చిత్తూరు

శక్తివంతంగా ఎదగలాంటే యోగా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 12 : ఆరోగ్యమైన పిల్లలు శక్తివంతమైన వారుగా ఎదగాలంటే యోగా చేయడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న సూచించారు. చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని గాజులపల్లె సమంత ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన యోగ్రామ్ (యోగా గ్రామం) అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 10 గ్రామ పంచాయతీలు, 30 గ్రామాల్లో 15 రోజుల పాటు యోగ్రామ ద్వారా పతంజలి యోగా ప్రక్రియ ఆసనాలపై ఉచితంగా శిక్షణను ఇస్తారని తెలిపారు. యోగాసనం అనేది మన పూర్వీకులు మనకూ ప్రపంచానికీ ఇచ్చిన సంపదన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంకా ఎక్కువ శక్తి సామర్ధ్యాలు గల మనుషులుగా తయారు కావాలంటే క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. అందరూ కలిసి చేసే యోగాకు ఇంకా ఎక్కువ ఆదరణ అనేది వస్తుందన్నారు. హిమోగ్లోబిన్ 14 శాతం దాటితే దాదాపు ఏ జబ్బులు దరి చేరవన్నారు. హిమోగ్లోబిన్ పెరగాలంటే యోగా చేయాలని సూచించారు. అదేవిధంగా మంచి ఆహార పద్ధతులు పాటిస్తే కూడా జబ్బులు రావని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో తినే ఆహార పదార్థాలను మన దేశంలో తినడం కారణంగా కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం మొదలు పెట్టించామని, ఇందులో భాగంగా జిల్లాలో 1.58 లక్షల హెక్టార్లలో పలువురు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాలో ఆరోగ్య సమస్యలనేవి తగ్గుముఖం పడతాయని వివరించారు. అంతకుముందు కోయంబత్తూరుకు చెందిన పద్మశ్రీ వి నానమ్మాళ్ ప్రదర్శించిన యోగాసనాలు అబ్బురపరిచాయి. చివరిగా చిత్తూరు జిల్లా యోగా అసోసియేషన్ విద్యార్థులు యోగసానాలు వేసి అందరికీ వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కఠారి హేమలత, మదనపల్లెకు చెందిన ప్రకృతి ప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగస్వామి, యోగా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులునాయుడు, ప్రమోద్, మెప్మా పీడీ నాగజ్యోతి, సమాచారశాఖ డీడీ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.