఉన్న టీటీడీ క్వార్టర్స్ స్థానంలో భక్తులకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీనివాసం కాంప్లెక్స్‌లో రూ. 300 టిక్కెట్ల లభ్యత సమాచారాన్ని భక్తులు తెలుసుకునేందుకు వీలుగా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. శ్రీనివాసం, విష్ణునివాసం, సత్రాల్లో, డార్మిటరీల్లో లాకర్ల సంఖ్యను పెంచాలని, గదుల లభ్యతకు సంబంధించి డిస్‌ప్లే బోర్డులు, యాత్రికులకు సమాచారాన్ని తెలిపేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుచేయాలని ఈఓ సూచించారు. గదుల బుకింగ్ కౌంటర్ల పనివేళలను ప్రదర్శించాలన్నారు. ఆయా వసతి సముదాయాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను భక్తులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు సంబంధిత విభాగాల అధికారులు నివేదికను రూపొందించాలన్నారు. సెక్యూరిటీ, ఐటీ విభాగాల సేవలపై సమీక్షించారు. సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఈఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, ఎఫ్‌ఏసీఏఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసం డిప్యూటీ ఈఓ చెంగల్రాయులు, విష్ణునివాసం డిప్యూటీ ఈఓ హేమచంద్రారెడ్డి, వసతి కల్పన విభాగం ప్రత్యేకాధికారి మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.