చిత్తూరు

స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 10: స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టికి తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర 4వ ఆర్థిక సంఘం చైర్మన్ నాంచారయ్య వెల్లడించారు. సోమవారం చిత్తూరు జడ్పీ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులతో స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితులపై సమీక్షించారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నేడు 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు రావడంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు సక్రమంగా అందడం లేదని, రాష్ట్ర ఫైనాన్స్ ద్వారా కూడా అనుకొన్నంత మేర నిధులు రావడం లేదన్నారు. దీని వల్ల కొంత ఇబ్బందికరమైన సమస్యలు వస్తున్నాయని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల నిధులు పరిస్థితులను స్వయంగా పరిశీలించడంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక సంస్థలను బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థలు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న వాటిపై చర్చించి, తదుపరి స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి రాష్ట్ర 4వ ఆర్థిక సంఘం చైర్మన్ నాంచారయ్యకు జడ్పీ చైర్ పర్ప్‌న్ గీర్వాణీ చంద్రప్రకాష్ విన్నవించారు. నేడు 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వెళ్తుండడంతో మండల, జిల్లా పరిషత్ లకు నిధులు కొరత నెలకొందని, అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. కొందరు ఎంపీపీలు, జడ్పీటీసీలు మాట్లాడుతూ మేము ఉత్సవ మూర్తులయ్యామని, నిధులు లేక విధులు లేక ప్రజల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి చేయాలన్న నిధుల కొరత కారణంగా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై రాష్ట్ర 4వ ఆర్థిక సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. జడ్పీలోని పంచాయతీ రాజ్ కార్మికులకు పింఛన్లు ఇవ్వడం జడ్పీకి భారంగా మారిందని, పంచాయతీ రాజ్ ఉద్యోగులు సంఘం అధ్యక్షులు చంద్రప్రకాష్ సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం జడ్పీ పరంగా పింఛన్ల కోసం 1.80 కోట్లను కేటాయించాల్సి వస్తున్నదని, ఇకపై ఈ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
పంచాయతీల వౌలిక వసతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
గ్రామ పంచాయతీల వౌలిక వసతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని పలువురు ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు రాష్ట్ర 4వ ఆర్థిక సంఘం అధ్యక్షులకు విన్నవించారు. గ్రామ పంచాయతీలు నిధులు వ్యయం వౌలిక వసతులపై చిత్తూరులోని డిఆర్‌డిఏ సమావేశ భవనంలో ఈ సంఘం ప్రతినిధులు సమీక్షించారు. ఈసందర్భంగా పలువురు ఎంపీడీఓలు పంచాయతీ అధికారులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లోని గ్రామాలకు వౌలిక వసతులకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు, అవసరమైన సిబ్బందిని నియమించాలని, పంచాయతీల్లో అనధికార లే అవుట్లను నియంత్రించే విధంగా పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలని, సర్పంచ్‌లుగా ఎన్నికయ్యే వారికి కనీస విద్యార్హత ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు పన్నులు పెంచే విధంగా అధికారాలను పంచాయతీలకు ఇవ్వాలని విన్నవించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షులు నాంచారయ్య మాట్లాడుతూ పంచాయతీలు బలోపేతానికి ఇచ్చిన అన్ని సలహాలు, సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు జయసింహులు, నాగరాజు, భాస్కర్ , డిపీఓ సురేష్ నాయడు, పలువురు ఎంపీడీఓలు పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.